PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
04 NOV 2020 5:56PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది)
* ఇండియా యాక్టివ్ కేస్ లోడ్ 5,33,787
*మొత్తం రికవర్ అయిన కేసులు 76.5 లక్షలకు పైగా ఉంటాయి
* జాతీయ రికవరీ రేటు 92 శాతాన్ని మించింది (92.09 శాతం)
* గత 24 గంటలలో 53,357 మంది పేషెంట్లు కోలుకున్నారు. కొత్తగా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 46,253
* మొత్తం టెస్టుల సంఖ్య సుమారు 11.3 కోట్లు, గత 24 గంటలలో 12,09,609 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
• మహిళల సారధ్యంలోని 6 స్టార్టప్‌లు కోవిడ్-19 శ్రీ శక్తి ఛాలెంజ్‌ను గెలుచుకున్నాయి.
తక్కువ యాక్టివ్ కేసులను కొనసాగిస్తున్న ఇండియా,యాక్టివ్ కేస్‌లోడ్ వరుసగా ఆరవ రోజుకూడా 6 లక్షల కంటే తక్కువగా ఉంది.
రికవరీ రేటు 92 శాతం
ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు కోలుకుంటుండడంతో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య బాగా పడిపోయింది. క్రియాశీల కేసుల సంఖ్యకూడా క్రమంగా పడిపొతున్నది. యాక్టివ్ కేస్‌లోడ్ వరుసగా ఆరవ రోజు కూడా ఆరు లక్షలకంటే తక్కువ వద్ద ఉంది. ఈరోజు ఇండియా యాక్టివ్ కేస్‌లోడ్ 5,33,787 వద్ద ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం పాజిటిటివ్ కేసులలో కేవలం 6.42 శాతం మాత్రమే ఉన్నాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేసులు ప్రతి మిలియన్‌కు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. మొత్తం కోలుకున్న కేసులు 76.5 లక్షలు మించి ఉన్నాయి.(76,56,478) దీనివల్ల యాక్టివ్ కేసుల మధ్యతేడా ఎక్కువగా ఉంది. దేశం సాధించిన మరో విజయం ఏమంటే, జాతీయ రికవరీ రేటు 92 శాతం దాటింది.(92.09శాతం). 53,357 మంది పేషెంట్లు గత 24 గంటలలో కోలుకోవడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జిచేశారు. కొత్తగా నిర్ణారణ అయిన కేసుల సంఖ్య 46,253 గా ఉంది. 17 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల రికవరీరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. దేశంలో పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెంచడం జరిగింది.ఇవాల్టికి మొత్తం కేసుల సంఖ్య 11.3 కోట్లకు చేరింది (11,29,98,959). గత 24 గంటలలో 12,09,609 పరీక్షలు నిర్వహించారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతిమిలియన్‌కు జాతీయ సగటు కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నారు .కొత్తగా కోలుకున్నకేసులలో 80శాతం కేసులు 10 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి.కేరళలో ఒక్కరోజే 8000 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు. కర్ణాటకలో 7,000 మంది కోలుకున్నారు. కొత్తగా నిర్ధారణ అయిన కేసులలో 76 శాతం 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. కొత్త కేసులకు సంబంధించి కేరళ,ఢిల్లీల నుంచి ఎక్కువ కేసులు ఉన్నాయి.ఒక్కొక్క రాష్ట్రంనుంచిసుమారు 6 వేల వరకు కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో సుమారు 4,000కుపైగా కొత్తకేసులు ఉన్నాయి. గత 24 గంటలలో 514 మరణాలు సంభవించాయి. ఇందులో 80 శాతం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 120 మంది మరణించారు. ఇండియా కేస్ ఫాటలిటీ రేటు 1.49 శాతంగా ఉంది. 21 రాష్ట్రాఉల, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పదిలక్షలకు మరణాల సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
మరిన్నివివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670082
----------
