ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా ఐదోరోజు కూడా దేశంలో కొత్త కోవిడ్ కేసులు 50 వేల లోపు

చికిత్సలో ఉన్నవారు 4.9 లక్షలు, మొత్తం కేసుల్లో 5.63%

Posted On: 12 NOV 2020 11:10AM by PIB Hyderabad

గడిచిన 24 గంటల్లో 47,905 కొత్త కరోనా కేసులు నమొదయ్యాయి. దీంతో వరుసగా ఐదో రోజు కూడా కొత్త కేసులు 50 వేల లోపే ఉన్నట్టయింది.  గత 24 గంటలలో 52,718 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వరుసగా 40 రోజులుగా సాగుతోంది.

 

ఈ ధోరణి కొనసాగుతూ ఉండగా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 4.98 లక్షలకు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 5.63% మాత్రమే. భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4,89,294 కావటంతో 5 లక్షలలోపు కొనసాగిస్తున్నట్టయింది.  

కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.ప్రస్తుతం కోలుకున్నవారిశాతం 92.89% గా నమోదైంది. ఈరోజుకి కోలుకున్నవారి సంఖ్య 80,66,501. కోలుకున్నవారికీ, చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా 75,77,207. ఇలా ఉండగా, కొత్తగా కోలుకున్నవారిలో 78% మంది కేవలం 10 రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 9,164 మంది కోలుకున్నారు. ఢిల్లీలో 7,264 మంది, కేరళలో 7,252మంది కోలుకోగా ఆ రెండు రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.  

కొత్తగా కోవిడ్ నిర్థారణ జరిగిన కేసుల్లో  78% కేసులు 10 రాష్ట్రాలకు చెందినవే కాగా ఢిల్లీ లో అత్యధికంగా ఒకే రోజు 8,593 కేసులు నమోదై మొదటి స్థానంలో నిలబెట్టాయి. 7007 కేసులతో కేరళ, 4907 కేసులతో మహారాష్ట్ర ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.

గడిచిన 24 గంటల్లో 550 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల్లో మరణాల శాతం ఈరోజు 1.48% చేరినట్టయింది. ఈ మరణాలలో 80% కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదు కాగా 22.7%  (125 మరణాలౌ) మహారాష్ట్రలో, 85 మరణాలు ఢిల్లీలో, 49 మరణాలు పశ్చిమబెంగాల్ లో నమొదయ్యాయి.

****


(Release ID: 1672249) Visitor Counter : 192