ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీ.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి, "బ్యాక్ టు బ్యాక్" ఋణంగా, రాష్ట్రాలకు 6వ విడత 6,000 కోట్ల రూపాయలు విడుదల


ఇప్పటివరకు మొత్తం 36,000 కోట్ల రూపాయలు విడుదల

రాష్ట్రాలకు మంజూరు చేసిన 1,06,830 కోట్ల రూపాయల అదనపు ఋణ అనుమతికి, ఇది అదనం

Posted On: 09 DEC 2020 6:14PM by PIB Hyderabad

జీ.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి, ఆర్ధిక మంత్రిత్వశాఖ ఈ వారం వాయిదా కింద రాష్ట్రాలకు 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో, జి.ఎస్.టి. మండలిలో సభ్యత్వం కలిగిన 23 రాష్ట్రాలకు 5,516.60 లక్షల రూపాయలూ, శాసనసభతో ఉన్న (ఢిల్లీ, జమ్మూ-కాశ్మీర్, పుదుచ్చేరి) మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు (యు.టి.లకు) 483.40 కోట్ల రూపాయలూ, విడుదల చేశారు. మిగిలిన 5 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదు.

జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో సంభవించే 1.10 కోట్ల రూపాయల కొరతను తీర్చడం కోసం, ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున భారత ప్రభుత్వం, ఈ మొత్తాన్ని తీసుకుంటోంది.

రాష్ట్రాలకు అందించిన అటువంటి నిధులలో భాగంగా ఈ వారం 6 వ విడత నిధులు విడుదలయ్యాయి. ఈ వారం, ఈ మొత్తాన్ని, 4.2089 శాతం వడ్డీ రేటుతో ఋణంగా తీసుకున్నారు. ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా, సగటున 4.7106 శాతం వడ్డీ రేటుతో, కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు, 36,000 కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది.

జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు, జి.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి ఆప్షన్ -1 ను ఎంచుకునే రాష్ట్రాలకు, అదనపు ఆర్థిక వనరులను సమీకరించడంలో వారికి సహాయపడటానికి వీలుగా, రాష్ట్ర ప్రభుత్వం జి.ఎస్.‌డి.పి. లో 0.5 శాతానికి సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు, ఈ నిబంధన ప్రకారం, 28 రాష్ట్రాలకు 1,06,830 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

28 రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన మరియు ఇప్పటివరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం వివరాలను అనుబంధంలో పొందుపరచడం జరిగింది.

రాష్ట్రాల వారీగా, జి.ఎస్.‌డి.పి. లో 0.50 శాతం చొప్పున అనుమతించిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించి, 09.12.2020 తేదీ వరకు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలు

 

క్రమ సంఖ్య

రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం పేరు

0.50 శాతం చొప్పున రాష్ట్రాలకు అనుమతించిన అదనపు ఋణం

ప్రత్యేక విండో ద్వారా సేకరించి, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధులు

1

ఆంధ్రప్రదేశ్

5051

929.97

2

అరుణాచల్ ప్రదేశ్ *

143

0.00

3

అస్సాం

1869

400.24

4

బీహార్

3231

1571.14

5

ఛత్తీస్ గఢ్

1792

169.26

6

గోవా

446

337.93

7

గుజరాత్

8704

3710.87

8

హర్యానా

4293

1751.33

9

హిమాచల్ ప్రదేశ్

877

690.95

10

ఝార్ఖండ్

1765

91.95

11

కర్ణాటక

9018

4992.85

12

కేరళ

4,522

642.12

13

మధ్యప్రదేశ్

4746

1827.79

14

మహారాష్ట్ర

15394

4820.05

15

మణిపూర్ *

151

0.00

16

మేఘాలయ

194

44.99

17

మిజోరాం *

132

0.00

18

నాగాలాండ్ *

157

0.00

19

ఒడిశా

2858

1538.05

20

పంజాబ్

3033

930.88

21

రాజస్థాన్

5462

1157.77

22

సిక్కిం *

156

0.00

23

తమిళనాడు

9627

2511.68

24

తెలంగాణ

5017

429.45

25

త్రిపుర

297

91.20

26

ఉత్తరప్రదేశ్

9703

2417.25

27

ఉత్తరాఖండ్

1405

932.19

28

పశ్చిమ బెంగాల్

6787

493.45

 

మొత్తం (ఏ):

106830

32483.36

1

ఢిల్లీ

వర్తించదు

2360.08

2

జమ్మూ-కశ్మీర్

వర్తించదు

914.22

3

పుదుచ్చేరి

వర్తించదు

242.34

 

మొత్తం (బి):

వర్తించదు

3516.64

 

మొత్తం (ఏ+బి)

106830

36000.00

 

* ఈ రాష్ట్రాలకు జి.ఎస్.టి. పరిహార కొరత "లేదు"

 

*****



(Release ID: 1679562) Visitor Counter : 254