ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో అదే తగ్గుదల బాటలో కోవిడ్ బాధితులు

వరుసగా ఆరో రోజు కూడా కోవిడ్ చికిత్సలో ఉన్నది 6 లక్షలలోపే

92% పైబడ్డ కోలుకున్నవారి శాతం

Posted On: 04 NOV 2020 12:47PM by PIB Hyderabad

ఒకవైపు కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటం, మరోవైపు మరణాల సంఖ్య పడిపోవటం  కారణంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వరుసగా ఆరోరోజు కూడా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 6 లక్షలలోపే ఉండిపోయింది. ఈరోజు భారత్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 5,33,787.  మొత్తం దేశమంతటా నమోదైన పాజిటివ్ కేసులలో వీరి వాటా 6.42% మాత్రమే. 16 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి పదిలక్షల జనాభాలో కేసుల సంఖ్య జాతీయ సగటు కంటే  తక్కువగా నమోదైంది.

 

WhatsApp Image 2020-11-04 at 10.22.47 AM.jpeg

కోలుకున్న వారి సంఖ్య 76. 5 లక్షలు దాటి ఇప్పుడు 76,56,478కి చేరింది. దీనివలన చికిత్సలో ఉన్నవారితో పోలుచుకున్నప్పుడు తేడా మరింత పెరిగింది. కోలుకున్నవారి శాతం జాతీయ స్థాయిలో 92 శాతం దాటి ప్రస్తుతం 92.09% అయింది.   గడిచిన 24 గంటలలో 53,357మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో ఒకరోజులో కొత్తగా పాజిటివ్ గా  నిర్థారణ అయినవారు  46,253 మంది.

 

WhatsApp Image 2020-11-04 at 10.43.04 AM.jpeg

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే ఎక్కువగా కోలుకున్నారు.

 

WhatsApp Image 2020-11-04 at 10.43.14 AM.jpeg

దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యం కూడా బాగా పెరిగింది. ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు దాదాపుగా 11.3 కోట్లకు చేరాయి ( కచ్చితంగా చెప్పాలంటే 11,29,98,959. గత 24 గంటలలో 12,09,609 పరీక్షలు జరిపారు. 25  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి పది లక్షల మందికి జరిపిన పరీక్షలు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి.

 

WhatsApp Image 2020-11-04 at 10.43.13 AM.jpeg

కొత్త కేసులలో 80% పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమైనట్టు గమనించారు. ఇందులో కేరఖ్ళలో ఒక్కరోజులోనే 8,000 కు పైగా కేసులు నమోదై మొదటిస్థానంలో ఉండగా 7,000 కేసులు దాటిన కర్నాటక రెండో స్థానంలో ఉంది

WhatsApp Image 2020-11-04 at 10.43.03 AM.jpeg

కొత్తగా నమోదైన కేసులలో 76% పది రాష్ట్రాలకు చెందినవే. అందులో గరిష్ఠంగా కేరళ, ఢిల్లీలలో ఆరేసి వేలకు పైగా కేసులు గుర్తించగా ఆ తరువాత ఉన్న మహారాష్ట్రలో 4,000 కేసులు దాటాయి.

WhatsApp Image 2020-11-04 at 10.43.01 AM.jpeg

గడిచిన 24 గంటలలో 514 మరణాలు నమోదయ్యాయి. మృతులలో 80 దాదాపు శాతం మంది పది రాష్ట్రాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  ఒక్క రోజులోనే 120 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ లో మరణాల శాతం 1.49% గా ఉంది.

 

WhatsApp Image 2020-11-04 at 10.43.02 AM.jpeg

ప్రతి పది లక్షల జనాభాలో మరణాల సంఖ్య చూసినప్పుడు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరణాలు జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నాయి.

 
WhatsApp Image 2020-11-04 at 10.43.09 AM.jpeg
***

(Release ID: 1670082) Visitor Counter : 221