మంత్రిమండలి

టెలికమ్యూనికేషన్/ఐసిటి ల రంగం లో స‌హకారానికి భారతదేశాని కి, యునైటెడ్ కింగ్ డమ్ కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పందంపై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 NOV 2020 3:35PM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్/ఇన్ఫర్మేషన్ ఎండ్ కమ్యూనికేషన్ టెక్నాల‌జీస్ (ఐసిటి స్) రంగంలో స‌హ‌కారం అశంపై భార‌త‌దేశ గ‌ణ‌తంత్రానికి చెందిన క‌మ్యూనికేష‌న్స్ మంత్రిత్వ శాఖ‌కు, యునైటెడ్ కింగ్ డ‌మ్ ప్ర‌భుత్వానికి చెందిన డిజిట‌ల్, క‌ల్చ‌ర్‌, మీడియా, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ (డిసిఎమ్ఎస్) కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పై సంత‌కాల‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

టెలిక‌మ్యూనికేష‌న్స్/ఐసిటి స్ రంగంలో ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌ను, ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డంలో ఈ ఎమ్ఒయు తోడ్పాటు ను అందించనుంది.  బ్రెక్సిట్ అనంత‌ర కాలంలో, భార‌త‌దేశానికి మ‌రిన్ని అవ‌కాశాలను అందించడం, స‌హ‌కార పరిధిని విస్తరించడం ఈ ఎమ్ఒయు ఉద్దేశంగా ఉంది.
 
ఉమ్మడి హితాలు ముడిపడివున్న ఈ కింది రంగాలను ఇరు ప‌క్షాలు సహకారం కోసం గుర్తించాయి:

- టెలిక‌మ్యూనికేష‌న్స్/ఐసిటి విధానం మ‌రియు నియంత్ర‌ణ‌;

- స్పెక్ట్ర‌మ్ నిర్వ‌హ‌ణ‌;

- మొబైల్ రోమింగ్ స‌హా టెలిక‌మ్యూనికేష‌న్ సంధానం;

- టెలిక‌మ్యూనికేష‌న్స్/ ఐసిటి సంబంధిత సాంకేతిక ప్రామాణీక‌ర‌ణలు, పరీక్షలు చేయడం, ధ్రువ‌ప‌త్రాల జారీ;

- వైర్‌లెస్ క‌మ్యూనికేష‌న్స్;

- 5జి, ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్/మెషీన్ టు మెషీన్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, బిగ్ డాటా లు స‌హా టెలి క‌మ్యూనికేష‌న్స్/ ఐసిటి రంగంలో సాంకేతిక‌ప‌ర‌మైన అభివృద్ధి;

- టెలిక‌మ్యూనికేష‌న్ సంబంధిత మౌలిక స‌దుపాయాల భ‌ద్ర‌త, టెలిక‌మ్యూనికేష‌న్ సేవ‌ల ఏర్పాటుకు, టెలిక‌మ్యూనికేష‌న్ సేవ‌ల వినియోగానికి సంబంధించిన భ‌ద్ర‌త‌;

- ఉన్న‌త సాంకేతిక‌ విజ్ఞాన సంబంధిత రంగాల్లో సామ‌ర్ధ్య నిర్మాణంతో పాటు సాధ్య‌మైన చోట్లల్లా నైపుణ్యాన్ని ఇచ్చి, పుచ్చుకోవ‌డం;

- స‌రికొత్త సాంకేతిక‌త‌లను, సరికొత్త సాంకేతికతల ప‌రిశోధ‌న‌లను, అలాగే నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను అభివృద్ధి చేయడంలో సహకరించుకోవడం, వాటి తాలూకు స‌మాచారాన్ని ఒక పక్షానికి రెండో పక్షం వెల్ల‌డించుకోవ‌డం;

- టెలిక‌మ్యూనినేష‌న్స్‌/ఐసిటి రంగంలో సంతకందారు దేశాలు మ‌రియు మూడో ప‌క్షం దేశాల సంయుక్త కృషికి అవ‌కాశాలు ఉన్నాయా అనేది అన్వేషించ‌డం;

- ఉభ‌య ప‌క్షాలు అంగీక‌రించే మేర‌కు టెలిక‌మ్యూనికేష‌న్స్‌/ఐసిటి ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధి వ‌ర్గాల ద్వారా వ్యాపారం, పెట్టుబ‌డి, సాంకేతిక విజ్ఞాన కార్య‌క‌లాపాల‌కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డం; సంద‌ర్శ‌న‌లను, కార్య‌క్ర‌మాలను, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఏర్పాటు చేయ‌డం; అలాగే

- ఈ ఎమ్ఒయు ప‌రిధికి లోబ‌డి ఇరు ప‌క్షాల మ‌ధ్య అంగీకారం కుదిరే మేర‌కు టెలిక‌మ్యూనికేష‌న్స్/ ఐసిటి రంగంలో ఇత‌ర విధాలైన స‌హ‌కారానికి కూడా అవకాశం ఉంటుంది.


***(Release ID: 1670108) Visitor Counter : 200