ప్రధాన మంత్రి కార్యాలయం

వారణాసి-ప్రయాగ్ రాజ్ సెక్షన్ జాతీయ రహదారి ఆరులేన్ల హైవేగా విస్తరించిన ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 30 NOV 2020 6:40PM by PIB Hyderabad

హర్ హర్ మహాదేవ్,
కాశీలోని నా సోదర సోదరీమణులారా,
మీ అందరికీ నమస్కారములు,
ముఖ్యంగా రాజాతాలాబ్మిర్జామురాద్కఛ్‌వాకస్‌పేఠీరోహనియాసేవాపురి ప్రాంతాల (ప్రజలకురైతులకు) నమస్కారాలు,
మీ అందరికీ దేవ్ దీపావళిగురుపూరబ్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ జీఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్యజీపార్లమెంటులో నా సహచరుడు భాయ్ రమేశ్ చంద్ జీభారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైన నా ప్రియమైన కాశీ సోదరసోదరీమణులారా,
దేవ్ దీపావళిగురునానక్ దేవ్ జీ ప్రకాశోత్సవ్ సందర్భంగా ఇవాళ కాశీకి ఆధునిక మౌలిక వసతుల నజరానా లభించబోతోంది.  దీని లబ్ధి కాశీతోపాటు ప్రయాగ్ రాజ్ ప్రజలకు కూడా ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు
2013లో నా తొలి ప్రజాసభ ఈ మైదానంలోనే జరిగింది. అప్పుడు ఇక్కడ నాలుగు లేన్ల హైవే ఉండే విషయం నాకింకా గుర్తుంది. ఇవాళ బాబా విశ్వనాథ్ ఆశీర్వాదంతో ఈ హైవే ఆరు లేన్లుగా వృద్ధి చెందింది. హండియా నుంచి రాజాతాలాబ్ వచ్చిపోయే వారి తెలుసు ఏ హైవేపై ఎంత కష్టమయ్యేదో. అడుగడుక్కూ ట్రాఫిక్ జామ్ట్రాఫిక్ మెల్లిగా ముందుకుసాగడంఢిల్లీతోపాటు ఇతర నగరాలనుంచి కూడా వచ్చిపోయే వారు కూడా ఈ రోడ్డుపైకి వచ్చి చాలా ఇబ్బందులు పడేవారు. 70 కిలోమీటర్లకు పైబడిన ఈ రోడ్డులో ఇప్పుడు ప్రయాణం మరింత సాఫీగా ముందుకు సాగనుంది. వేగంగా సాగిపోతుంది కూడా. ఈ హైవే వెడల్పు పెరగడం వల్ల కాశీ-ప్రయాగ్ రాజ్ మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది. కావడియాత్ర సమయంలో యాత్రికులతోపాటు ఈ ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యలు ఇకపై ఉండవు. కుంభమేళా సమయంలోనూ దీని వల్ల చాలా మేలు చేకూరుతుంది.
సోదరసోదరీమణులారా,
ఆధ్యాత్మిక ప్రాంతమైనా..మరే ఇతర ప్రత్యేకమైన పనైనా.. ప్రజలకు అక్కడకు వెళ్లేముందు వెళ్లిరావడం ఎంత సులభమో ముందుగానే చూసుకుంటారు. ఇలాంటి సౌకర్యాలు దేశవిదేశీయులతోపాటు పర్యాటకులుభక్తులకు కూడా ఇది ఉత్సాహాన్నిస్తుంది. గత కొన్నేళ్లుగా కాశీ సుందరీకరణతోపాటు అనుసంధానతకోసం చేసిన పనుల ప్రభావం ఇప్పుడు కనబడుతోంది. కొత్త హైవేలు నిర్మించాలన్నాబ్రిడ్జిలుఫ్లై ఓవర్లు నిర్మించాలన్నా.. ట్రాఫిక్ జామ్ లు తగ్గించాలన్నారోడ్లను విస్తరించాలన్నా.. ఏ పనైనా.. ఇప్పుడు జరుగుతున్నంతగా..స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. బనారస్ సేవకుడిగా.. ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చడంవారి జీవితాలను సులభతరం చేయడం నా ధర్మం. గత ఆరేళ్లలో వేలకోట్ల విలువైన కార్యక్రమాలు కాశీలో చేశాము. మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరాన్ని విమానాశ్రయంతో అనుసంధానం చేసే రోడ్డు ఇప్పుడు ఈ నగరాభివృద్ధికి ప్రత్యేకతగా నిలిచింది. రైల్వేస్టేషన్ కు అనుసంధానత చాలా బాగుంది. ఇక్కడినుంచి కొంత దూరంలో రింగ్ రోడ్-పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే సుల్తాన్ పూర్ఆజంగఢ్గాజీపూర్ నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండానే సిక్స్ లేన్ నుంచి బయటనుంచి వెళ్లిపోవచ్చు. ఇతర హైవేలపై జరుగుతున్న పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తవుతాయి. ఈ  హైవే ద్వారా వారణాసిలక్నోఆజంగఢ్గోరఖ్ పూర్ యాత్ర మరింత సులభతరం అవుతుంది.
