PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 10 NOV 2020 6:04PM by PIB Hyderabad

 

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)

· భారత్ లో 40 వేలలోపు నమోదైన రోజువారీ కొత్త కేసులు

· గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు 38,073

· వరుసగా 38వ రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య అధికం; గత 24 గంటలలో కోలుకున్నవారు 42,033 మంది

· భారత్ లో పాజిటివ్ కేసుల శాతం 5,88%

· కోలుకున్నవారి శాతం 92.64% కు చేరిక

· ఈరోజు వరకు కోలుకున్నవారు 79,59,406 మంది

Image

#Unite2FightCorona

#IndiaFightsCorona

భారత్ లో 40 వేలకంటే తక్కువ నమోదైన కోవిడ్ కొత్త కేసులు ; తగ్గుదలబాటలో చికిత్సలో ఉన్నవారు, మరణాలు

ఆరు రోజుల తరువాత భారత్ లో 40 వేలకంటే తక్కువగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 38,073 కేసులు వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా కొత్త కేసులు 40 వేల లోపే ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలలో కొత్త కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు-నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల రోజుకు లక్షకు పైగా కేసులు కూడా నమోదవుతూ వస్తున్నాయి. కొద్ది వారాలుగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తున్నది. వరుసగా 38వ రోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తున్నది. గత 24 గంటలలో 42,033 మంది కోలుకున్నారు. దీంతో చిఉకిత్సలో ఉన్నవారి సంఖ్య 5,05,265 కు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పుడు చికిత్సపొందుతూ ఉన్నవారి వాటా 5.88% చేరింది. దీని ఫలితంగా కోలుకున్నవారిశాతం పెరుగుతూ ప్రస్తుతం 92.64% కి చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 79,59,406 కి చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా విస్తరిస్తూ 74,54,141 కి చేరింది. అయితే, గత 24 గంటలలో కోలుకున్నవారిలో 78% మంది కేవలం 10 రాష్టాలలో కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. అందులో ఢిల్లీలో అత్యధికంగా 7,014 మంది కోలుకోగా, కేరళలో 5,983 మంది, పశ్చిమ బెంగాల్ లో 4,396 మంది ఉన్నారు. కొత్త కేసులలో 72% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా అత్యధికంగా ఢిల్లీలో గత 24 గంటలలో 5,983 కేసులు వచ్చాయి. అయితే, అది అంతకు ముందు రోజు నమోదైన 7,745 కొత్త కేసులకంటే తక్కువ. 3907 కేసులతో పశ్చిమ బెంగాల్, 3,277 కేసులతో మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. గడిచిన 24 గంటలలో 448 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా మరణాల సంఖ్య 500 కు దిగువనే ఉండిపోయింది. నిన్న చనిపోయిన వారిలో దాదాపు 78% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 85 మంది, ఢిల్లీలో 71 మంది, పశ్చిమ బెంగాల్ లో 56 మంది మరణించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671686

షాంఘై సహకార సంస్థ ( ఎస్ సి వో) శిఖరాగ్ర సదస్సు -2020 లో ప్రధాని ప్రసంగం ముఖ్యాంశాలు

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671727

జె ఎన్ యు కాంపస్ లో నవంబర్ 12న స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తారు. కేంద్ర విద్యాశాఖామంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివేకానంద బ్వోధనలు ఆయన కాలంలో లాగానే ఇప్పటికీ ఆచరణీయమని ప్రధాని తరచూ చెబుతూ ఉంటారు. జనసామాన్యానికి సేవచేయటం, దేశ యువతను బలోపేతం చేయటం వలన దేశం భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను బలపడి అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని ప్రధాని చెబుతూ ఉండటం తెలిసిందే. భారత దేశ సుసంపన్నత ఇక్కడి ప్రజలలోనే ఉంటుందని, అందుకే అందరినీ సశక్తులను చేయటం ద్వారానే స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని అభిప్రాయపడతారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671669

మొదటి బ్రిక్స్ దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశానికి హాజరైన ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

