ప్రధాన మంత్రి కార్యాలయం

ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్‌లో డ్రైవర్ రహిత రైలు ప్రయాణ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగపాఠం

Posted On: 28 DEC 2020 1:29PM by PIB Hyderabad

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ హర్దీప్ సింగ్ పురీజీఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జీడీఎంఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మంగూసింగ్ జీదేశవ్యాప్తంగా కొనసాగుతున్న మెట్రో సేవల ఉన్నతాధికారులునా ప్రియ సోదరసోదరీమణులారా,

దాదాపు మూడేళ్ల క్రితం మెజెంటా లైన్ ను ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. ఇవాళ మరోసారి ఇదే మార్గంలో దేశంలో తొలిసారిగా పూర్తి అటోమెటెడ్ మెట్రో.. మన భాషలో చెప్పాలంటే ‘డ్రైవర్ లెస్ మెట్రో’ను ప్రారంభించే అవకాశం లభించింది. భారతదేశం స్మార్ట్ సేవలవైపు ఎంత వేగంగా ముందుకెళ్తోందనడానికి ఈ మార్పులే నిదర్శనం. ఇవాళ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ తో ఢిల్లీ మెట్రో అనుసంధానమైంది. గతేడాది అహ్మదాబాద్ నుంచి ఈ కార్డు ప్రారంభమైంది. ఇవాళ ఈ కార్డు ఢిల్లీ మెట్రోలో ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్‌తో అనుసంధానమవుతోంది. నేటి ఈ కార్యక్రమం.. పట్టణాభివృద్ధి శాఖతోపాటు.. అర్బన్ రెడీఫ్యూచర్ రెడీ సంస్థల కృషి ఫలితమే.

మిత్రులారా,

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశాన్ని సిద్ధం చేసేందుకు ఇవాళే పనిచేయడం ఈ ప్రభుత్వ కీలక బాధ్యత. కానీ కొన్ని దశాబ్దాల క్రితం పట్టణీకరణ ప్రభావంపట్టణీకరణ భవిష్యత్తు స్పష్టంగా కనిపించేవి. ఆ సమయంలో ఓ ప్రత్యేకమైన పరిస్థితిని దేశం గమనించింది. దేశ భవిష్యత్తు అవసరాలపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. సగం మనసుతోనే పనులు జరిగేవి. ప్రతి అంశంపై భ్రమలు పెంచే వాతావరణం కనిపించేది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నప్పటకీ దాని తదనంతర ప్రభావాలకు అనుగుణంగా మన  పట్టణాలను మాత్రం సిద్ధం చేయలేదు. దీని ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో పట్టణ మౌలికవసతుల డిమాండ్.. వాటిని తీర్చడంలో స్పష్టమైన తేడా కనిపించింది.

మిత్రులారా,

దీన్నుంచి బయటకు వచ్చి.. పట్టణీకరణను.. ఓ సవాల్ గా కాకుండా.. ఓ అవసరంగాఅవకాశంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది. దేశంలో చక్కటి మౌలికవసతుల కల్పనకు ఓ అవకాశంగా చూడాలి. ప్రజల జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఓ అవకాశంగా చూడాలి. మన ఆలోచనలో మార్పే పట్టణీకరణలో ప్రతి అవకాశంలో కనిపిస్తుంది. దేశంలో మెట్రో రైలు నిర్మాణం ఇందుకు ఓ ఉదాహరణ. ఢిల్లీలోనే మెట్రోకు సంబంధించి ఏళ్లతరబడి చర్చ జరిగింది. కానీ తొలి మెట్రో మాత్రం అటల్ జీ కృషికారణంగానే పట్టాలెక్కింది. ఇవాళ్టి కార్యక్రమంలో మెట్రో నిపుణులు అందరికీ.. మెట్రో నిర్మాణంలో ఏ పరిస్థితి ఉండేదో చాలా బాగా తెలుసు.

మిత్రులారా,

2014లో మా ప్రభుత్వం ఏర్పాటైనపుడు.. కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో ఉండేది. ఇవాళ 18 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.  2025 నాటికి కనీసం 25కు పైగా నగరాల్లో మెట్రో సేవలను విస్తరించబోతున్నాం. 2014లో దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో అందుబాటులో ఉండేది. నేడు ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి 700 కిలోమీటర్లకు పైగా విస్తరించి సేవలందిస్తోంది. 2025 నాటికి ఇది 1700 కిలోమీటర్లకు పెంచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 2014లో మెట్రోలో ప్రయాణించేవారి  సంఖ్య రోజూ 17 లక్షలుగా ఉండేది.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదురెట్లు పెరిగి 85 లక్షలకు చేరింది. ఇవి కేవలం లెక్కలు మాత్రమే కాదు.. కోట్లమంది భారతీయుల జీవనాలను సౌకర్యవంతం చేశామనడానికి రుజువులు. ఇది కేవలం ఇటుకలురాళ్లుకాంక్రీట్ఇనుముతో నిర్మించినది మాత్రమే కాదు.. దేశ ప్రజలమరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేశామనడానికి సాక్ష్యం.

