ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు; 15 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు
గత 10 రోజుల్లోనే కోటి పరీక్షలు
11 రోజులుగా రోజూ కొత్త కేసులు 40,000 లోపు
ఐదురోజులుగా రోజువారీ మరణాలు 500 లోపు
Posted On:
10 DEC 2020 10:35AM by PIB Hyderabad
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పొరులో భారతదేసం మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు మొత్తం 15 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిపింది. గత 24 గంటలలోనే 9,22,959 శాంపిల్స్ పరీక్షించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 15,07,59,726 కి చేరింది చివరి కోటి పరీక్షలు గడిచిన 10 రోజుల్లొనే జరిగాయి. సమగ్రంగా విస్తృతంగా పరీక్షలు జరుపుతూ రావటం వలన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
వరుసగా 11 రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు 40 వేల లోపే ఉండటం ద్వారా భారత్ మరో విజయం సాధించినట్టయింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కేవలం 31,521 కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే నిర్థారణ జరిగాయి.
ఇదే 24 గంటల సమయంలో దేశవ్యాప్తంగా 37,725 మంది కొత్తగా కోలుకొని కోవిడ్ నుంచి బైటపడ్దారు. దీంతో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య మరికొంత తగ్గింది. ప్రస్తుతం దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 3,72,293 కాగా, ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 3.81%
ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 92.5 లక్షలు దాటి నేటికి 92,53,306 చేరింది. కోలుకున్నవారి శాతం 94.74% కి పెరిగింది. నమోదైన కేసులకూ, చికిత్సలో ఉన్న కేసులకూమధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ తేడా 88,81,013 గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 77.30% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే చెందినవారున్నారు. మహారాష్టలో అత్యధికంగా 5,051 మంది కోలుకోగా, కేరళలో 4647 మంది, ఢిల్లీలో 4,177 మంది కోలుకున్నారు.
కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసులలో 74.65% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి. మహారాష్ట్రలో అత్యధికంగా 4,981 కేసులు, కేరళలో 4,875, పశ్చిమ బెంగాల్ లో 2,956 కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటలలో 412 మరణాలు నమోదు కాగా, అందులో 77.67% కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. 18.20% (75) మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 50 మరణాలతో ఢిల్లీ వాటా 12.13% ఉంది.
గత ఐదు రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 500 లోపే ఉంటూ వస్తున్నది.
****
(Release ID: 1679670)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam