పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
దేశంలో సమగ్ర ఇంధన భద్రతా వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు మనం చేస్తున్న కృషిని ఆత్మనిర్భర భారత్ మరింత ముందుకు తీసుకువెళుతుందని చెప్పిన కేంద్ర మంత్రి శ్రీధర్మేంద్ర ప్రధాన్
ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు సంబంధించిన అన్నిరకాల విధానాల అమలుకు కృషి.
దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్నితగ్గించేందు పంచముఖ వ్యూహం
ఏప్రిల్, మే నెలల్లో తక్కువ క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా దేశం 5,000 కోట్ల రూపాయలను ఆదాచేసింది. ప్రస్తుత వ్యూహాత్మక నిల్వలను పూరించడానికి ఇది ఉపకరించింది.
Posted On:
29 SEP 2020 1:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపు ,దేశంలో సమగ్ర ఇంధన భద్రతా వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు మనం చేస్తున్న కృషిని ముందుకు తీసుకుపోతుందని కేంద్ర పెట్రోలియం సహజవాయు, స్టీలు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ ఏర్పాటు చేసిన జిసిటిసి ఇంధన భద్రతా సదస్సు 2020లో కీలకోపన్యాసం చేస్తూ ఆయన, గత ఆరుసంవత్సరాలుగా అద్భుత ఇంధన విధానాలు కొనసాగుతున్నాయని, కోవిడ్ -19 సవాలు ను ఎదుర్కొనేందుకు మార్పు అవసరమన్నారు.
కోవిడ్ -19 అనంతరం , ఇంధన వ్యవస్థ భద్రంగా, పరిశుభ్రంగా, బాధ్యతాయుతంగా, మన ప్రజల అవసరాలను తీర్చేదిగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇండియాలోని ఇంధన కంపెనీలు కోవిడ్ -19 వల్ల చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా వినూత్న ఆవిష్కరణలతో తిరిగి పుంజుకుకోనున్నాయని అయన అన్నారు.
ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని అమలు చేసేందుకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్టు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇంధన అందుబాటు కు సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో, సమర్ధత , సుస్థిరత, భద్రత, చౌకధరలకు లభించడం వంటి వాటిని సాకారం చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. ఇంధనాన్ని వాడే కొన్ని మంత్రిత్వశాఖలు ఇంధన స్వాతంత్య్రాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఇందులో రైల్వేశాఖ 2023 నాటికి రైల్వే మార్గాలను నూరు శాతం విద్యుదీకరించనున్నదని అన్నారు. ఎం.ఎన్.ఆర్.ఇ కింద కిసాన్ ఊర్జా ఏవం ఉత్తం మహాభియాన్ ద్వారా 15 లక్షల సోలార్ పంపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ హైడ్రోజన్ తో కూడిన సిఎన్‌జి ని ప్రత్యామ్నాయ ఇంధనంగా వాడనుంది. కోల్ గాసిఫికేషన్ ప్రాజెక్టులవల్ల పరిశుభ్రమైన బొగ్గుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వేగవంతం కానుంది. షిప్పింగ్ మంత్రిత్వశాఖ గ్రీన్ పోర్ట్ కార్యకలాపాలు చేపట్టనుంది.
ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించేందుకు మనం పంచముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని, ఇందులో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తులను పెంచడం ఉందన్నారు. జీవ ఇంధనాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు, ఇంధన సమర్ధత, రిఫైనరీ ప్రాసెసస్‌లలో మెరుగుదల, డిమాండ్ ప్రత్యామ్నాయం వంటివి ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు.
గతంలో, ఇంధన భద్రతను సంకుచిత దృష్టికోణంలోంచి చూసేవారని, ప్రధానంగా సరఫరా నిర్వహణ దృష్టితో చూసేవారని అన్నారు. మన ప్రభుత్వం ఇంధన భద్రత పరిధిని మరింత విస్తరించి మరింత సమగ్రంగా, భౌగోళిక- రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యవారణ కోణాన్ని జోడించిందని శ్రీ ప్రధాన్ తెలిపారు.భారతదేశపు ఇంధన దౌత్యం, దానితో కూడిన మన విదేశాంగ విధానం గత ఆరు సంవత్సరాలలో చెప్పుకోదగిన ఫలితాలనిచ్చిందని ఆయన అన్నారు. మనం అంతర్జాతీయంగా ఇంధన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న దేశాలతో మన సంబంధాలను విస్తృతం చేసుకున్నామని, ఇందన తయారీ దేశాలైన రష్యా, అమెరికా, సౌదీ అరేబియా, యుఎఇలతో ఒకవైపు,అలాగే జపాన్ , దక్షిణ కొరియా వంటి దేశాలతో మరోవైపు మన సంబంధాలు పటిష్టం చేసుకున్నామన్నారు.
కోవిడ్ -19 ప్రభావం గురించి మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.