మిత్రులారా,

చివరకు ఈ విషయంలో మార్పు ఎలా వచ్చిందిఅదే అధికారులుపనిచేసేవాళ్లు వారేకానీ పని ఇంత వేగంగా ఎలా జరిగింది. ఇందుకు కారణం.. మేం పట్టణీకరణను ఓ సవాల్ గా కాకుండడా.. ఓ అవసరంగా మార్చాం. గతంలో మన దేశంలో మెట్రోకు సంబంధించిన ప్రత్యేకమైన నియమనిబంధనలు ఉండేవి కావు. కొందరు నేతలు ఏవో వాగ్దా్నాలు చేసి వస్తారు. మరికొన్ని పార్టీలు ప్రజలను సంతృప్తి పరచేందుకు మెట్రో పై ప్రకటన చేసేవి. మా ప్రభుత్వం ఇలాంటి ప్రకటనుంచి బయటకు వచ్చి.. మెట్రోకోసం ఓ పాలసీని రూపొందించడంతోపాటు.. దీన్ని వేగవంతంగా అమలు కూడా చేస్తోందిక్షేత్రీయంగా ఉన్న డిమాండ్లకు అనుగుణంగా పనిచేయడంపైన దృష్టిపెట్టాం. మేకిన్ ఇండియాకు వీలైనంత ఎక్కువగా ముందుకు తీసుకెళ్లడంపైన దృష్టిపెట్టాం. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంపై దృష్టిపెట్టాం.

మిత్రులారా,

దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆకాంక్షలుఅవసరాలుఆశలుసవాళ్లుంటాయని మీలో చాలా మందికి తెలుసు. ఒకే రకమైన విధానాన్ని తీసుకుని మేం ముందుకు వెళ్లినట్లయితే.. మెట్రో సేవలను వేగంగా విస్తరించడం సాధ్యం కాదు. మెట్రోను విస్తరించడం వల్ల రవాణాకంటే.. ప్రజల అవసరాలకువివిధ రంగాల ఉద్యోగులకు ఎక్కువ లాభం జరగాలని మేం భావించాం. అందుకే వేర్వేరు నగరాల్లో వేర్వేరు విధాలుగా మెట్రో రైలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాం. దీనికి సంబంధించి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్).. ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ ఒక అద్భుతమైన మోడల్‌తో ఢిల్లీ-మీరట్ దూరాన్ని గంటకంటే తక్కువ సమయానికే తగ్గించింది.

మెట్రో లైట్: ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నచోట మెట్రో లైట్ వర్షన్ పై పనిజరుగుతోంది. ఇది సాధారణ మెట్రోకంటే 40శాతం తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వస్తుంది.

మెట్రో నియో: మెట్రో లైట్ కంటే తక్కువ ప్రయాణికులు ఉన్నచోట మెట్రో నియో పై పనిజరుగుతోంది. దీని వల్ల నగరాల మధ్య అనుసంధానతతోపాటు.. వాటికి దగ్గర్లో ఉన్న ప్రజలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లబ్ధి చేకూరుతుంది. కొచ్చిలో ఈ పని చాలా వేగంగా జరుగుతోంది.

మిత్రులారా,

మెట్రో ఇవాళ కేవలం ఓ సౌకర్యంగా మాత్రమే కాకుండా.. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. మెట్రో నెట్ వర్క్ కారణంగా రోడ్డుపై వాహనాలు తగ్గుతున్నాయి. దీంతో వాటిద్వారా తలెత్తే కాలుష్యం కూడా తగ్గుతోంది.

మిత్రులారా,

మెట్రో సేవలను విస్తరించేందుకు.. మెక్ ఇన్ ఇండియా కూడా అత్యంత కీలకం. మెక్ ఇన్ ఇండియాతో జరిగే పనుల వల్ల విదేశీ నిధులు తగ్గుతాయి. దీని ద్వారా దేశీయంగా ప్రజలకు వీలైనంత ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది. రోలింగ్ స్టాక్ మానవ వనరుల కారణంగా భారతీయ తయారీదారులకు లబ్ధి చేకూరుతుంది. ఒక్కో కోచ్ కు రూ.12కోట్లు ఖర్చు అయ్యే చోట.. అది రూ.8 కోట్లకే అందుబాటులోకి వస్తోంది.