సోదర సోదరీమణులారా,
మంచి  రోడ్లురైలు మార్గంచవకైన విమాన సదుపాయం వంటివి సమాజంలోని అన్ని వర్గాలకు సౌకర్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా పేదలుచిరుకార్మికులుమధ్యతరగతి ప్రజలు దీని వల్ల లబ్ధి పొందుతారు. నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రాజెక్టు  పనులు పూర్తయినపుడు.సమయం మిగులుతుంది.. ఖర్చులు కూడా తగ్గి సమస్యలు దూరమవుతాయి. కరోనా సమయంలోనూ చాలా మంది కార్మికులకు ఉపాధి లభించడంతోపాటు భారీమధ్యతరగతి మౌలికవసతుల ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
సోదరసోదరీమణులారా,
ఉత్తరప్రదేశ్ లో యోగీజీవారి బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలికవసతుల కల్పన కార్యక్రమాలు చాలా వేగంగా ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో మౌలికవసతుల పరిస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఇవాళ ఉత్తరప్రదేశ్ కు ఎక్స్ ప్రెస్ ప్రదేశ్ అనే గుర్తింపు వచ్చింది. యూపీలో అనుసంధానతకు సంబంధించి వేలకోట్ల పనులు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవాళ పూర్వాంచల్ అయినా బుందేల్ ఖండ్ అయినా.. ప్రతి మూలను ఎక్స్ ప్రెస్ వేతో అనుసంధానం చేస్తున్నారు. దేశంలోని రెండు అధునాత రక్షణ కారిడార్ ప్రాజెక్టుల్లో ఒకటి మన ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతోంది.
సోదరసోదరీమణులారా,
రోడ్డు మాత్రమే కాదు.. విమాన మార్గం అనుసంధానత కూడా జరుగుతోంది. మూడునాలుగేళ్ల క్రితం వరకు యూపీలో రెండు పెద్ద విమానాశ్రయాలే పనిచేస్తుండేవి. ఇవాళ దాదాపుగా 12 విమానాశ్రయాలు యూపీ ప్రజల సేవలో సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వారణాసిలో విమానాశ్రయాన్ని విస్తరింపజేసే పనులు జరుగుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో కూడా విమాన టర్మినల్ ఎంత వేగంగా సాగుతోందంటే. అదో రికార్డును సృష్టిస్తోంది. వీటితోపాటు కుషీనగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేపనులు సాగుతున్నాయి. నోయిడాలోని జేవర్ లో ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
మిత్రులారా,
ఎప్పుడైనా ఏదైనా ప్రాంతంలో ఆధునిక మౌలిక వసతుల అనుసంధానత పెరుగుతుందో దాని వల్ల ఎక్కువ లాభం మన రైతులకే లభిస్తుంది. గతంలో గ్రామాల్లో ఆధునిక రోడ్లతోపాటు గిడ్డంగులుశీతల గిడ్డంగులు మొదలైన ఆధునిక వ్యవస్థ నిర్మాణం అవుతుంది. ఈ మధ్యే దీనికోసం ప్రత్యేకంగా లక్ష కోట్ల రూపాయల నిధిని కూడా రైతుల కోసం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ ఏడాదే.. దేశంలో తొలిసారిగా శీతల సదుపాయం ఉన్న కిసాన్ రైలును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రయత్నాల వల్ల రైతులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. పెద్ద పెద్ద పట్టణాలకు వరకు వారి ఉత్ప్త్తులు చేరతాయి. దీని వల్ల రైతుల ఆదాయం పెరుగుతోంది.
మిత్రులారా,