ఆరోగ్యం, ఔషధ రంగాలకు సంబంధించి ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సహకారాకిని ఎం.ఒ.యుపై సంతకానికి అనుమతి మంజూరు చేసిన కేంద్రకేబినెట్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైనకేంద్ర కేబినెట్ ఇండియా , ఇజ్రాయిల్ మధ్య ఆరోగ్యం,ఔషధరంగంలో సహకారానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపింది. ఈ అవగాహనా ఒప్పందంలో వైద్యులు, ఇతర ఆరోగ్యరంగ ప్రొఫెషనల్స్ మార్పిడి విషయంలో సహకారం తదితర అంశాలు, మానవ వనరుల అభివృద్ధి విషయంలో సహకారం,ఆరోగ్య సదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. అలాగే ఫార్మాసూటికల్స్, వైద్య పరికరాలు, కాస్మొటిక్స్‌కు సంబంధించిన సమాచార మార్పిడి, వాతావరణ మార్పుల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావం,వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పంచుకోవడం, గ్రీన్ హెల్త్‌కేర్‌కు సంబంధించి మద్దతు , పరస్పరం ఉభయపక్షాలూ అంగీకరించిన అంశాలపై సహకారానికి సంబంధించి ఇది వర్తిస్తుంది.
మరిన్ని వివరాలకు:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670094
ఇండియా ,యునైటెడ్‌కింగ్‌డమ్ లమధ్య వైద్య ఉత్పత్తుల రెగ్యులేషన్‌కు సంబంధించి పరస్పర సహకారానికి అవగాహనా ఒప్పందంపై ఆమోదం తెలిపిన కేంద్రకేబినెట్.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , మెడికల్ ప్రాడక్ట్ రెగ్యులేషన్‌కు సంబంధించి మన దేశానికి చెందిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) , యునైటెడ్ కింగ్‌డమ్ మెడిసిన్,హెల్త్‌కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (యుకె ఎంహెచ్ ఆర్) మధ్య ఎం.ఒ.యు పై సంతకాలకు ఆమోదం తెలిపింది. ఈ ఎం.ఒ.యు సెంట్రల్‌డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ), యునైటెడ్‌కింగ్‌డమ్ వెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (యుకెఎంహెచ్ ఆర్ ఎ) పరస్పర సమాచార మార్పిడికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670108
నవంబర్ 5 న వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 5,2020న వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి (విజిఐఆర్) అధ్యక్షత వహించనున్నారు. ఈ విజిఐఆర్‌ను భారతప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిర్వహించనున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లు,భారతీయ వ్యాపార నాయకులు , ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నిర్ణాయక వ్యక్తులు, ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేటర్లు ఇందులో పాల్గొంటారు. కేంద్ర ఆర్ధికమంత్రి, కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి, ఆర్‌బిఐ గవర్నర్, ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రౌం డ్ టేబుల్ సమావేశంలో ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్, సావరిన్‌వెల్త్‌ఫండ్లకు చెందిన 20 సంస్థలుఇందులో పాల్గొన నున్నాయి. వీటి మొత్తం ఆస్తులు 6 ట్రిలియన్ డాలర్లు. ఈ అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లు అమెరికా , యూరప్, కెనడా, కొరియా, జపాన్, మధ్యాసియా, ఆస్ట్రేలియా,సింగపూర్‌కు చెందినవి. ఈఫండ్‌లకు చెందిన కీలక నిర్ణయాధికారులు అంటే సిఇఒ, సిఐఒలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రౌండ్ టేబుల్స్‌లో కొన్నింటిలో బారతదేశ అత్యునత కంపెనీలకు నాయకత్వ స్థానంలో ఉన్నావారు కూడా పాల్గొననున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669878
యుఎన్ ఉమన్‌తో కలిసి మైగవ్ నిర్వహించిన కోవిడ్ 19 స్త్రీశక్తిఛాలెంజ్ ని గెలుచుకున్న ఆరు మహిళా స్టార్టప్‌లు
మహిళల నాయకత్వంలోని ఆరు స్టార్టప్‌లు కోవిడ్ 19 స్త్రీశక్తి చాలెంజ్ అవార్డులను గెలుచుకున్నాయి. దీనిని యుఎన్ ఉమెన్‌తో కలసి మైగవ్ నిర్వహించింది. మహిళల నాయకత్వంలోని స్టార్టప్‌లను ప్రొత్సహించడానికి, కోవిడ్ -19 పై పోరాటంలో వినూత్న పరిష్కారాలు సాధించడానికి , వీలైనంత ఎక్కువమంది మహిళలపై ప్రభావం చూపే పరిష్కారాలు కనుగొనడానికి మై గవ్ సంస్థ యుఎన్ ఉమెన్ తో కలిసి కోవిడ్ 19 స్త్రీ శక్తి సవాలను ఏప్రిల్ 2020న ప్రారంభించింది.
