ఆర్థిక మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ ఆర్ధికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
09 NOV 2020 6:53PM by PIB Hyderabad
కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఆర్ధికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశానికి ఈరోజు హాజరయ్యారు. ఈ బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశ అజెండా లో సౌదీ అధ్యక్షతన 2020 జి-20 ఫలితాలు, మౌలికసదుపాయాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి డిజిటల్ ప్లాట్‌ఫాం, కొత్త అభివృద్ది బ్యాంక్ సభ్యత్వ విస్తరణ తదితర అంశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ బ్రిక్ దేశాలన్నీ జి-20లో సభ్యదేశాలుగా ఉన్నాయని, ఈ సంస్థ ఈ ఏడాది కొన్నికీలక చొరవతో కూడిన చర్యలు చేపట్టిందన్నారు. కోవిడ్ -19 కు సంబంధించి జి-20 యాక్షన్‌ప్లాన్ ప్రస్తుత కోవిడ్ మహమ్మారికి అంతర్జాతీయంగా సమష్ఠి కృషికి స్థూలమార్గనిర్దేశం చేసిందన్నారు. అదనంగా, జి20 రుణ సేవ సస్పెన్షన్ కు తీసుకున్న చొరవ తక్కువ ఆదాయం గల దేశాల లిక్విడిటీ సమస్యకు తక్షణ మద్దతు నిచ్చిందని అన్నారు. అభివృద్ధిలోకి వస్తున్న ఆర్ధికవ్యవస్థల ఆందోళనలు తగినవిధంగా ఈ చర్యలలో ప్రతిబింబించే విధంగా బ్రిక్స్ సభ్యదేశాలు కీలక పాత్ర పోషించాయి.
డిజిటల్ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన పన్ను అంశాలకు పరిష్కారం సాధించే అంతర్జాతీయ కృషి గురించి ప్రస్తావిస్తూ శ్రీమతి నిర్మలా సీతారామన్, నిష్పాక్షిత, సమానత్వం, పన్ను వ్యవస్థ నిలదొక్కుకోవడానికి సంబంధించి ఏకాభిప్రాయంతో కూడిన పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
బ్రిక్స్ ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు నూతన డవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) విస్తరణ అంశాలను చర్చించారు. ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఎన్.డి.బి సభ్యత్వ విస్తరణకు మద్దతు తెలిపారు. అలాగే ప్రాంతీయ సమతూకం ప్రాధాన్యతను ఆమె నొక్కి చెప్పారు. రష్యా చొరవ చూపిన సమీకృత డిజిటల్ ప్లాట్‌ఫారానికి సంబంధించి శ్రీమతి నిర్మలా సీతారామన్ తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
***
(Release ID: 1671661)
Visitor Counter : 214