వారణాసి సహిత పూర్వాంచల్ లో జరుగుతున్న మౌలికవసతుల కల్పన ద్వారా ఈ మొత్తం ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. వారణాసిలో పెరిషబుల్ కార్గో సెంటర్ నిర్మించేందుకు కారణం.. ఇక్కడి రైతులు వారి పళ్లుకూరగాలయను దాచుకుని వాటిని సులభంగా అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించడమే. ఈ స్టోరేజీ సామర్థ్యం కారణంగానే.. మొదటిసారి ఇక్కడ రైతులకు వారి ఉత్పత్తులను భారీసంఖ్యలో విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు వీలవుతోంది. ఇవాళ వారణాసిలో పండే లంగడాదశహరీ మామిడిపళ్లు లండన్మిడిల్ ఈస్ట్ లో రుచులను పంచుతున్నాయి. ఇప్పుడు బనారస్ మామిడిపళ్ల కు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి వస్తున్న ప్యాకేజింగ్ కారణంగా.. దీనికోసం వేరే నగరాలకు వెళ్లే అవకాశం ఉండదు. మామిడిపళ్లతోపాటు ఇక్కడి కూరగాయలు ఈసారి దుబయ్లండన్ కు ఎగుమతి అవుతున్నాయి. ఇది కూడా విమానమార్గంలోనే. ఈ సేవల ద్వారా ఇక్కడి చిన్న రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. గంగానదిపై ఏర్పాటుచేస్తున్న తొలి అంతర్గత జలరవాణా ద్వారా రైతులకు తమ ఉత్పత్తులను రవాణాను మరింతగా పెంచుకునేందుకు వీలువుతుంది. ఈ దిశగా కూడా పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ప్రభుత్వ ప్రయత్నాలుఆధునిక మౌలిక వసతుల కారణంగా రైతులకు ఎంతలాభం జరుగుతుందనేదానికి చందౌలీ నల్ల బియ్యం ఓ మంచి ఉదాహరణ. ఈ బియ్యం చందౌలీ రైతుల ఇళ్లకు లక్ష్మీ కళ తీసుకొస్తోంది. చందౌలీ రైతుల ఆయుర్దాయం పెంచేందుకు రెండేళ్ల క్రితం ఈ కొత్త రకంపై ప్రయోగం చేశారు. గతేడాది ఖరీఫ్ సీజన్ లో దాదాపు 400 మంది రైతులు ఈ రకం బియ్యాన్ని పండించారు. ఈ రైతుల ఓ సంఘం ఏర్పాటైంది. దీనికోసం మార్కెట్ ను రూపొందించారు. మామూలు బియ్యం 35-40 రూపయాలకు కిలో అమ్ముతారు. కానీ ఈ బియ్యం రూ.300 కిలో అమ్ముడవుతోంది. నల్లబియ్యానికి విదేశీమార్కెట్ లోనూ డిమాండ్ పెరుగుతోంది. మొదటిసారి ఆస్ట్రేలియాకు ఈ బియ్యం ఎగుమతి అయ్యాయి. అక్కడ ఈ బియ్యం రూ.850కి కిలో అమ్ముడవుతోంది. వరిధాన్యం కనీస మద్దతుధర రూ.1,800 గా ఉండగా.. నల్లబియ్యం క్వింటాలుకు రూ.8,500 గా ఉంది. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈసారి దాదాపు 1000 మంది రైతులు నల్లబియ్యాన్ని పండించబోతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది.
సోదరసోదరీమణులారా,
రైతులకు ఆధునిక వసతులు కల్పించడంచిన్న రైతులకు సంఘటితం చేయడం వారిని బలమైన శక్తిగా మార్చడం.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా పంటబీమా యోజననీటిపారుదలవిత్తనాలు ఇవ్వడంమార్కెట్ అవసరాలు కల్పించడం ఇలా  ప్రతి విషయంలోనూ పనిచేస్తున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా దాదాపు 4కోట్ల మంది రైతు కుటుంబాలకు సహాయం అందింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా దాదాపు 47 లక్షల హెక్టార్ల భూమికి మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని అందించడం జరిగింది. దాదాపు 77వేల కోట్ల రూపాయల నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
