ప్రధాన మంత్రి కార్యాలయం

కాలం చెల్లిపోయిన ఆలోచ‌నా ధోర‌ణుల భిన్నంగా పయనించడం, కొత్త అన్వేషణలు మన స్టార్టప్ ల పెద్ద ప్రత్యేకత : పిఎం శ్రీ మోదీ

Posted On: 16 JAN 2021 9:20PM by PIB Hyderabad

సాధారణ ధోరణుల నుంచి భిన్నంగా పయనించడం, కొత్త అన్వేషణలు ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ప్రపంచం పెద్ద ప్రత్యేకత అని ప్రధానమంత్రి అన్నారు. “ప్రారంభ్ :  స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ శిఖరాగ్రం”లో వీడియో కాన్ఫరెన్సింగ్ లో  ఆయన మాట్లాడుతూ కొత్త అన్వేషణల ద్వారా స్టార్టప్ లు కొత్త ధోరణులు, కొత్త టెక్నాలజీలు, కొత్త మార్గాల్లో పయనించారన్నారు. 

కాలం చెల్లిపోయిన ఆలోచనా ధోరణుల నుంచి వారు పూర్తిగా వేరుపడ్డారని ఆయన చెప్పారు. 

భిన్న రంగాలకు సంబంధించి విభిన్న ఆలోచనలతో భారీ సంఖ్యలో నవ అన్వేషణలు రావడంతో ప్రతీ ఒక్కరూ సాధారణ బాటకు భిన్నంగా పయనించడంపై దృష్టి సారించవలసి వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. విభిన్న రంగాలను వారు విప్లవాత్మకంగా మార్చారని ఆయన చెప్పారు.  సాంప్రదాయిక వాదం కన్నా తాము చేసే పనిపై వ్యామోహమే ఈ వ్యవస్థను ముందుకు నడిపించిన అంశమని తెలిపారు. ఈ రోజు భారత్ నడుస్తున్న బాటలో “నేను చేయగలను” అనే ధోరణే అధికంగా ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. 

***
 



(Release ID: 1689554) Visitor Counter : 96