రష్యా ఆతిథ్యంలో నిన్న జరిగిన మొదటి బ్రిక్స్ దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 2020 లో జి-20 సౌదీ ప్రెసిదెన్సీ చర్చల ఫలితాలను సమీక్షించటం, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ సభ్యత్వాన్ని విస్తరించటం మీద, మౌలిక వసతులలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు డిజిటల్ వేదిక ఏర్పాటు తదితర అంశాలు ఈ ఎజెండాలో ఉన్నాయి. బ్రిక్స్ సభ్యులందరూ సభ్యులుగా ఉన్న జి20 ఈ ఏడాది అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నదని శ్రీమతి నిర్మలాసీతారామన్ అన్నారు. కోవిడ్ సంక్షోభానికి ఉమ్మడిగా అంతర్జాతీయంగా స్పందించటానికి ఒక విస్తృతమైన మార్గదర్శనం చేయటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించటం గురించి చర్చించిందన్నారు. అల్పాదాయ దేశాల తక్షణ అవసరాలు తీర్చటానికి, ద్రవ్యత్వం పెంచటానికి వీలుగా వడ్డీ నిలిపివేత గురించి కూడా జి20 చర్చించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ అల్పాదాయ దేశాల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకోవటంతోబాటు బ్రిక్స్ దేశాలు కీలకమైన పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పన్ను విధింపు సమస్యకు పరిష్కారం కనుక్కోవటానికి అంతర్జాతీయంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, ఉమ్మడిగా ప్రయత్నిస్తే ఒక పారదర్శకమైన, న్యాయబద్ధమైన, సుస్థిరమైన పన్ను వ్యవస్థ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్దారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671661

మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్ల పునఃప్రారంభపు ఏర్పాట్లు సమీక్షించిన కేంద్ర సంస్కృతి శాఖామంత్రి (స్వయం ప్రతిపత్తి) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

కేంద్ర సంస్కృతి శాఖామంత్రి (స్వయం ప్రతిపత్తి) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లను మంత్రిత్వశాఖ జారీచేసిన ప్రామాణిక నిర్వహణావిధానాలకు అనుగుణంగా నేటినుంచి పునఃప్రారంభించటానికి ఏర్పాట్లను నిన్న సమీక్షించారు. ఈ విషయంలో మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లకు వివరంగా మార్గదర్శకాలు జారీచేశామన్నారు.ఈ విషయంలో నేషనల్ మ్యూజియం చేసిన ఏర్పాట్లను సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏర్పాట్ల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ మొత్తం బృందాన్ని అభినందించారు. ఆన్ లైన్ టికెట్లు, ద్వారం దగ్గరే శరీర ఉష్ణోగ్రత చూడటం లాంటి చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించటానికి అందరూ తగిన సూచనలివ్వాలని, మార్గదర్శకాలు పాటిస్తూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. సంస్కృతి మంత్రిత్వశాఖ పరిధిలోని ఇతర మ్యూజియంలు కూడా ఇదే మార్గంలో పయనిస్తాయన్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671666

పితంపుర లోని దిల్లీహాట్ వద్ద హ్యునర్ హాట్ ను ఆవిష్కరించనున్న ముక్తార్ అబ్బాస్ నక్వీ

కరోనా సంక్షోభం కారణంగా ఏడు నెలలుగా నిలిచిపోయిన హ్యునర్ హాట్ రేపటినుంచి పునఃప్రారంభం కాబోతున్నది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వీ రేపు పితంపుర లోని దిల్లీహాట్ వద్ద హ్యునర్ హాట్ ను ప్రారంభిస్తారు. మట్టి, లోహం, జనపనార, కలపతో తయారు చేసిన ఆకర్షణీయమైన స్వదేశీ వస్తువులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారతాయన్నారు. వెదురుతో తయారు చేసిన ఇలాంటి అరుదైన ఉత్పత్తులు, మైమరపించే మట్టి పాత్రలు ఇక్కడ ప్రదర్శనకు, అమ్మకానికి ఉంచుతారన్నారు. పితంపుర లోని ఢిల్లీ హాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన నవంబర్ 11 నుంచి 22 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. స్థానికత కోసం గొంతెత్తమంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు వలన స్వదేశీ పరిశ్రమలకు ఊతం దొరికిందన్నారు. వీటి తయారీలో పాలుపంచుకున్న హస్త కళాకారులకు వివిధ సంస్థల ద్వారా సహకారం అందుతున్నదన్నారు. దానివలన స్వదేశీ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన పాకేజింగ్ తోడైందని, ఆత్మ నిర్భర్ భారత్ ఆకాంక్ష బలపడుతుందని అన్నారు. ఈ ప్రదర్శనలో 100 కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671721