కానీ మిత్రులారాఈ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. వీటితోపాటు రైతులకు విస్తృతమైన మార్కెట్ లాభం కూడా అందాల్సిన అవసరముంది. మన దేశంతోపాటు విదేశాల్లోని మార్కెట్ కూడా మన రైతులకు అందుబాటులోకి రావాలి. ఈ సౌకర్యాల ద్వారా రైతుకు సాధికారత కల్పిస్తున్నాం. రైతు సంక్షేమం కోసం వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలు కల్పిస్తాయి. వ్యవసాయ క్షేత్రం నుంచే నేరుగా రైతు వద్ద ఆయన ఉత్పత్తులు కొనాలి. దీంతోపాటు ఉత్పత్తుల రవాణా నుంచి లాజిస్టిక్స్ వరకు ఏర్పాట్లు చేసుకుని రైతుకు మంచి ధర ఇవ్వాలి. అలాంటప్పుడు తనకు నచ్చిన ధరకు తన ఉత్పత్తులు అమ్ముకునే స్వతంత్రత ఉండాలా వద్దాభారత వ్యవసాయ ఉత్పత్తులు యావత్ ప్రపంచంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రైతుల ఈ పెద్ద మార్కెట్మంచి ధర వారికి అందాలావద్దాఎవరైనా పాత పద్ధతితోనే లావాదేవీలు బాగున్నాయని ఎవరైనా అనుకుంటే.. వాటిపైనా కొత్త చట్టాల్లో ఎలాంటి ఆంక్షలు విధించామా?
మిత్రులారా,
కొత్త వ్యవసాయ సంస్కరణల ద్వారా రైతులకు కొత్త అవకాశాలు కొత్త చట్టపరమైన భద్రతలు ఇవ్వబడ్డాయి. మొదట్లో మార్కెట్ బయట జరిగే లావాదేవీలు అక్రమమని భావించేవారు. అప్పుడు చిన్న రైతులు దగాపడేవారు. ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే చిన్నరైతు మార్కెట్ వరకు కూడా వెళ్లేవాడు కాదు. ఇప్పుడలా కాదు. ఇప్పుడు ప్రతి చిన్నరైతు మార్కెట్ బయట జరిగే లావాదేవీలన్నింటినీ సక్రమంగా జరుపుకోవచ్చు. రైతులకు కొత్త అవకాశాలు దొరక్కపోతే రైతు చుట్టూ మరిన్ని కుట్రలు చేస్తారు. వీటినుంచి కాపాడేందుకు చట్టపరమైన రక్షణ ఇస్తుంది. రైతులకు ప్రాజెక్టులతోపాటు కొత్త అవకాశాలు ఇవ్వడం ద్వారానే మన వ్యవసాయరంగం పునరుజ్జీవం అవుతుంది. ప్రభుత్వం తరఫునుంచి రైతులకు అన్ని ప్రాజెక్టులుఅవకాశాలు కల్పించడం ద్వారానే వ్యవసాయరంగానికి కొత్త ఊపువస్తుంది.
మిత్రులారా,
ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందిచట్టాలను రూపొందిస్తుంది. ఈ విధానాలుచట్టాలకు మద్దతు లభించినపుడు  కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజమే. ఇది ప్రజాస్వామ్యంలో భాగమేభారతదేశంలో ఇది ఓ సంప్రదాయంగా మారిపోయింది. కానీ కొంతకాలంగా ఓ విచిత్రమైన ట్రెండ్ కనబడుతోంది. కాశీలోని చైతన్యవంతులైమన మీరందరికీ ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. గతంలో ప్రభుత్వ నిర్ణయాలు ఎవరికైనా నచ్చకపోతే నేరుగా వాటితో విభేదించేవారు. కానీ కొంతకాలంగా వారి సొంత అభిప్రాయాలను జోడించి ప్రజలను తప్పుదారిపట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిర్ణయం సరైనదే కానీ దీనివల్ల భవిష్యత్తులో ఏమేం జరుగుతుందో చెప్పలేమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడేం జరగడంలేదో అది భవిష్యత్తులోనూ జరగదంటూ ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారు. చారిత్రక వ్యవసాయ సంస్కరణల విషయంలో ఇలాగే ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. మీకు ఈ అబద్ధాలు చెబుతున్న వారే.. దశాబ్దాలుగా రైతులను విస్మరిస్తూ వస్తున్నారు. ఎమ్మెస్పీని ప్రకటించేవారు కానీ.. ఆ మద్దతు ధరకు ధాన్యం అమ్ముడయ్యేది కాదు. ఏళ్ల తరబడి ఎమ్మెస్పీ పేరుతో రాజకీయాలు చేశారు. రైతుల పేరుతో భారీ రుణమాఫీ ప్యాకేజీలను ప్రకటించారు. కానీ అవి చిన్నమధ్యతరహా రైతులకు అందేది కాదు. రుణమాఫీ చుట్టూ రాజకీయం చేశారు. రైతుల పేరుతో భారీ పథకాలు తీసుకొచ్చారు. కానీ రూపాయిలో రైతులకు 15 పైసలే అందుతాయని వారే చెప్పేవారు.

