ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 40 వేలకంటే తక్కువ నమోదైన కోవిడ్ కొత్త కేసులు

తగ్గుదలబాటలో చికిత్సలో ఉన్నవారు, మరణాలు

Posted On: 10 NOV 2020 11:19AM by PIB Hyderabad

ఆరు రోజుల తరువాత భారత్ లో 40 వేలకంటే తక్కువగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 38,073 కేసులు వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా కొత్త కేసులు 40 వేల లోపే ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలలో కొత్త కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు-నాలుగు రోజుల్లో  కొన్ని చోట్ల రోజుకు లక్షకు పైగా కేసులు కూడా నమోదవుతూ వస్తున్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UPJT.jpg

కొద్ది వారాలుగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తున్నది. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TFL8.jpg

వరుసగా 38వ రోజు కూడా కొత్తకేసులకంటే  కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తున్నది. గత 24 గంటలలో 42,033 మంది కోలుకున్నారు. దీంతో చిఉకిత్సలో ఉన్నవారి సంఖ్య 5,05,265 కు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పుడు చికిత్సపొందుతూ ఉన్నవారి వాటా 5.88% చేరింది. ఈ  గ్రాఫ్ ఆ పరిస్థితికి అద్దం పడుతుంది.

దీని ఫలితంగా కోలుకున్నవారిశాతం పెరుగుతూ ప్రస్తుతం  92.64% కి చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య  79,59,406 కి చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా విస్తరిస్తూ 74,54,141 కి చేరింది. అయితే, గత 24 గంటలలో కోలుకున్నవారిలో  78% మంది కేవలం 10 రాష్టాలలో కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. అందులో ఢిల్లీలో అత్యధికంగా 7,014  మంది కోలుకోగా,  కేరళలో 5,983 మంది, పశ్చిమ బెంగాల్ లో 4,396 మంది ఉన్నారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FAJJ.jpg

కొత్త కేసులలో 72% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా అత్యధికంగా ఢిల్లీలో గత 24 గంటలలో  5,983 కేసులు వచ్చాయి.  అయితే, అది అంతకు ముందు రోజు నమోదైన 7,745 కొత్త కేసులకంటే తక్కువ. 3907 కేసులతో పశ్చిమ బెంగాల్,  3,277 కేసులతో మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PCKU.jpg

గడిచిన 24 గంటలలో 448 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.   వరుసగా రెండో రోజు కూడా మరణాల సంఖ్య 500  కు దిగువనే ఉండిపోయింది. నిన్న చనిపోయిన వారిలో దాదాపు 78% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 85 మంది, ఢిల్లీలో 71 మంది, పశ్చిమ బెంగాల్ లో 56 మంది మరణించారు.   

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005J89Z.jpg

***



(Release ID: 1671686) Visitor Counter : 189