కరోనా అనంతర కాలంలోనూ డాక్టర్ల భద్రతకోసం వైద్య పరికరాలు తయారు చేసే స్టార్టప్స్

కోవిడ్ సంక్షోభంలో అవసరమైన అత్యవసర సేవలకు అనుగుణంగా డాక్టర్లకోసం అవసరమైన ఎమర్జెన్సీ పరికరాలను డిజైన్ చేయటం సాధ్యమా? శాస్త, సాంకేతిక విభాగం మద్దతుతో నడుస్తున్న అనేక స్టార్టప్స్ ఇప్పుడు ఈ దిశలో ప్రయోగాలు చేస్తున్నాయి. రోగిని తాకకుండా పనిచేసే స్టెతస్కోప్ తయారీ, ఆస్పత్రులు స్వయంగా ఆక్సిజెన్ తయారు చేసుకోగలిగేట్టు చేసే ఆక్సిజెన్ కాన్ సెంట్రేటర్, చేతపట్టుకొని తీసుకువెళ్ళగలిగే వెంటిలేటర్ వ్యవస్థ లాంటివి ఎన్నో ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇలాంటి నవకల్పనలతో కూడిన వైద్య పరికరాలు సరికొత్త డిజైన్లతో రూపుదిద్దుకోవటానికి స్టార్టప్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆవిధంగా కోవిడ్ విసిరిన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ కృషి జరుగుతోంది. భారత్ ప్రభుత్వం వారి శాస్త్ర, సాంకేతిక విభాగం కోవిడ్ మీద పోరులో భాగంగా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అద్భుతమైన వెంటిలేటర్ తో బాటు శ్వాసకు ఉపకరించే పరికరాలను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని అంచనావేసే పనిలో పడింది. వాడకం స్థాయి దాకా తీసుకువచ్చిన ఐదు సంస్థల ఉత్పత్తులు ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671687

శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అధ్యక్షతన 25 ప్రాజెక్టులకు ఆమోదం

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అధ్యక్షతన నిన్న జరిగిన అంతర్-మంత్రిత్వశాఖల సమావేశం రూ. 443 కోట్ల విలువచేసే 21 ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. వీటికి సమీకృత శీతలగిడ్డంగులు, విలువపెంపు పథకం కింద రూ. 189 కోట్ల రూపాయల గ్రాంటు గా ఇస్తారు. ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రామేశ్వర్ తేలి అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలో బి ఎఫ్ ఎల్ పథకం కింద రూ.. 62 కోట్ల పెట్టుబడితో మొదలయ్యే మరో 8 ప్రాజెక్టులకు రూ. 15 కోట్లు గ్రాంటుగా మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుల వలన రైతులతోబాటు వినియోగదారులు లబ్ధిపొందుతారని మంత్రి శ్రీ తోమార్ అన్నారు. ఈ 21 ప్రాజెక్టులు దాదాపు 12600 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నందున వాటి అమలును వేగవంతం చేయాలని అధికారులను కోరారు. అదే సమయంలో వీటివలన 200592 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, కేరళ, నాగాలాండ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. సమీకృత శీతల గిడ్డంగులు, విలువపెంపు మౌలిక సదుపాయాలు ఉద్యానవన పంటల దిగుబడి అనంతర నష్టాలను నివారిస్తాయి. అప్పుడే రైతులకు తగిన ధర లభిస్తుంది. ఆమోదం పొందిన మరో 8 ప్రాజెక్టుల వలన 2500 మందికి ఉపాధి చేకూరుతుంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671660