అంటే పథకాల పేరిట మోసం జరుగుతోందన్న మాట! రైతుల పేరిట, ఎరువుల పేరిట చాలా పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కానీ పొలాల్లో చల్లాల్సిన ఎరువులు నల్ల బజారులోకి వెళ్లిపోయేవి. అంటే యూరియా పేరిట కూడా మోసమేనన్న మాట. ఉత్పాదకతను పెంచమని రైతులకు చెప్పడం జరిగిందది. కానీ లాభాలు మాత్రం రైతులకు కాకుండా మరెవరికో చెందేలా ఏర్పాట్లు జరిగాయి. మొదట వోట్ల కోసం వాగ్దానాలు ఇవ్వడం, ఆ తరువాత మోసం చేయడం... ఇదే ఆట చాలా కాలంగా దేశంలో కొనసాగుతూ వచ్చింది.

 

మిత్రులారా ...

ఇలా మోసం జరుగుతుంటే రెండు విషయాలు సహజంగానే జరుగుతాయి. మొదటిది – రైతుకి ప్రభుత్వం చెబుతున్న మాటల పట్ల సందేహాలు ఉండటానికి కారణం గత అనేక దశాబ్దాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. రెండవది. వాగ్దానాలను భంగం చేసిన వారికి, మోసం చేసిన వారికి అబద్ధాలను ప్రచారం చేయడం అలవాటుగా మాత్రమే కాదు, అవసరంగా కూడా మారింది. గతంలో జరిగినట్టే ఇప్పుడూ జరుగుతుందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వారు దశాబ్దాలుగా చేసింది ఇదే. కాబట్టి అదే సూత్రాన్ని ఇప్పుడూ వర్తింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం పనితీరును చూస్తే నిజం మీకు అవగతం అవుతుంది. మేము రైతులకు యూరియా తగినంతగా అందచేస్తామని, నల్ల బజారును అంతం చేస్తామని చెప్పాము. గత ఆరేళ్లలో యూరియా కొరత లేకుండా చూశాం. గతంలో యూరియాను బ్లాక్ లో కొనాల్సి వచ్చేంది. రాత్రి నుంచే, చలిలో క్యూలు కట్టి అక్కడే నిద్రపోవాల్సి వచ్చేంది పలు సందర్భాల్లో రైతులపై లాఠీలు కూడా విరిగేవి. ఇప్పుడు ఇది పూర్తిగా ఆగిపోయింది. చివరికి కరోనా లాక్ డౌన్ లో మిగతా అన్ని కార్యకలాపాలు ఆగిపోయినా యూరియాను పంపిణీ చేసే విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులూ రానీయలేదు. మేము స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మరకు ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధరను అందచేస్తామని మాట ఇచ్చాం. దీనిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, అమలు చేసి చూపించాం. అంతే కాదు. ఈ రొక్కం మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాం.

