PIB Headquarters

కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 10 DEC 2020 5:42PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)

  •  భారీగా పెరిగి 15 కోట్లు దాటిన కోవిడ్ పరీక్షలు; గత 10 రోజుల్లోనే కోటి పరీక్షలు
  •  గత 24 గంటలలో 31,521 కొత్త కోవిడ్ కేసులు; కోలుకున్నవారు 37,725 
  •  కోలుకున్నవారి శాతం 94.74% కు పెరుగుదల  
  • భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3,72,293 మంది; ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  3.81%

Image

భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు; 15 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు ; గత 10 రోజుల్లోనే కోటి పరీక్షలు ; 11 రోజులుగా రోజూ కొత్త కేసులు  40,000 లోపు ; ఐదురోజులుగా రోజువారీ మరణాలు 500 లోపు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పొరులో భారతదేశం మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు మొత్తం 15 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిపింది. గత 24 గంటలలోనే 9,22,959  శాంపిల్స్ పరీక్షించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య  15,07,59,726 కి చేరింది చివరి కోటి పరీక్షలు గడిచిన 10 రోజుల్లోనే జరిగాయి.  సమగ్రంగా విస్తృతంగా పరీక్షలు జరుపుతూ రావటం వలన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వరుసగా 11 రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు 40 వేల లోపే ఉండటం ద్వారా భారత్ మరో విజయం సాధించినట్టయింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కేవలం  31,521 కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే నిర్థారణ జరిగాయి. ఇదే 24 గంటల సమయంలో దేశవ్యాప్తంగా 37,725 మంది కొత్తగా కోలుకొని కోవిడ్ నుంచి బైటపడ్దారు. దీంతో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య మరికొంత తగ్గింది. ప్రస్తుతం దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 3,72,293 కాగా, ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 3.81%  ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 92.5 లక్షలు దాటి  నేటికి 92,53,306 చేరింది. కోలుకున్నవారి శాతం  94.74% కి పెరిగింది. నమోదైన కేసులకూ, చికిత్సలో ఉన్న కేసులకూ మధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.  ప్రస్తుతం ఆ తేడా 88,81,013 గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 77.30% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే చెందినవారున్నారు.   మహారాష్ట్రలో అత్యధికంగా  5,051 మంది కోలుకోగా, కేరళలో 4647 మంది, ఢిల్లీలో  4,177 మంది కోలుకున్నారు.  కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసులలో 74.65% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి. మహారాష్ట్రలో అత్యధికంగా 4,981 కేసులు, కేరళలో 4,875, పశ్చిమ బెంగాల్ లో  2,956 కేసులు వచ్చాయి.   గడిచిన 24 గంటలలో 412 మరణాలు నమోదు కాగా, అందులో 77.67%  కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి.  18.20% (75) మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 50 మరణాలతో ఢిల్లీ వాటా 12.13% ఉంది.  గత ఐదు రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 500 లోపే ఉంటూ వస్తున్నది. 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679670

కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ ఈ రోజు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.  ఈ నిర్మాణం ఆత్మ నిర్భర్ భారత్ లో అంతర్భాగం.  స్వాతంత్ర్యం తరువాత మొదటిసారిగా  ప్రజల పార్లమెంట్ నిర్మించుకునే అవకాశంగా దీనిని అభివర్ణిస్తున్నారు. నవభారత ఆశయాలకు అనుగుణంగా దీని నిర్మాణం జరుగుతుంది. స్వాతంత్ర్యానికి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 2022 నాటికి ఇదొక మహత్తర కానుక అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతీయతతో నిండిన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక మైలురాయి అవుతుందని అభివర్ణించారు.  మన ప్రజాస్వామ్య సంప్రదాయాలలో పార్లమెంట్ భవాన్ నిర్మాణం ఒక ముఖ్యమైన దశ అవుతుందన్నారు. దేశప్రజలంతా కలసి దీన్ని నిర్మించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ భవనంలో అనేక కొత్త అంశాలుంటాయని, సభ్యుల పనితీరు మెరుగుపడేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అవసరాలకు తగినట్టు నిర్మాణం పూర్తి చేసుకొని 21వ శతాబ్దపు ఆశయాలను సాకారం చేసుకోగలమని ధీమావ్యక్తం చేశారు. 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679701

కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం కోసం: 

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679689

6వ భారత అంతర్జాతీయ సైన్స్ వేడుకల సందర్భంగా జబల్పూర్ లోని ఐసిఎంఆర్- జాతీయ గిరిజన ఆరోగ్య పరిశోధనా సంస్థ కార్యక్రమంలో డిజిటల్ వేదిక ద్వారా ప్రసంగించిన మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖామంత్రి దాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు 6వ భారత అంతర్జాతీయ సైన్స్ వేడుకల సందర్భంగా జబల్పూర్ లోని ఐసిఎంఆర్- జాతీయ గిరిజన ఆరోగ్య పరిశోధనా సంస్థ కార్యక్రమంలో డిజిటల్ వేదిక ద్వారా ప్రసంగించారు. దీన్ని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి ( సిఎస్ ఐఆర్) భారత వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్), శాస్త్ర, సాంకేతిక విభాగంతో కలసి నిర్వహిస్తోంది.  సైన్స్ పురోగతిని, దాని వినియోగాన్ని ప్రదర్శించటంలో ఐఐఎస్ ఎఫ్ ఎప్పుడూ ముందుంటూ వస్తున్నదని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ప్రజల జీవితాలను సుఖమయం చేసేందుకే కృషి చేస్తూ ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటం తనకు గర్వకారణమన్నారు. 

 వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679696

జీఎస్టీ లోటు భర్తీకి రాష్ట్రాలకు రుణంగా  ఆరో వాయిదా కింద రూ. 6,000 కోట్లు విడుదల 

ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ వారం వాయిదా కింద రాష్ట్రాలకు రూ.6,000 కోట్లు విడుదలచేసింది. ఇది జీఎస్టీ పరిహారంలో లోటును భర్తీచేసే చర్యలో భాగంఇందులో 5,516.60 కోట్లను 23 రాష్ట్రాలకు విడుదలచేయగా  మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు ( ఢిల్లీ, జమ్మూ-కాశ్మీర్, పుదుచ్చేరి)  రూ.483.40 కోట్లు విడుదలచేశారు.  మిగిలిన ఐదు రాష్టాలు – అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం లకు రెవెన్యూ ఖాతాలో భర్తీచేయాల్సిన ఎలాంటి లోటూ లేదు.  భారత ప్రభుత్వం , రాష్ట్రాల తరఫున ఈ మొత్తాన్ని ప్రత్యేక పద్ధతిలో తీసుకొని సమకూర్చుతోంది.  జీఎస్టీ అమలు వలన ఏర్పడే రూ.1.10 లక్షల కోట్ల ఆదాయ లోటును భర్తీ చేయటానికి ఈ ఏర్పాటు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటివరకు కేంద్రం రూ.. 36,000 కోట్లు ఆ విధంగా రుణంగా తీసుకుంది.   

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679562

నవంబర్ వరకు ఉత్పత్తుల కొనుగోలు ద్వారా  ఎం ఎస్ ఎం ఇ లకు 21,000 కోట్లు చెల్లించటం పట్ల ఆర్థికమంత్రి హర్షం 

ఎం ఎస్ ఎం ఇ లకు జరుగుతున్న చెల్లింపులను కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ సమీక్షించారు. ఎం ఎస్ ఎం ఇ మంత్రిత్వశాఖ కృషిని ఆమె అభినందించారు.  ప్రధాని తన దృక్కోణానికి అనుగుణంగా ఆత్మనిర్భర్ భారర్ పాకేజ్ ని మే నెలలో ప్రకటించారని, 45 రోజుల్లో ఎం ఎస్ ఎం ఇ బకాయిలు చెల్లించాలని కూడా నిర్దేశించారని చెప్పారు. అప్పటినుంచి పదే పదే ఆ పురోగతిని సమీక్షిస్తూ ఉండగా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు తమకు కావలసిన ఉత్పత్తులను ఎం ఎస్ ఎం ఇ ల నుంచి తీసుకోవటంతోబాటు బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలని చెప్పటం తగిన ఫలితాలిచ్చిందన్నారు.  గత 7 నెలలకాలంలోనే 21 వేలకోట్ల రూపాయల బకాయిలను ఎం ఎస్ ఎం ఇ లు పొందగలిగినట్టు చెప్పారు. అదే విధంగా అక్టోబర్ నెలలో అత్యధికంగా ఈ సంస్థల నుంచి ఉత్పత్తుల కొనుగోళ్ళుకూడా జరిగాయన్నారు,

