ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన 29 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి

ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 15,000 మందికి ఉపాధితో పాటు 2 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది

21 ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయం రూ .443 కోట్లు

Posted On: 09 NOV 2020 6:28PM by PIB Hyderabad

 

కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ మినిస్టీరియల్ అప్రూవల్ కమిటీ (ఐఎంఐసి) సమావేశం ఈ రోజు..443 కోట్ల వ్యయంతో చేపట్టిన 21 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.189 కోట్లను ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ అండ్ వాల్యూ అడిషన్ పథకం కింద కేటాయిస్తారు. అలాగే కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలో 62 కోట్లతో చేపట్టిన మరో 8 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటిలో బిఎఫ్ఎల్ పథకం కింద 15 కోట్ల గ్రాంట్ ఉంది. కేంద్రమంత్రి శ్రీ రామేశ్వర్ తెలి (ఎంవోఎస్) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టులు రైతులకు, వినియోగదారులకు మేలు చేస్తాయని శ్రీ తోమర్ అన్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 21 ప్రాజెక్టులు దాదాపు 12, 600 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అలాగే 200592 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు దేశంలో పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కేరళ, నాగాలాండ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. హార్టికల్చర్, నాన్ హార్టి కల్చర్ పంటల్లో నష్టాలను అరికట్టడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంట్రి గ్రెటెడ్ కోల్డ్ చైన్ అండ్ వాల్యూ అడిషన్ పథకాన్ని చేపట్టింది.

మరో సమావేశంలో ఆమోదించబడిన 8 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రాసెస్ చేయబడిన ఆహార పరిశ్రమకు ముడి పదార్థాల లభ్యతను పెంచడం, మార్కెట్‌తో సరఫరా వ్యవస్థకు ఉన్న అంతరాలను పూరించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

***


(Release ID: 1671660) Visitor Counter : 147