మిత్రులారా,

ఈ రోజున నాలుగు పెద్ద కంపెనీలు మన దేశంలోనే మెట్రో కోచ్ ల తయారీ చేస్తున్నాయి. డజను కంపెనీలు వాటి విడిభాగల తయారీలో ముందున్నాయి. వీటి ద్వారా భారత్ లో తయారీ తో పాటు ఆత్మ నిర్భర భారత్ కు మద్దతు లభిస్తోంది.

మిత్రులారా,

అత్యంత ఆధునిక పరిజ్ఞాన ఉపయోగం ఈ రోజున అవసరం. డ్రైవర్ లేకుండా ప్రయాణించే మెట్రో ను ప్రారంభించే అవకాశం నాకు దొరికింది. ఈ ప్రారంభోత్సవంతో మన దేశం ప్రపంచంలో ఈ సౌలభ్యం కలిగిన అగ్రగామి దేశాల వరుసలో చేరింది. ఒకసారి బ్రేక్ వేసినప్పుడు 50 శాతం శక్తిని  గ్రిడ్ లోకి వెనక్కి పంపడం ద్వారా ఆదా చేసే సరికొత్త బ్రేకింగ్ వ్యవస్థను మనం ఉపయోగిస్తున్నాం. ఈనాడు మెట్రో లో 130 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉపయోగిస్తున్నారు. దీన్ని మరింత పెంచి 600 మెగవాట్లకు చేరుస్తారు. కృత్రిమ మేధో పద్ధతుల ద్వారా తక్కువ ప్లాట్ ఫారమ్ స్క్రీనింగ్ ద్వారాల పై పని జరుగుతోంది.      

మిత్రులారా,

ఆధునీకరణ కోసం ఒకే విధమైన ప్రమాణాలు సౌకర్యాలు అందించడం చాలా అవసరం. జాతీయ స్థాయిలో కామన్ మొబిలిటీ కార్డు ఈ దిశలో ఒక పెద్ద అడుగు. ఈ కార్డు లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మీరు  ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళండిఏ ప్రజా రవాణా మాధ్యమంలో నైనా వెళ్ళండి ఈ కార్డు మీకు అన్నిచోట్లా ప్రవేశం కల్పిస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఒక్క కార్డు చాలన్నమాట. ఇది అన్నీ చోట్లా వర్తిస్తుంది.

మిత్రులారా,

మెట్రో లో ప్రయాణించే ప్రజలు ఉన్నారుఒక టోకెన్ తీసుకోడానికి ఎంత సేపు లైన్లో వేచి ఉండాల్సి వచ్చేది.  ఒకపక్క కార్యాలయం లేదా కళాశాల కు ఆలస్యం అవుతూంటుంది మరోపక్క ఈ టిక్కెట్టు కంగారు. ఎలాగోలా మెట్రో ఎక్కి దిగారనుకోండి మళ్ళీ బస్సులో టిక్కెట్టు. ఈనాడు అందరి దగ్గర సమయం చాలా తక్కువ ఉంది కనుక ప్రయాణంలో సమయాన్ని వృధా చేయలేము. ఒక స్థలం నుండి మరొక చోటికి వెళ్లేందుకు పడే ఈ ఇబ్బందులు దేశ ప్రజల ప్రగతికి అడ్డంకులుగా మారకుండా ఉండేందుకు మేం పని చేస్తున్నాం.         

మిత్రులారా,

దేశ సామర్థ్యం సాధనాలు దేశ ప్రగతిలో సరిగ్గా ఉపయోగపడాలి ఇది మనందరి కర్తవ్యం. ఈనాడు అన్ని వ్యవస్థల్నీ ఏకీకృతం చేసి దేశాన్ని బలోపేతం చేయడం జరుగుతోంది. ఒక భారతం శ్రేష్ఠ భారతం అనే భావనకు బలం చేకూర్చడమైంది. ఒకే దేశం ఒకే రవాణా కార్డు లాగానే గత కొద్ది సంవత్సరాలుగా మా ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు చాలా పనులు చేపట్టింది. ఒకే దేశం ఒకే ఫాస్ట్ టాగ్ ద్వారా దేశంలో రహదారి ప్రయాణం సులభతరం వేగవంతం అయింది. అనవసరమైన అడ్డంకులు తప్పాయి. ట్రాఫిక్ జామ్ నుండి ముక్తి లభించింది. దేశ సమయం ఆదా అయిందిఆలస్యం వల్ల కలిగే నష్టం తగ్గింది. ఒకే దేశం ఒకే పన్ను అంటే జిఎస్టి ద్వారా పన్నుల బకాయి తగ్గిందిప్రత్యక్ష పన్నులతో ముడిపడి ఉన్న వ్యవస్థలు ఒకే విధంగా మారాయి. ఒకే దేశం ,ఒకే శక్తి గ్రిడ్ ద్వారా నలుమూలలో నిరంతర సరిపోయినంత విద్యుత్తు లభ్యత సాకరమవుతోంది.