వివరాలకు:

రాబోయే పోటీపరీక్షలు, వార్షిక పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశంలో సంభాషించిన కేంద్ర విద్యామంత్రి

కేంద్ర విద్యాశాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియల్ నిశాంక్  రాబోయే పోటీపరీక్షలు, వార్షిక పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశంలో సంభాషించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 జాతీయ విద్యావిధానానికి విద్యార్థులే రాయబారులని అభివర్ణించారు.  ఈ విధానాన్ని విజయవంతం చేయటానికి అందరూ ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిగా సహకరించాలని కోరారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడి మామూలు స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సంబంధమైన   అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ చదువు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కలం స్నేహం సంస్కృతిని పునరుద్ధరించి స్నేహం కొనసాగించాలని, మిత్రులకు లేకలు రాస్తుండాలని కోరారు. ఎస్ ఎం ఎస్, వాట్సప్ సంస్కృతికి భిన్నంగా లేఖలు రాయటంలో ఎంతో ఆనందం ఉంటుందని చెప్పారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679579

హజ్ యాత్ర-2021 దరఖాస్తు గడువు 2021 జనవరి 10 వరకు పొడిగింపు 

హజ్ యాత్ర-2021 దరఖాస్తు గడువు 2021 జనవరి 10 వరకు పొడిగించినట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలియజేశారు.   యాత్ర ప్రదేశం ఆధారంగా లెక్కగట్టే యాత్ర అంచనా ఖర్చును తగ్గించామన్నారు. ముంబయ్ లోని హజ్ హౌస్ లో జరిగిన భారత హజ్ కమిటీ సమావేసానికి అధ్యక్షత వహించిన అనంతరం నక్వీ మీడియాతో మాట్లాడారు.  నిజానికి హజ్ యాత్రికులు దరఖాస్తు చేసుకోవటానికి గడువు ఈరోజే పూర్తవుతుండగా దీన్ని వచ్చే జనవరి 10 వరకు పొడిగించాలని నిర్ణయించామన్నారు.  ఇప్పటివరకు 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెబుతూ జాతీయ, అంతర్జాతీయ కోవిడ్ నియమాలకు అనుగుణంగా హజ్ యాత్రలో కచ్చితమైన మార్గదర్శకాలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఈ సారి జూన్-జులై లో హజ్ యాత్ర ఉంటుందన్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వపు మార్గదర్శకాలే కీలకమవుతాయన్నారు.

వివరాలకు :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679656

మహారాష్ట్ర లోని లాతూర్ లో  దివ్యాంగులకు పరికరాలు అందజేసే కాంపును ప్రారంభించిన మంత్రి తావర్ చంద్ గెహ్లాట్  

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖామంత్రి శ్రీ తావ్ర్ చంద్ గెహ్లాటు ఈ రోజు వర్చువల్ పద్ధతిలో మహారాష్ట్రలోని లాతూర్ లో ఒక దివ్యాంగుల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కాంపులో లాతూర్ జిల్లాకు చెందిన గుర్తించిన దివ్యాంగులకు ఉచితంగా సహాయక పరికరాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి గెహ్లాట్ ప్రారంభోపన్యాసం చేస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో దివ్యాంగులకు సహాయం అందతంలో ఎలాంటి ఇబ్బందీ కలగకుందా తగిన ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సంక్షేమ పథకాల లబ్ధి అందటంలో ఎలాంటి అంతరాయమూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నదన్నారు. . దివ్యాంగులకు పనికొచ్చే పరికరాల తయారీ కొసం రూ, 338 కోట్లు కేతాయింవిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014-15 మొదలుకొని 9331 శిబిరాలు ఏర్పాటు చేసి  16.87 లక్షలమందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఇందులో  637 ప్రత్యేక శిబిరాల ద్వారా 1003.09 కోట్ల విలువచేసే పరికరాల పంపిణీ జరిగిందని  కూడా చెప్పారు.  ఇలాంటి శిబిరాలు దేశవ్యాప్తంగా జరిగేట్టు చూస్తామన్నారు.   