ఇది మైగవ్ ప్లాట్‌ఫాంపై వినూత్నంగా ప్రకటించిన సవాలు ఇది. ఎక్కువమంది మహిళలకు ప్రయొజనం కలిగించే పరిష్కారాలను ఈ స్టార్టప్‌లనుంచి ఆహ్వానించారు. ఈ సవాలును రెండు దశలలో అమలు చేశారు. ఒకటి ఐడియా దశ, రెండోది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌దశ.ఈ సవాలుకు అత్యద్భుత స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 1265 ఎంట్రీలు వచ్చాయి.
మరిన్నివివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669954
చెన్నైలో నాలుగవ బెటాలియన్ సెంటర్‌లో 10 బెడ్ల తాత్కాలిక ఆస్పత్రిని , ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూ విజ్ఞాన , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు చెన్నైలోని 4 వ బెటాలియన్ సెంటర్‌లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పది పడకల తాత్కాలిక ఆస్పత్రిని, ఐసొలేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్ సిఎస్ైఆర్-ఎస్ఇఆర్‌సి ని, ఆయా సంస్థల శాస్త్రవేత్తలు, జాతీయ విపత్తు స్పందన దళంవారిని అభినందించారు. కోవిడ్ 19 సవాలును ఎదుర్కొనేందుకు వారు వినూత్న పరిష్కారాలు అన్వేషించారని ఆయన అన్నారు.
4వ బెటాలియన్ సెంటర్ ,ఎన్‌డిఆర్ఎఫ్, చెన్నై లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు అందించేందుకు ఏర్పాటు చేసినదని, ఇది 20 సంవత్సరాల వరకు పనిచేస్తుందన్నారు. ఆధునిక, మన్నికైన, త్వరగా ఏర్పాటు చేయడానికి వీలుకలిగన , అన్ని వాతావారణాలకు తట్టుకునే విధంగా , వేగంగా అమర్చడానికి ఇది వీలైనదని ఆయన అన్నారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థఙతులు, దీర్ఘకాల మహమ్మారుల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660250
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాలనుంచి అందిన సమాచారం.