ప్రస్తుతం ఉన్న ఇంధన ఫ్రేమ్‌వర్క్‌లు మున్నెన్నడూలేనంతటి పరివర్తనను చూస్తున్నాయని అన్నారు. కోవిడ్ -19 అనంతర ప్రపంచంలో మన వ్యూహాలు రూపొందించుకోవడానికి ప్రస్తుత ఇంధన సవాళ్లను జాగ్రత్తగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు.
ఇంధన వినియోగంలో ఇండియా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. ఇది ఇంధన ప్రభావానికిగురికావడమే కాక, ప్రపంచంలో అంతర్జాతీయ ఇంధన ధోరణులు ఎలా రూపుదిద్దుకుంటాయన్న దానిని కూడా ఇది నిర్వచించ గలుగుతుందన్నారు. మన ఇంధన రంగం ప్రత్యేకించి చమురు, గ్యాస్ రంగం కోవిడ్ -19 ఆరంభ దశలో మే 2020 వరకు ప్రభావితమైంది. జూలై అనంతరం నుంచి మనం తిరిగి కోవిడ్ ముందు కాలం స్థాయికి పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరించగలిగాం అని మంత్రి చెప్పారు. చమురు గ్యాస్ రంగానికి చెందిన పిఎస్‌యులు మాత్రమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 లక్ష కోట్ల రూపాయల సిఎపిఇఎక్స్ వ్యయం చేస్తున్నాయి. ఇతర మంత్రిత్వశాఖలు కూడా ఇలాంటి సిఎపిఇఎక్స్ వ్యయ ప్రాజెక్టులు కలిగి ఉన్నాయి. ఇవి ఉపాధి అవకాశాలను పెంపొందించి ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నాయి. భారత దేశ ఇంధన రంగం కోవిడ్ -19 నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరిగి కోలుకునే ప్రయత్నం చేసింది. చమురు నిల్వలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక కమాడిటీ మార్కెట్ సంక్షోభాలు ఉన్నప్పటికీ పరిస్థితితులను మెరుగు పరచుకోగలిగిందని మంత్రి చెప్పారు.
ఇంధన పేదరికంనుంచి బయటపడడం గురించి మాట్లాడుతూ ప్రధాన్, ప్రపంచ జనాభాలో 16 శాతంపైగా జనాభాతో మనం కేవలం ప్రపంచంలోని 6 శాతం ఇంధనాన్నే వాడుతున్నాం. నమ్మకమైన, మనకు తగిన ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం గురించి ఆయన తెలియజేశారు. తలసరి ఇంధన వినియోగం ఇప్పటికీ ప్రపంచ సగటులో మూడోవంతు ఉంది. ఈ ఇంధన లోటును భర్తీ చేసుకునేందుకు ఇండియా అన్ని రకాల ఇంధన వనరులను అభివృద్ధి చేయడం కొనసాగించాలి. అందులోనూ దీనికి సంబంధించిన సుస్థిరతా కోణం కూడా పట్టించుకోవాలి. ఇండియాలో ఇంధన రంగం స్థితిగతులు మున్నెన్నడూ లేని రీతిగా మారుతున్నాయి. మన ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను అంచనావేస్తున్నది.దేశంలో అంతర్గతంగా ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నదని ఆయన అన్నారు.
ఆర్థిక, ద్రవ్య, రెగ్యులేటరీ, మౌలిక సదుపాయాల విషయంలో , చురుకైన ఇంధన పరివర్తన కోసం ఇండియా అద్భుత సమర్ధతను సాధించిందన్నారు.ప్రపంచ ఆర్థిక ఫోరమ్ గుర్తించిన అంశాలను ప్రస్తావిస్తూ శ్రీ ప్రధాన్, ఇంధన పరివర్తన విషయంలో గత ఆరు సంవత్సరాలలో క్రమబద్ధమైన , కొలవగల ప్రగతి సాధించిన ఎంపిక చేసినదేశాలలో ఇండియా ఉందని అన్నారు.
మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ఎగుమతులకు సంబంధించి ఆయా దేశాలపై గత ఏడాది ఆంక్షలు ఉన్నప్పటికీ మనకు తగినంతగా ముడి చమురు , ద్రవరూప సహజవాయువు సరఫరాలు తగినంతగా ఉన్నాయి.
మన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఆగ్నేయాసియా తో సహా 30కి పైగా దేశాలనుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి.కొత్త దీర్ఘకాలిక కాంట్రాక్టులను మన కంపెనీలు , అమెరికా, రష్యా, అంగోలాలలోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన ఎల్.ఎన్.జి దిగుమతులు సంప్రదాయ సరఫరాదారైన ఖతార్‌నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాలకు విస్తరించడం జరిగిందని మంత్రి తెలిపారు.
. క్రూడ్ ఆయిల్ ధర గురించి మాట్లాడుతూ శ్రీ ప్రధాన్,బాధ్యతాయుతమైన,చవకైన ధరల యంత్రాంగం ఉండాలనిఆయన అన్నారు. జి20 ఇంధన శాఖ మంత్రుల అత్యవసర సమావేశంలోను, ఒపిఇసి, అంతర్జాతీయ ఇంధన ఫోరం వంటి ఇతర అంతర్జాతీయ వేదికలపైనా ఇండియా తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తున్నదని , ఈవిషయంలో మనవిధానానికి మరింత మద్దతు లభిస్తున్నదని ఆయన అన్నారు.
