ఆర్థిక మంత్రిత్వ శాఖ

మారుమూల ప్రాంతాలకు బాధ్యతాయుతమైన డిజిటల్ చెల్లింపుల కోసం ఫిన్ ‌టెక్ పరిష్కారాలపై ఉమ్మడి సూక్ష్మ అధ్యయన మార్పిడి కార్యక్రమాన్ని భారతదేశంతో కలిసి నిర్వహించిన - ఐక్యరాజ్యసమితి కి చెందిన "బెటర్ దాన్ క్యాష్ అలయన్సు" సంస్థ


Posted On: 09 DEC 2020 6:18PM by PIB Hyderabad

“బాధ్యతాయుతమైన డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం : మారు మూల ప్రాంతాలకు సేవలు అందించడంలో ఫిన్ ‌టెక్ పాత్రను వెలికి తీయడం అనే అంశంపై, ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ధిక వ్యవహారాల శాఖ (డి.ఈ.ఏ), భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నాయకులతో, ఈ రోజు, ఒక అభ్యసన సమావేశాన్ని నిర్వహించింది. ఈ పీర్ ఎక్స్ఛేంజ్ అనేది, కోవిడ్-19 సమయంలో ప్రధానంగా పేర్కొనదగిన అద్భుతమైన విజయాలు, అవకాశాల ఫలితం. ఐక్యరాజ్యసమితి కి చెందిన "బెటర్ దాన్ క్యాష్ అలయన్సు" సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి కి చెందిన "బెటర్ దాన్ క్యాష్ అలయన్సు" అనే సంస్థ 75 కి పైగా ప్రభుత్వాలు, కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో, నగదు నుండి డిజిటల్ చెల్లింపులకు పరివర్తనను వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంది.

వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏ.పి.ఐ. లు, స్మార్ట్ సిటీ కార్డులు, బ్లాక్ ‌చెయిన్ వినియోగ కేసులు, ఖాతా అగ్రిగేటర్ ఎకో సిస్టమ్ మొదలైన వాటిపై ప్రదర్శనలు ఇచ్చాయి. వినియోగ కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు కేస్ స్టడీస్ ‌ను సమర్పించాయి.   

కోవిడ్-19 సహాయక చర్యల్లో భాగంగా, దాదాపు 68,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష నగదు ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం ద్వారా అందించబడ్డాయి. జన్ ధన్ ఖాతాలు, ఆధార్ మరియు మొబైల్ ఫోన్ (జే.ఏ.ఎమ్) తో సహా భారత ప్రభుత్వం స్థాపించిన డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాలు మహమ్మారి సమయంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి, సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి గాను, భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా, సాంకేతికతకు అవరోధం ఎప్పుడూ తక్కువగా ఉన్న చోట చొరవలను అమలు చేయడంలో భారతదేశాన్ని ఒక నమూనాగా చూస్తున్నారు. 

గౌరవనీయ ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ఆశయానికి అనుగుణంగా వివిధ మంత్రిత్వ శాఖల నేతృత్వంలోని డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను పెంచడానికి డి.ఈ.ఏ. ఆసక్తిగా ఉంది. అంతిమంగా పౌరులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, అందరికీ ఆర్థిక, సామాజిక పురోగతిని తెచ్చే డిజిటలైజేషన్ యొక్క నెట్‌వర్క్ ప్రభావాన్ని వెలికి తీయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

"ఫిన్‌ టెక్ చెల్లింపుల పరిధిని గణనీయంగా విస్తరించింది, ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రప్రభుత్వాలు, పెద్ద, పెద్ద స్థానిక ప్రభుత్వాలు, మారు మూల ప్రాంతాల్లోని వ్యక్తుల వరకు, ముఖ్యంగా మహిళలు, సూక్ష్మ సంస్థలకు సేవలను అందించడానికి భాగస్వాములుగా మారవచ్చు. ఆర్థిక మరియు ఇతర సేవలను అందించడానికి వీలుగా మూడు స్థాయిల ప్రభుత్వాల ద్వారా బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగుతో పాటు, ఓపెన్ ఎ.పి.ఐ. ల వంటి సాంకేతిక పరిజ్ఞానాల యొక్క ప్రజా సేవా వినియోగ కేసులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉంది,” అని, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి, ఫిన్ ‌టెక్ ‌పై భారత స్టీరింగ్ కమిటీలో ప్రధాన సభ్యుడు, శ్రీ కె. రాజారామన్ వివరించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన, ఫిన్ ‌టెక్ ‌పై ఈ అంతర్ మంత్రిత్వ క్రియాశీలక కమిటీని, ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏర్పాటు చేసింది.

స్టీరింగ్ కమిటీ నివేదిక ఆధారంగా, డి.ఈ.ఏ. ఫిన్ ‌టెక్ సంబంధిత జోక్యాలను నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగ సంస్థలచే నూతన యుగ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ వెబ్ ‌నార్ లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు ఒకచోట చేరి, అవకాశాలతో పాటు, జాతీయ ప్రాముఖ్యత ఉన్న - భూమి, వ్యవసాయం, ఆర్థిక చేరిక వంటి రంగాలలో డిజిటలైజేషన్ను ప్రారంభించడంలో ఫిన్ ‌టెక్ పాత్ర పై చర్చించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతమైన తమ ఫిన్‌టెక్ భాగస్వామ్యాల గురించి వివరించాయి. కొన్ని రాష్ట్రాలు ఫిన్‌ టెక్ విధానాలను ప్రకటించగా, మరికొన్ని బ్లాక్‌ చెయిన్, ఏ.ఐ. విధానాలను ప్రకటించాయి. 

"తక్కువ కనెక్టివిటీ, తక్కువ సంఖ్యలో పరికరాలు, తక్కువ అక్షరాస్యత, తక్కువ ఆర్థిక సామర్థ్యాలు వంటివి, డిజిటల్ ఇండియా విస్తరణను అనుసరిద్దామనుకున్నచాలా మంది భారతీయులకు, అవరోధాలుగా నిలిచాయి. అందరికీ డిజిటల్ ఇండియా ఇచ్చిన వాగ్దానాలను అందించడానికి కొత్త పొత్తులు మరియు భాగస్వామ్యాలను ఏర్పాటు చేయాలన్న ఈ ముఖ్యమైన ప్రభుత్వ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాము,” అని, బెటర్ దాన్ క్యాష్ అలయన్సు సంస్థ ఆసియా-పసిఫిక్, లీడ్, కీ జోమ్ పేర్కొన్నారు.

ఆర్థిక చేరికను సాధించడానికీ, చెల్లింపులను డిజిటలైజ్ చేయడానికీ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమం అయిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నుండి విజయ గాధలను పంచుకోవడానికీ, భారతదేశం, 2015 లో "బెటర్ దాన్ క్యాష్ అలయన్సు" సంస్థ లో సభ్యత్వం పొందింది. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపారాలు డిజిటల్ చెల్లింపులు చేయగల మరియు స్వీకరించగల పరిజ్ఞానం మరియు కార్యక్రమాలను రూపొందించే లక్ష్యంతో, ఈ "ఆలయన్సు" సంస్థ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.

***



(Release ID: 1679579) Visitor Counter : 310


Read this release in: English , Urdu , Hindi , Tamil