* మహారాష్ట్ర : దేశంలోని కోవిడ్ -19 కేసులలో ఎక్కువ భాగం మహారాష్ట్రకు చెందినవే అవుతున్నప్పటికీ , గత 15 రోజులుగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య మహారాష్ట్రలో తగ్గుతూ వస్తోంది. ఈ విధంగా కొత్తకేసులు, మరణాలు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు.గత కొన్ని నెలలుగా నిర్వహిస్తూ వచ్చిన పరీక్షలు, ఇప్పటికే ఎక్కువమంది వైరస్ బారిన పడడం, వైరస్ బలహీనపడడం, అన్‌లాకింగ్ ప్రక్రియను క్రమంగా అమలు చేయడం వంటివి కారణం కావచ్చని అంటున్నారు. దీపావళి పండగ, షాపులు తిరిగి తెరుచుకోవడంతో ఎక్కువమంది ఇతరులను కలిసే అవకాశం ఉండడం, చలి కాలం కారణంగా జనవరిలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 1.16 లక్షలు
* గుజరాత్ : గుజరాత్‌లో గత 24 గంటలలో 954 కేసులు నమోదయ్యాయి.రికవరీ రేటు 90.78 శాతంగా ఉంది. గుజరాత్ లో ఇప్పటివరకు 1,75,633 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌కేసుల సంఖ్య 12.451 కాగా గుజరాత్ ప్రభుత్వం కోవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో , మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్, ప్రాణావసర మందులకు డిమాండ్ రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో తగ్గినట్టు తెలిపింది.
* రాజస్థాన్ : రాజస్థాన్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య ఈరోజు మూడవ రోజుకూడా పెరిగాయి. అక్టోబర్13 నుంచి అక్టోబర్ 31 వరకు తగ్గిన కేసులు ఆతర్వాత పెరుగుతూ వస్తున్నాయి.అక్టోబర్ 31న కోవిడ్ కేసులు 21, 924 గరిష్ఠస్థాయినుంచి 15,102కు పడిపోయాయి. మంగళవారం నాడు తిరిగి యాక్టివ్ కేఉలు 16,385 కు చేరాయి. రాజస్థాన్‌లో 1725 కొత్త కేసులు , 10 మరణాలు గత 24 గంటలలో నమోదయ్యాయి.
*ఛత్తస్‌ఘడ్ :ఛత్తీస్‌ఘడ్‌లో కోవిడ్ -19 కేసులు మంగళవారం నాడు 1.92 లక్షలకు చేరుకున్నాయి. మంగళవారం కొత్తగా 1724 కేసులు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌జిల్లాలో 143 కొత్తకేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు 41,726 కు చేరాయి. కోర్బా జిల్లా లో 291 కేసులు నమోదయ్యాయి. రాయ్‌ఘడ్‌లో 190, జాన్‌గిర్-చంపాలో 182, దుర్గ్‌లో 140, బలోడ్‌లో 101 నమోదైనట్టు అధికారులు తెలిపారు.
* అస్సాం : అస్సాంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు 379 నమోదయ్యాయి. నిన్న 473మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు 20,736, కోలుకున్న వారు 198039, యాక్టివ్ కేసులు 8385 మరణాలు 934.
* మేఘాలయ : మేఘాలయలో మరో63 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మొత్తం యాక్టివ్ కేసులు 971, మొత్తం కోలుకున్న కేసులు 8680.
*మిజోరం : మిజోరంలో 101 మంది నిన్న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మొత్తం కేసులు 2893, యాక్టివ్ కేసులు 516.
* నాగాలాండ్ : నాగాలాండ్‌లో నిన్న 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 39 దినాపూర్‌నుంచి 13 కోహిమా నుంచి 2 మన్, 1 పెరెన్ నుంచి నమోదయ్యాయి.
*సిక్కిం : సిక్కింలో 62 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. యాక్టివ్ కేసులు 254. మొత్తం కోలుకున్నవారు 3657, మొత్తం కేసులు 4067
* కేరళ : శబరిమల మండల మకరలవిలక్కు యాత్రకుసంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ రెండురోజులలోనే పూర్తి అయ్యాయి. ఆలయాన్ని నవంబర్ 15న తెరుస్తారు. రోజుకు వెయ్యిమంది యాత్రికులను మాత్రమే అనుమతించాలన్ననిర్ణయంపై పునరాలోచించనున్నట్టు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. సిపిఐ (ఎం) నాయకుడు, రాష్ట్ర యువజన సంక్షేమ బోర్డు ఉపాధ్యక్షుడు పి..బిజు ఈ ఉదయం కోవిడ్ అనంతర చికిత్స సందర్భంగా మరణించారు. ఆయన వయస్సు 43 సంవత్రాలు. బిజుకు గత నెలలొ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ యింది. ఆయనకు త్రివేండ్రం మెడికల్ కాలేజ్‌లో చికిత్సతీసుకున్నారు. కేరళలలో స్వల్పంగా కోవిడ్ కేసులు తగ్గాయి. నిన్న కేరళలో 6862 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 26 మరణాలు సంభవించాయి. దీనితో మరణాల సంఖ్య 1559 కి చేరింది.