 

మిత్రులారా

ఒక్క పప్పు దినుసుల గురించే మాట్లాడుకుంటే 2014 కి ముందరి అయిదేళ్లలో మా ముందరి ప్రభుత్వం కేవలం రూ. 650 కోట్ల  మేరకు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఎంత? కేవలం రూ. 650 కోట్లు. ఒక్క సారి ఎంత మేరకు కొనుగోలు చేశారో చెప్పండి? దేశమంతటిలో కేవలం 650 కోట్లు. కానీ మేము వచ్చి అయిదేళ్లలో ఏం చేశాం? గత అయిదేళ్లలో దాదాపు 49 వేల కోట్లు అంటే దాదాపుగా 50 వేల కోట్ల రూపాయల విలువైన పప్పు దినుసులను కనీస మద్దతు ధర మేరకు కొనుగోలు చేశాం. అంటే 75 రెట్ట పెరుగుదల అన్న మాట! 650 కోట్లెక్కడ.. యాభై వేల కోట్లెక్కడ? 2014 కి ముందరి అయిదేళ్లలో వారి ప్రభుత్వం గురించే చెప్పుకుంటే,వారు మొత్తం దేశంలో కనీస మద్దతు ధరకు 2 లక్షల కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కానీ మా అయిదేళ్ల ప్రభుత్వం రైతులకు ఎంఎస్ పీ రూపంలో 5 లక్షల కోట్ల రూపాయలు అందచేసింది. అంటే రైతులకు రెండున్న రెట్లె ఎక్కువ ధనాన్ని అందించిందన్నమాట మిత్రులారా! 2014 కి ముందరి ప్రభుత్వం అయిదేళ్లలో గోధుమలు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు లక్షన్నర కోట్ల రూపాయలు అందిస్తే మేము గత అయిదేళ్లలో 3 లక్షల కోట్లను ఎం ఎస్ పీ రూపంలో అందించాం. అంటే రెండు రెట్లు ఎక్కువ. కాబట్టి మీరే చెప్పండి, వ్యవసాయ మార్కెట్లను, ఎం ఎస్ పీని తొలగించాలనుకున్నట్టయితే మేము వీటిని ఎందుకు బలోపేతం చేస్తాం? అసలు దీనిపై ఇంత పెట్టుబడి ఎందుకు పెడతాం. మా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను మరింత ఆధునికీకరించేందుకు, బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది.

 

సోదర, సోదరీమణులారా...

ఈ వ్యక్తులే ప్రధానమంత్రి రైతు గౌరవ నిధి (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన) విషయంలో ప్రతి వీధిలో, ప్రతి విలేఖరుల సమావేశంలో, ట్విట్టర్ లో ప్రశ్నలు లేవనెత్తేవారన్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. మోదీ ఎన్నికల కోసమే రైతు గౌరవ నిధిని తీసుకువచ్చారని, ఒక సారి రెండు వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారని పుకార్లు పుట్టించారు. ఇప్పుడు రెండు వేలు ఇచ్చి, తరువాత వడ్డీతో సహా తిరిగి తీసేసుకుంటారని మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. చివరికి ఒక రాష్ట్రంలో రైతులు మాకు రెండువేల రూపాయలు వద్దన్నారని కూడా పుకార్లు పుట్టించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి రైతు గౌరవ నిధిని అమలే చేయలేదు. ఎందుకంటే రైతులకు డబ్బులు అందికే మోదీకి ప్రశంసలు అభిస్తాయి. అదే జరిగితే మా రాజకీయం చాపచుట్టుకుపోతుందది. అందుకే వారు రైతుల జేబుల్లోకి డబ్బు వెళ్లకుండా అడ్డుకున్నారు. రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడితే ఆ ధనాన్ని కూడా రైతులకు ఇచ్చి తీరతామని ఆ రాష్ట్ర రైతులకు నేను చెప్పదలచుకున్నాను.

 

మిత్రులారా!

దేశంలోని పది కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా సహాయరాశి వేయడం జరుగుతోంది. ఇది ప్రధానమంత్రి రైతు గౌరవ నిధి లో భాగంగా క్రమం తప్పకుండా వేయడం జరుగుతోంది. ఏడాదికి మూడు సార్లు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకూ దాదాపు లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరింది.

 

మిత్రులారా!

