ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన యుకె విదేశీ వ్యవహారాలు, కామన్‌ వెల్థ్,‌ అభివృద్ధి వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ డొమినిక్ రాబ్

Posted On: 16 DEC 2020 1:18PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుకె విదేశీ వ్యవహారాలు, కామన్‌వెల్థ్,‌ అభివృద్ధి వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ డొమినిక్ రాబ్ సమావేశమయ్యారు.

యుకె ప్ర‌ధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ తో ఇటీవ‌ల టెలిఫోన్ లో తాను సంభాషించిన సంగ‌తి ని ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెస్తూ, కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచం లో భార‌త్‌-యుకె భాగ‌స్వామ్యానికి గ‌ల ప్రాముఖ్య‌త‌ ను నొక్కి చెప్పారు.  వ్యాపారం, పెట్టుబ‌డి, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, వ‌ల‌స‌లు, గ‌తిశీల‌త‌, విద్య‌, శ‌క్తి , జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న‌, ఆరోగ్యం లను చేర్చుకొంటూ ద్వైపాక్షిక సంబంధాల‌ లో పూర్తి స్థాయి సామర్ధ్యం తాలూకు ప్రయోజనాన్ని పొందేందుకు మహత్త్వాకాంక్షభరితమైన, ఫ‌లితాలు ప్ర‌ధానంగా ఉండేటటువంటి స‌మ‌గ్ర మార్గ‌సూచీ ని రూపొందించాలంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

ప్ర‌ధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ ప‌క్షాన‌ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ రాబ్ ప్ర‌ధాన మంత్రి కి శుభాకాంక్ష‌ల‌ను వ్యక్తం చేసి, యుకె ఇటీవ‌ల స‌హ-ఆతిథేయి దేశం గా వ్య‌వ‌హ‌రించిన ‘క్లైమేట్ యాంబిషన్ సమిట్’ లో పాలుపంచుకొన్నందుకు ప్ర‌ధాన మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలిపారు.  యుకె ప్ర‌భుత్వం  ఉమ్మ‌డి విలువ‌లు, ఉమ్మడి హితాలు ఆధారం గా భార‌త‌దేశం తో కలసి తన సంబంధాలను ముందుకు తీసుకుపోవడానికి, ప్ర‌పంచ ఉమ్మడి స‌వాళ్ళ‌ ను క‌ల‌సిక‌ట్టుగా ఎదుర్కొనే సామర్థ్యాలకు ప్రాధాన్యాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ రాబ్ తమ ప్రధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ వ‌చ్చే సంవ‌త్స‌రం లో యుకె అధ్య‌క్ష‌త‌న జ‌రుగ‌నున్న జి7 స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి ని ఆహ్వానిస్తూ రాసిన ఒక లేఖ‌ ను ఈ సందర్భం లో శ్రీ మోదీ కి  అంద‌జేశారు.  ప్ర‌ధాన మంత్రి ఆయన కు ధ‌న్య‌వాదాలు తెలిపి, ఆ ఆహ్వానాన్ని స్వీక‌రించారు.  

వ‌చ్చే నెల‌ లో న్యూ ఢిల్లీ లో భార‌త‌దేశ 72 వ గ‌ణ‌తంత్ర దిన కార్యక్రమం జరిగే సంద‌ర్భం లో, ప్ర‌ధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ కు స్వాగ‌తం ప‌లకాలని తాను ఉత్సుకత తో వేచి ఉన్నట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఈ సంద‌ర్భం లో వెల్ల‌డించారు.


*****



(Release ID: 1681055) Visitor Counter : 142