*తమిళనాడు : ఈ ఏడాది తమిళనాడు నుంచి అంతర్ రాష్ట్ర బస్సులులేవు.
రానున్న దీపావళిని పురస్కరించుకుని చైన్న నుంచిరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నవంబర్ 11 నుంచి13 వరకు 9,510 బస్సులు నడపనున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాష్కర్ తెలిపారు. అయితే ప్రయాణికులు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాలు బాణాసంచాను నిషేధిస్తుండంతో శివకాశీ వర్కర్లకు ఇది నిరాశ పరుస్తోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా లాక్‌డౌన్, తదితర కారణాల ప్రభావం బాణాసంచా పరిశ్రమపై పడింది. బాణాసంచా తగినంతగా అమ్ముడుపోకపోతే దీనిపై ఆధారపడిన కుటుంబాలు పేదరికం బారినపడే అవకాశం ఉంది.
* కర్ణాటక : కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ బుధవారం నాడు రాష్ట్రానికి సంబంధించిన మొట్టమొదటి సీరో సర్వే నివేదికను సమర్పించారు. ఈ సర్వే ప్రకారం 16.4 శాతం మంది గతకొద్ది నెలలలో కోవిడ్ బారిన పడినట్టు తేలింది. విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ , రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై డిడిపిఐ అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైరేషన కిట్స్ కింద ప్రభుత్వ పాఠశాలల కోసం 449 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కోవిడ్ పేషెంట్లువాడిన మెటీరియల్‌ను పారవేయడానికి సంబంధించి అమలుచేస్తున్న నిబంధనలను వివరించాల్సిందిగా బిబిఎంపిని హైకోర్టు ఆదేశించింది.
------
•ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2న పాఠశాలల పునఃప్రారంభం అనంతరం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో టీచర్లు , విద్యార్ధులు కోవిడ్ వైరస్ బారిన పడివనట్టుతేలింది. కొత్తకేసులు ఒక్కసారిగా బయటపడుతుండడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. పాఠశాలలకు హాజరౌతున్న విద్యార్ధులు, ఉపాధ్యాయులసమాచారన్ని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేకరిస్తున్నారు.దీని ప్రకారం వారుఅవసరమైన చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్ధుల హాజరు తక్కువగా ఉంది. ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తూర్పు యడవల్లికి చెందిన కామవరపు కోట జోన్‌లోని ఒక పాఠశాలలో 8 మంది విద్యార్ధులకు, విజయనగరం జిల్లాలో 9,10 తరగతులు చదువుతున్న27 మంది విద్యార్ధులకు కోవిడ్ నిర్ణారణ అయింది.
తెలంగాణా : తెలంగాణాలో గత 24 గంటలలో 1637 కొత్త కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. ఈ 1637 కేసులలో 292 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,44,143కాగా యాక్టివ్ కేసులు 18,100. మరణాలు 1357. కోవిడ్‌నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 2,24,686 . రికవరీ రేటు 92.03 శాతం. తెలంగాణాలోని సూక్ష్మ,చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజ్‌ల ను డిజిటైజ్ చేయడానికి , తెలంగాణా రాష్ట్రప్రభుత్వం 20,000 కంపెనీలకు క్లౌడ్ ఆదారిత ఉచిత లైసెన్సులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
FACT CHECK
********
(Release ID: 1670301)
Visitor Counter : 224