ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 26న ఖేలో ఇండియా తాలూకు రెండో జాతీయ స్థాయి శీత‌కాల ఆటల లో ప్రారంభోప‌న్యాసం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 FEB 2021 4:55PM by PIB Hyderabad

ఖేలో ఇండియా తాలూకు జాతీయ స్థాయి శీత‌కాల ఆట ల ప‌రంప‌ర లో భాగం గా జ‌రుగుతున్న రెండో ఆటల పోటీల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 26న ఉద‌యం 11:50 గంట‌ల కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభోప‌న్యాసం చేయ‌నున్నారు.
 
ఈ ఆటల ను ఈ నెల 26వ తేదీ మొదలుకొని మార్చి నెల 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని జె & కె స్పోర్ట్స్ కౌన్సిల్‌, వింట‌ర్ గేమ్స్ అసోసియేశన్ ఆఫ్ జె & కె ల స‌హ‌కారం తో కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ నిర్వ‌హిస్తున్నది.  దీనిలో ఎత్తయిన మంచు పర్వతాల పై జారడం, నార్డిక్ స్కీ, స్నోబోర్డింగ్‌, స్కీ మౌంటినియరింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్టాక్ మొదలైన ఆట లు భాగం గా ఉంటాయి.  ఈ ఆట‌ల లో పాలుపంచుకోవ‌డానికి గాను 27 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల తో పాటు బోర్డు లు కూడా వాటి వాటి జ‌ట్టుల ను పంపుతున్నాయి.

 

 

*****



(Release ID: 1700808) Visitor Counter : 86