మేము రైతులకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాం ఇప్పుడు కిసాన్ మాన ధన్ యోజన అమలులో ఉంది. చాలా తక్కువ సమయంలోనే 21 లక్షల రైతు కుటుంబాలను మేము ఇందులో జోడించగలిగాము.

 

సోదర సోదరీమణులారా!

చేసిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసే చరిత్ర ఆధారంగానే మేము రైతులకు మేలు చేసే వ్యవసాయ రంగ సంస్కరణ చట్టాలను అమలులోకి తెచ్చాము. మన రైతులకు ఇవి ఎలా మేలు చేయబోతున్నాయో మనమందరం స్వయంగా అనుభవపూర్వకంగా చూడబోతున్నాం. మీడియాలోనూ దీని గురించిన సకారాత్మక (పాజిటివ్) చర్చలు జరుగుతాయిని నేను ఆశిస్తున్నాం. అలాంటి చర్చలను చూడబోతున్నామని, చదవబోతున్నామని నేను భావిస్తున్నాను. దశాబ్దాలుగా జరిగిన మోసాల వల్ల రైతులలో కొన్ని అనుమానాలున్నాయని నాకు తెలుసు. ఇందులో రైతుల తప్పేమీ లేదు. కానీ నేను దేశవాసులకు చెప్పదలచుకున్నాను. గంగానదీ తీరం నుంచి, కాశీ వంటి పవిత్ర నగరం నుంచి నేను దేశవాసులకు చెప్పదలచుకున్నాను. గంగాజలమంతటి పవిత్ర భావనతో మేము పనిచేస్తున్నామని నేను రైతులకు చెప్పదలచుకున్నాను.

 

సోదర సోదరీమణులారా!

అనుమానాలు, అపోహల ఆధారంగా దేశంలో తప్పుడు ప్రచారం చేసేవారి నిజస్వరూపం దేశముందుకు వస్తుంది. ఒక విషయంలో వారి దుష్ప్రచారం రైతులకు అర్థం కాగానే వారు ఇంకో విషయంలో అబద్ధాలు ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఇరవైనాలుగు గంటలూ వారు ఇదే పనిని చేస్తున్నారు. ఈ విషయం దేశంలోని రైతులకు అర్థమౌతోంది. కొన్ని రైతు కుటుంబాలకు కొన్ని విషయాల్లో సందేహాలు, ఆవేదనలు, ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నది. సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది కూడా. అన్నపూర్ణమ్మ తల్లి ఆశీర్వాదంతో మా అన్నదాతలు ఆత్మనిర్భర భారతాన్ని ముందుండి నడిపిస్తున్నారు. నేడు మా వ్యవసాయ సంస్కరణల విషయంల అనుమానాలున్న రైతులు కూడా భవిష్యత్తులో ఈ సంస్కరణల వల్ల లబ్దిపొంది, తమ ఆదాయాన్ని పెంచుకుంటారన్న గట్టి నమ్మకం నాకు ఉంది.

చివర్లో మరొక్క సారి ఈ అత్యాధునిక హైవే విషయంలో మీ అందరికీ శుభాభినందనలు. కాశీ నగరి రూపం, స్వరూపం మరింత భవ్యంగా వెలుగొందేలా చేసేందుకు మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. నేను బెనారస్ లో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. వాటిల్లోనూ పలు విషయాలపై సవివరంగా మాట్లాడబోతున్నాను. కరోనా వల్ల ఈ సారి మీ వద్దకు రావడంలో కాస్త ఆలస్యం అయింది. కానీ ఈ రోజు నాకు మీ దర్శనం అయింది. నాకు దీనితో కొత్త శక్తి లభించింది. మీ ఆశీర్వాదం దొరికింది. పనిచేసేందుకు కావలసిన కొత్త బలం వచ్చింది. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వాదాన్ని ఇవ్వడమే నా నిజమైన శక్తి. ఇదే నాకు ఆశీర్వచనం. దీనిని నేను చాలా కృతజ్ఞుడిని. నాతో కలిసి రెండు పిడికిళ్లూ బిగించి, పూర్తి శక్తితో భారత్ మాతాకీ జై అని నినదించండి.

 

ధన్యవాదాలు

***



(Release ID: 1677296) Visitor Counter : 182