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679669

సాంకేతిక సహకారంపై భారత్-పోర్చుగల్ ప్రభుత్వాలు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధుల చర్చలు

నీరు, ఆరోగ్యం, వ్యవసాయ సాంకేతికత, వ్యర్థాల నిర్వహణ, వాతావరణం , ఐసిటి తదితర రంగాలకు సంబంధిమ్చి భారత్-పోర్చుగల్ ప్రతినిధులు ఈ రోజు చర్చించారు. సమాజంలో మార్పు రావటానికి రెండు దేశాలూ ఉమ్మడిగా  చేపట్టాల్సిన చర్యలమీద ఉన్నత స్థాయి సమాలోచనలు జరిగాయి.  సైన్స్, టెక్నాలజీ, నవకల్పనలు, పరిశ్రమలు, మార్కెట్లలో పరస్రం సహకరించుకుంటూ ముందుకు సాగటానికి రెండు దేశాల్లో అనేక అంశాలను ఈ సమాలోచనలలో ప్రస్తావించాయి.  శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ కీలకోపన్యాసం చేశారు. మేదాంత-ది మెడిసిటీ సిఎండి డాక్టర్ నరేశ్ ట్రెహాన్ మాట్లాడుతూ, కోవిడ్ 19 భారతదేశ శక్తిని పరీక్షించి చూసిందన్నారు.  భారతదేశం ఏ పరికరాలూ లేని స్థితినుంచి అనేక దేశాలకు ఎగుమతి చేయగలిగే స్థితికి సైతం చేరుకున్నదన్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679458

పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం

  • అస్సాం: అస్సాం లో నిన్న 28,896 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపగా 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో పాజిటివ్ శాతం 0.51%గా తేలింది. నిన్న 178 మంది బాధితులు కోలుకున్నారు.  మొత్తం కేసులు - 214165 కాగా కోలుకున్నవారి సంఖ్య 97.88%, చికిత్సలో ఉన్నవారి శాతం 1.65%.
  • సిక్కిం: కొత్తగా24 కేసులు నమోదు కాగా , సిక్కింలో మొత్తం కేసులు 5,239కి చేరాయి. కోలుకున్నవారి సంఖ్య ఇంకా పెరిగి 4,661 కి చేరింది. 19 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం  368 మంది చికిత్సలో ఉన్నారు.
  • కేరళ: కోవిడ్ సంక్షోభం, కట్టుదిట్టమైన నియంత్రణ ఉన్నప్పటికీ, కేరళ మధ్య ప్రాంతానికి చెందిన ఐదు జిల్లాల స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికలకు  వోటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చారు. పోలింగ్ శాతం 70 దాటింది. పాఠశాలల పునఃప్రారంభం మీద నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ వచ్చేవారం అధికారులతో సమావేశమవుతున్నారు.  10వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు జనవరిలో తరగతు నిర్వహించబ్వచ్చునని కోవిడ్ నిపుణుల కమిటీ ఈపాటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.నిన్న రాష్ట్రంలో మరో 4,875 మందికి కోవిడ్ సోకినట్టు తేలింది.  ఇప్పటివరకు కోవిడ్ మరణాల సంఖ్య  2,507 కి చేరగా పాజిటివ్ కేసుల శాతం 9.26 అయింది. .
  • తమిళనాడు:  తమిళనాడు విద్యుత్ డిమాండ్ దాదాపు 9% పెరిగింది. నిరుడు అక్టోబర్ లో 8266 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడుకోగా ఈ ఏడాది అక్టోబర్ లో 9086 మిలియన్ యూనిట్లు వినియోగించారు.  లాక్ డౌన్ అనంతరం పెరిగిన విద్యుత్ వాడకానికి ఇది నిదర్శనం.  ఇలా ఉండగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య బుధవారం నాడు 10,491కి తగ్గింది.  1,232 కొత్తకేసులు  రాగా 14 మరణాలు నమోదయ్యాయి.  ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య  7,94,020 అయింది. మొత్తం మరణాలు  11,836 కి చేరాయి.
  • కర్నాటక: కర్నాటకలో నిన్న 279 కొత్తకేసులు,, 3218 మంది కోలుకున్నవారు,  20 మరణాలు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,563 కాగా,  మరణాలు 11,900; కోలుకున్నవారి సంఖ్య: 8,61,588గా తేలింది.
  • ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వాక్సిన్ ఇవ్వటానికి జిల్లా ఆధికారులు పూర్తిగా సన్నద్ధమయ్యారు. మండల, పట్టణ, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటయ్యాయి. చిత్తూర్ జిల్లాలో జిల్లా వైద్యాధికారి వాక్సిన్ శీతలకేంద్ర నిర్వాహకుల కోసం ఒక రోజుపాటు ఎలక్ట్రానిక్ వాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్ వర్క్ మీద శిక్షణ నిర్వహించారు.   వాక్సిన్ ను భద్రపరచటం, ఆరోగ్య సిబ్బందికి ఇవ్వటం కూడా ఈ శిక్షణలో భాగం.ఇలా ఉండగా ఏలూరులో బైటపడ్ద అంతుచిక్కని వ్యాధి క్రమంగా  తగ్గుతోంది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటిదాకా అనేక నమూనాలు పరిశీలించిన జిల్లా అధికారులు  కేంద్ర సంస్థలనుంచి నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు
  • తెలంగాణa: కొత్త కేసులు: 643;  కోలుకున్నవారు 805 మంది, ఇద్దరు మృతి గత 24 గంటలలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,75,904, చికిత్సలో ఉన్నది 7,497 మంది, మరణాలు మొత్తం 1482 కాగా కోలుకున్నవారు  2,66,925 మంది. కోలుకున్నవారి శాతం 96.74 శాతం అయింది.
  • మహారాష్ట్రa: కోవిడ్ వాక్సిన్ ఇవ్వటానికి దాదాపు 16,000 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట ఆరోగ్య కార్యదర్శి ప్రదీప్ వ్యాస్ వెల్లడించారు. దాదాపు లక్షమంది లబ్ధిదారులుగా పేర్లు నమోదు చేసుకున్నారు.    కోవిడ్ వాక్సిన్ పంపిణీకి రాష్ట సంసిద్ధతను ప్రజెంటేషన్ ద్వారా వివరంగా చెప్పిన శ్రీ వ్యాస్, తమ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ 3,135 శీతల గిడ్డంగులు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వాక్సిన్ బూత్ లు ఏర్పాటు చేస్తామని వ్యాస్ చెప్పారు. ఆ తరువాత పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో కూడా బూత్ లు ఏర్పాటు చెస్తామని చెప్పారు.  పోలీసులు, నిత్యావసర సరకుల సరఫరాదారుల వంటి ముఖ్యమైనవారికి రెండో దశ కింద  వాక్సిన్ ఇస్తామన్నారు. 50 ఏళు పైబడినవారికి, దీర్ఘకాల వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.   ఇలా ఉండగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర సైబర్ సెల్ ఒక హెచ్చరిక జారీచేసింది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ హెచ్చరిక చేస్తున్నట్టు కూడా పేర్కొంది.  కొన్ని నేరగాళ్ల బృందాలు కోవిడ్ వాక్సిన్ పంపిణీని లక్ష్యంగా చేసుకునే అవకాశముందని కూడా హెచ్చరించటం గమనార్హం.  నకిలీ వెబ్ సైట్లు సృష్టించి ఇలాంటి పనులకు పాల్పడవచ్చునని భావిస్తున్నారు.
  • గుజరాత్: దీపావళి తరువాత బాగా కోవిడ్ కేసులు పెరిగిన గుజరాత్ లో ఇప్పుడు క్రమంగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటలలో వచ్చిన కొత్త కేసులు 1400 కు దిగువన ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుటు ఉన్న కోవిడ్ కేసులు  14,027.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్ కారణంగా నిన్న 17 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ వల్ల చనిపొయినవారి సంఖ్య 2,845 కు చేరింది. మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,627 కి చేరగా, కొత్తగా 1,511 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్సపొందుతున్నవారు  19,792 మంది ఉన్నారు. 
  • మధ్య ప్రదేశ్: బుధవారం నాడు మధ్యప్రదేశ్ లో కొత్తగా 1,272 కోవిడ్ కెసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య  2,18,574 కి చేరింది. వైరస్ వలన కొత్తగా మరో 8 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య  3,366 కు చేరింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 13,221 మంది ఉన్నారు. .

నిజనిర్థారణ

 

 

 

 

 

Image

 

 

Image

*******

 

 

 



(Release ID: 1679879) Visitor Counter : 304