విద్యుత్తు నష్టం తగ్గింది. ఒకే దేశం ఒకే గ్యాస్ గ్రిడ్ ద్వారా ఇది వరకు స్వప్నం గా ఉన్న సముద్రం ఆవల భాగాలలో గ్యాస్ లభిస్తోంది. ఒకే దేశం ,ఒకే ఆరోగ్య పథకం అనగా ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మంది ప్రజలు ఒక రాష్ట్రంలోనే కాక మొత్తం దేశంలో ఎక్కడైనా దీన్ని పొందుతున్నారు. ఒకే దేశం ,ఒకే రేషన్ కార్డు ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారిన వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డు తీసుకోవడం కోసం పడే ఇక్కట్లు తప్పాయి. ఒకే రేషన్ కార్డు తో దేశంలో ఎక్కడైనా రేషన్ లభ్యమవడం అనేది జరుగుతోంది. అలాగే కొత్త వ్యవసాయ చట్టం, e-nam వంటి వ్యవస్థల ద్వారా ఒకే దేశం ఒకే వ్యవసాయ బజారు వైపు దేశం ముందుకెళుతోంది.

మిత్రులారా,

దేశంలోని ప్రతి చిన్న ఊరు 21 శతాబ్దపు భారత ఆర్థిక వ్యవస్థ కు ఒక కేంద్రం కాబోతోంది. ఢిల్లీ అయితే మన దేశ రాజధాని కూడాను. ఈనాడు 21 శతాబ్దంలో దేశం ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపు పొందుతూంటే అది మన రాజధానిలో ప్రతిబింబించాలి. పాత నగరం అవడంతో కొన్ని సవాళ్ళు తప్పక ఉన్నాయి కానీ ఈ సవాళ్ళతోనే మనం దీన్ని ఆధునీకరణ చేయాలి. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యుత్తు రవాణా ను పెంచేందుకు ప్రభుత్వం వాటి కొనుగోలుపై పన్ను తొలగించింది.  

రోడ్లు,కాలనీల ఆధునీకరణ కావచ్చు లేదా మురికివాడల లో నివసించేవారికి గృహకల్పన కోసం ప్రయత్నం జరుగుతున్నాయి. ఢిల్లీ లోని పాత ప్రభుత్వ భవనాలను ఈ నాటి అవసరాలకనుగుణంగా ప్రకృతి హితంగా మార్చడం జరుగుతోంది. మౌలిక సదుపాయాలను ఆధునిక పరిజ్ఞాన ఆధారితం చేయడం జరుగుతోంది.

మిత్రులారా,

ఢిల్లీ లో పాత పర్యాటక స్థానాలతో పాటు కొత్త ఆకర్షణల కోసం పని జరుగుతోంది. ఢిల్లీ అంతర్జాతీయ సమావేశ,ప్రదర్శన ,  పర్యాటక వ్యాపారాలకు కేంద్రం కాబోతోంది. దీని కోసం ద్వారక లో దేశంలోనే అతిపెద్ద కేంద్రం నిర్మాణమవుతోంది. అలాగే కొత్త పార్లమెంట్ నిర్మాణం మొదలైన చోట ఒక పెద్ద భారత్ వందన పార్కు తయారావుతోంది. ఇలా ఢిల్లీ ప్రజలకు కొన్ని వేల ఉద్యోగాలతో పాటు నగర ముఖచిత్రం మారుతోంది.

ఢిల్లీ 130 కోట్ల జనాభాకి ప్రపంచంలో పెద్ద ఆర్థిక సైనిక బలాల రాజధాని ఈ భావ్యత ఇక్కడ కనిపించాలి. మనమందరం కలిసి ఢిల్లీ ప్రజల జీవితాలని మరింత మంచిగా మారుస్తామని ఢిల్లీ ని మరింత ఆధునికీకరిస్తామని నాకు నమ్మకం ఉంది. కొత్త సౌకర్యాల కోసం నేను దేశానికి అలాగే ఢిల్లీ వాసులకి మరొక్కసారి అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు.

***(Release ID: 1684377) Visitor Counter : 194