పిఐబి క్షేత్రస్థాయి అధికారులనుంచి అందిన సమాచారం

 

మహారాష్ట్ర: కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టటం మహారాష్ట్రలో సోమవారం కూడా కనబడింది. 3,277 కొత్త పాజిటివ్ కెసులు నమోదయ్యాయి. ఇది జూన్ 23 తరువాత అతి తక్కువ సంఖ్య. ముంబయ్ నగరంలో 599 కొత్త కేసులు నమోదయ్యాయి. పూణెలో కూడా తగ్గుముఖంపట్టినట్టు రుజువు చేస్తూ కొత్త కేసులు 631 కే పరిమితమయ్యాయి.

గుజరాత్: గుజరాత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య సోమవారం నాడు 1.82 లక్షలకు చేరింది. తాజాగా 971 కెసులు నమోదు కాగా ఐదుగురు బాధితులు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,768 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తందా దాదాపు వెయికి పైగా బాధితులు కోలుకున్నారు. . ఇప్పటిదాకా రాష్ట్రంలో కోవిడ్ నుంచికోలుకున్నవారి సంఖ్య 1.65 లక్షలు దాటింది.

రాజస్థాన్: అక్టోబర్ లో తగ్గుతూ వచ్చిన కోవిడ్ కేసులు ఇప్పుడు దీపావళి దగ్గర పదుతున్న సమయంలో రాజస్థాన్ లో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 1,858 కొత్త కేసులు సోమవారం నాడు నమోదయ్యాయి. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 16,542 కి ఎగబాకింది.

మధ్యప్రదేశ్: సోమవారం నాడు మధ్యప్రదేశ్ లో 809 తాజా కోవిద్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,78,168 కి చేరింది. నిన్న ఆరుగురు మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 3,034 కి చేరింది. గత 24 గంటలలో 681 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,67,084 కి చేరింది. ఇంకా చికిత్సలో ఉన్నవారు 8,050 మంది.

చత్తీస్ గఢ్: బాణసంచా అమ్మాకాలు, వాడకం మీద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను కచ్చితంగా అమలుచేయాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అధికంగా బాణసంచా వాడటం వలన కాలుష్యం పెరిగిపోయి కోవిడ్ కేసులు ఎక్కువ కావచ్చునని ఆదేశాలలో పేర్కొంది. అదే విధంగా బాణసంచా కాల్చే సమయాన్ని కూడా రెండు గంటలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చత్తీస్ గడ్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 21,221.

అస్సాం: అస్సాంలో నిన్న 28,526 కోవిడ్ పరీక్షలు జరఒపగా 328 కేసులు బయటపడ్దాయి. దీంతో పాజిటివ్ శాతం 1.15% గా నమోదైంది. 508 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,09,117 కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి ట్వీట్ చేశారు.

మణిపూర్: మణిపూర్ లో కోవిడ్ బాధితులు ఒక్క సారిగా పెరుగుతుండటంతో చురాచాండ్ పూర్ డాక్టర్లు సొంత ఖర్చులతో కోవిడ్ ఒపి ప్రారంభించారు.

మేఘాలయ: మేఘాలయలో ఇంకా కోవిడ్ చికిత్సపొందుతూ ఉన్నవారు 1,024, మంది ఉండగా ఇప్పటివరకు కోలుకున్నవారు 9,112. కొత్త కేసులు 28 నమోదయ్యాయి.

మిజోరం: 306 జాతీయ హైవే మీద 11 రోజులపాటు రాకపోకలు నిలిపివేయగా ఇప్పుడు అస్సాం పోలీసులు 20కి పైగా ట్రక్కులను ఎస్కార్ట్ సాయంతో మిజోరం పంపారు.

నాగాలాండ్: సోమవారం నాడు 29 కేసులు రాగా నాగాలాండ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 9,503 కి చేరాయి. ప్రస్తుతం 941 మంది చికిత్సలో ఉండగా 8,423 మంది కోలుకున్నారు..

సిక్కిం: సిక్కింలో - 3,839 మంది కోలుకోగా , 305 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు. కొత్తగా 51 కేసులు నమోదు కాగా ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 4,308 కి చేరింది..

