సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తిరిగి ప్రారంభం

పునఃప్రారంభ ఏర్పాట్లు, ముందు జాగ్రత్తలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ సమీక్ష

Posted On: 09 NOV 2020 6:54PM by PIB Hyderabad

   కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి 2020 నవంబరు 9న న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంను సందర్శించారు. మంత్రిత్వ శాఖ వెలువరించిన నిర్వహణా నిబంధనల మేరకు మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో జరిగే సన్నాహాలను ఆయన సమీక్షించారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, నేషనల్ మ్యూజియం అదనపు డైరెక్టర్ జనరల్ శుభ్రతా నాథ్, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నిరుపమా కొట్రు, నేషనల్ మ్యూజియానికి, నేషనల్ మ్యూజియం సంస్థకు చెందిన ఇతర అధికారులు ఈ సందర్భంగా మంత్రివెంట ఉన్నారు.

   మ్యూజియంలను, ఆర్ట్ గ్యాలరీలను 2020 నంవంబరు 10నుంచి తెరుస్తున్న నేపథ్యంలో చేయాల్సిన సన్నాహాలపై తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయని, నేషనల్ మ్యూజియం చేసిన సన్నాహాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. ఇందకు నేషనల్ మ్యూజియంకు సిబ్బందిని, ప్రతినిధి బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. పునఃప్రారంభంకోసం  తీసుకున్న పలు చర్యలపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచడం, ప్రవేశ ద్వారంవద్ద సందర్శకుల శారీర ఉష్ణోగ్రతను పరీక్షించడం తదితర ముందు జాగ్రత్త చర్యలు సంతృప్తికరమన్నారు. పునఃప్రారంభంకోసం చేసిన ఏర్పాట్లను మరింత మెరుగుపరిచేందుకు తగిన సూచనలివ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. మొత్తం ప్రక్రియలో ప్రజల సహకారాన్ని కోరుతున్నామన్నారు.

  అన్ లాక్ ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంను సందర్శకులకోసం  2020 నవంబరు 10నుంచి తిరిగి తెరిచారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని మిగతా మ్యూజియంలను కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నారు.

 

  కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వెలువరించిన మార్గదర్శకాలను, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వివిధ భాగస్వామ్య వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం  మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్ల పునఃప్రారంభానికి వివరణాత్మకమైన నిబంధనాలవళిని మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనావళిని రూపొందించారు.

   వివిధ మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీల యాజమాన్యాలు, ఎగ్జిబిషన్ల నిర్వాహకులు, సందర్శకులు పాటించవలసిన నిబంధనలు,  ప్రమాణబద్ధమైన నిర్వహణా నియమాలతో ఈ మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు. తగిన పరశుభ్రతను పాటించడం, టికెట్ల కొనుగోలు, సందర్శకులకు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్ల సిబ్బందికి భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలతో సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను కూడా వెలువరించారు.

  కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న మ్యూజియంలను లేదా ఆర్ట్ గ్యాలరీలను మాత్రం తెరిచేది లేదని ఈ మార్గదర్శక సూత్రాల్లో స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్షేత్రస్థాయిలో తమ అవసరాలను బట్టి అదనపు చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా మార్గదర్శక సూత్రాల్లో పేర్కొన్నారు.

  కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో జారీ చేసిన ఆదేశాలు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రంగాలు జారీ చేసిన ఆదేశాలను అన్ని విషయాల్లోనూ కచ్చితంగా పాటించవలసి ఉంటుంది.

  ఈ మార్గదర్శక సూత్రాలు వెంటనే అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకూ అమలులో ఉంటాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని మ్యూజియంలు, ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీలు 2020 నంవబరు 10నుంచి తెరుకోగా, మిగతా మ్యూజియంలు, ఎగ్జిబిషన్ల విషయంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాలు, స్థానిక సంస్థల నిబంధనలను, అన్ లాగ్ మార్గదర్శక సూత్రాలను పాటించవలసి ఉంటుంది.

   “మ్యూజింయంలు, ఆర్ట్ గ్యాలరీలు ఎగ్జిబిషన్ల పునఃప్రారంభానికి” పాటించవలసిన మార్గదర్శక సూత్రాలకోసం ఈ  లింకును క్లిక్ చేయండి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/SOPsMuseums&ArtGalleries5112020.pdf

*****

 



(Release ID: 1671666) Visitor Counter : 149