మంత్రిమండలి

ఆరోగ్యం- మందుల రంగంలో స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఇజ్రాయ‌ల్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 NOV 2020 3:30PM by PIB Hyderabad

ఆరోగ్యం-మందుల రంగంలో స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఇజ్రాయ‌ల్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి (ఎమ్ఒయు కు)  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.    
 
ఈ క్రింద పేర్కొన్న రంగాల‌ లో స‌హ‌కారం ఈ ఎమ్ఒయు ప‌రిధిలోకి వ‌స్తుంది:

i) వైద్యులు, ఇత‌ర ఆరోగ్య రంగ వృత్తి నిపుణుల‌కు శిక్ష‌ణ‌- వారి సేవ‌ల ఆదాన ప్ర‌దానం;

ii) మాన‌వ వ‌న‌రుల వికాసం తో పాటు ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల స్థాప‌న‌లో స‌హాయం;

iii) ఔష‌ధ నిర్మాణ సంబంధి సాధనాలు, చికిత్స ఉప‌క‌ర‌ణాలు, సౌందర్యవర్ధక సాధనాల నియంత్రణకు సంబంధించిన స‌మాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవ‌డం;

iv) జలవాయు సంబంధి అపాయాల నేపథ్యంలో పౌరుల ఆరోగ్యానికి గ‌ల సవాళ్లను అంచ‌నా వేసే, అటువంటి సవాళ్లను అదుపులో పెట్టాలన్న, వాటి పట్ల అనుకూలతను ఏర్పరచాలన్న ఉద్దేశ్యాలతో సార్వజనిక స్వస్థత సంబంధి కార్యక్రమాలను గురించిన నైపుణ్యాన్ని ఒక ప‌క్షానికి రెండో ప‌క్షం వెల్ల‌డించుకోవడం;

v)  జలవాయు సంబంధి మార్పుల‌కు త‌ట్టుకుని నిల‌చే మౌలిక స‌దుపాయాలకు సంబంధించిన నైపుణ్యాన్ని, దానితో పాటే ‘గ్రీన్ హెల్త్ కేర్‌’ ను (విషమ జలవాయు పరివర్తనను తట్టుకొని నిలచే ఆసుపత్రులను) అభివృద్ధి చేసేందుకు సహాయాన్ని అందించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని ఒక దేశానికి రెండో దేశం పంచడం;

vi)  సంబంధం క‌లిగిన వివిధ రంగాల లో పరస్పర ప‌రిశోధ‌న ను ప్రోత్స‌హించ‌డం; 

vii)  ఉభ‌య ప‌క్షాలు నిర్ణ‌యించే మేర‌కు, మ‌రేదైనా రంగంలో కూడాను స‌హ‌క‌రించుకోవ‌డం.

ప్ర‌తి ఒక్క ప‌క్షం రెండో పక్షానికి సంబంధించిన సంస్థల ద్వారా సహకారాన్ని లక్షించే అంశాలపై నిర్వహించే రౌండ్ టేబుల్ స‌మావేశాలు, చ‌ర్చా స‌భ‌లు, స‌ద‌స్సులు, కార్య‌శాల‌లు, స‌మ్మేళనాల్లో తమ దేశాల ప్రతినిధులు పాలు పంచుకొనేట‌ట్లుగా వారిని ప్రోత్స‌హించ‌డం జరుగుతుంది.


***


(Release ID: 1670094) Visitor Counter : 227