· కేరళ: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండగా, వీటివలన కేరళలో మరోవిడత కోవిడ్ కెసులు పెరుగుతాయేమోనని ఆరోగ్యశాఖ అధికారులు కలవరపడుతున్నారు. ఎన్నికలు వాయిదావేయాలని కొరుతూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీదనే ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి. ఈ పిటిషన్ వచ్చే సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశముంది. ఓణమ్ క్లస్టర్ల తరహాలో ఎన్నికల క్లస్టర్లు తయారుచేసే ఆలోచనలొ ఉన్నట్టు రాష్ట్ర నిపుణుల కమిటీ చెబుతోంది. ఇలా ఉండగా రెండు నెలల, శబరిమల యాత్ర సీజన్ నవంబర్ 16న ప్రారంభం కాబోతుండగా ప్రభుత్వం కఠిన నిబంధనలు పాటించేలా సూచనలు జారీచేసింది.

తమిళనాడు: తమిళనాడులో 9-12 తరగతుల విద్యార్థులకోసం పాఠశాలల పునఃప్రారంభం మీద ఏర్పాటు చేసిన సమావేశం ఎటూ తేల్చకుందానే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పాఠశాలలు ఉండగా, అందరి అభిప్రాయాలు సేకరించే క్రమంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించారు. నవంబర్ 10 నుంచి . మ్యూజియంలు తెరవటానికి తమిళనాడు ప్రభుత్వం ప్రామాణిక విధానాలు ప్రకటించింది. ఆరడుగుల భౌతిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని గంటకు ఎంతమందిని అనుమతించవచ్చునో లెక్కగట్టారు. నిన్న తమిళనాడులో 18 మంది కోవిడ్ బాధితులు మరణించారు. ఇది గడిచిన ఐదు నెలల్లో అతి తక్కువ సంఖ్య.

కర్నాటక: నవంబర్ 17 నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీలు పునఃప్రారంభిస్తూ ఉండటంతో ఉన్నతవిద్యాశాఖ అధికారులు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం రూపొందించిన ప్రామాణిక మార్గదర్శకాలకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించారు. కర్నాటక రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఈ పండుగ సందర్భంగా 1000 అదనపు బస్సులు నడుపుతోంది. .ఈ ప్రత్యేక బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. పండుగ సీజన్ కావటంతోఈ షాపులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ కర్నాటకలో నిన్న నమోదైన కొత్త కోవిద్ కేసులు 978 కి పరిమితమయ్యాయి. ఇది గత నాలుగునెలల్లో అత్యల్పం.

ఆంధ్రప్రదేశ్: కోవిడ్ వాక్సిన్ పంపిణీ సాఫీగా జరగటానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అధ్యక్షతన మొత్తం 18 మంది సభ్యులుండే స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ కన్వీనర్ గా ఉంటారు. వాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా ఆరోగ్య సిబందికి వాక్సిన్ ఇస్తారు. రాష్ట్రంలో ప్రతి జిలలలోను నిన్న 100 కు లోపే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా 1,549 మంది బాధితులు కోలుకోవటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 21,235 కి చేరింది. మొత్తంగా చూస్తే . కోవిడ్ సోకిన 8.16 లక్షలమంది కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినవారు కోలుకున్నారు. .

తెలంగాణ: 1267 కొత్త కేసులు, 1831 మంది కోలుకున్నవారు నమోదయ్యారు.గత 24 గంటలలో నలుగురు మరణించగా, 1267 కొత్త కేసులలో 201 జిహెచ్ ఎంసి పరిధిలోనివి. . ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు: 2,52,455; చికిత్సలో ఉన్నది: 18,581 మంది; మరణాలు: 1385 కాగా, కోలుకొని డిశ్చార్జ్ అయినవారు 2,32,489 మంది ఉన్నారు. కోలుకున్నవారి శాతం 92.09 గా నమోదైంది, దేసవ్యాప్తంగా కోలుకున్నవారి సాతం 92.60

FACT CHECK

 

 

Image

*********

 



(Release ID: 1671862) Visitor Counter : 178