హైడ్రో కార్బన్ల దిగుమతిపై ఆధారపడడాన్నితగ్గించేందుకు వివిధ రంగాలమధ్య సమన్వయానికి , కృషిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏప్రిల్ , మే 2020 నెలలలో తక్కువగా ఉన్నక్రూడ్ ఆయిల్ ధరల సానుకూలతలను అవకాశంగా తీసుకుని మనం ప్రస్తుత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 16 మిలియన్ బ్యారళ్ల క్రూడ్ ఆయిల్ రిజర్వులతో నింపడం జరిగింది.దీనితో ప్రభుత్వానికి 5000 కోట్ల రూపాయలు ఆదా అయిందని మంత్రి తెలిపారు.
హైడ్రో కార్బన్ రంగంలో మరింతగా ఇంధన భద్రతను మెరుగు పరిచేందుకు మనం పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్ధ్యాన్ని మరింత పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో 74 రోజులకు సరిపడా ఉన్న నిల్వల స్థాయిని 90 రోజులకు క్రమంగా పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. చండీకోల్,పాదూర్‌లలో 6.5 ఎం.ఎం.టి క్రూడ్ ఆయిల్ నిల్వ సామర్ద్యం అభివృద్ధికి సంబంధించి తదుపరి వాణిజ్య, వ్యూహాత్మక రిజర్వు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీప్రధాన్ కంపెనీలను ఆహ్వానించారు. “ అమెరికాలోనూ,వాణిజ్యపరంగా సాధ్యమైన ఇతర ప్రాంతాలలోనూ విదేశాలలో క్రూడ్ ఆయిల్‌ను నిల్వచేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం. ” అని ఆయన అన్నారు.
దేశీయంగా చమురు,సహజవాయు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దేశీయంగా విధానపరమైన సంస్కరణలను ఇప్పటికే తీసుకువస్తున్నట్టు ప్రధాన్ తెలిపారు. హైడ్రోకార్బన్ల అన్వేషణలోకాని లేదా లైసెన్సింగ్ విధానలంలో కాని, కనుగొన్న చిన్న క్షేత్రాల విధానంలో కాని,ఓపన్ ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీలో కాని, సంప్రదాయేతర హైడ్రోకార్బన్ల వెలికితీతలోకాని సంస్కరణలు తీసుకువస్తున్నట్టు ఆయనచెప్పారు. తమ దృష్టిని ప్రధానంగా రాబడి ఆర్జించడం నుంచి ఉత్పత్తిని గరిష్ఠంగా పెంచడంపైన, దృష్టిపెట్టినట్టు చెప్పారు. అలాగే క్లిష్టమైన ప్రాంతాల విషయంలో ధరల స్వేచ్ఛతో సహా మార్కెటింగ్ పైన, గత ఏడాది మార్చినుంచి అన్వేషణలపైన అలాగే సిబిఎం గ్యాస్ పైన దృష్టి పెట్టినట్టు చెప్పారు. దేశీయంగా చమురు,గ్యాస్ అన్వేషణను పెంచేందుకు అంతర్జాతీయ చమురు సంస్థలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
సదస్సు ఇతివృత్తమైన ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇంధన భద్రత గురించి మాట్లాడుతూ శ్రీ ప్రధాన్, చమురుపై ఆధారపడడం తగ్గించి ఆత్మనిర్భర్ భారత్‌తో మమేకమై సుస్థిర ఇంధన ప్రగతి సాధించేందుకు మనం బహుముఖ వ్యూహాన్ని చేపట్టినట్టు చెప్పారు. తదుపరి దశం పరివర్తన కింద ఇథనాల్ తో మనం పరివర్తనాత్మక ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.సెకండ్ జనరేషన్ ఇథనాల్, కంప్రెస్‌డ్ బయోగ్యాస్ (సిబిజి) , బయోడీజిల్‌లు దేశం దిగుమతులపై ఆధారపడడాన్నితగ్గిస్తుందన్నారు. 14,000 కో్ట్ల రూపాయల పెట్టుబడితో మురు మార్కెటింగ్ కంపెనీలు 2జి బయో రిఫైనరీలు పన్నెండింటిని నెలకొల్పేదశలో ఉన్నాయని ఆయన తెలిపారు. 2030 నాటికి పెట్రోలులో 20 శాతం ఇథనాల్, డీజిల్‌లో 5 శాతం బయోడీజిల్‌ను మిళితం చేసే లక్ష్యాన్నిసాధించేందుకు ముందుకు సాగుతున్నామని శ్రీ ప్రధాన్ తెలిపారు.
ప్రధాన ఇంధనలో 2030నాటికి గ్యాస్ వాటా 15 శాతానికి పెరిగేలాగా గ్యాస్ రంగ మౌలిక సదుపాయాలను పెంచి , ఫ్రీ గ్యాస్ మార్కెట్‌నుప్రోత్సహించడం ద్వారా గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టినట్టు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
దేశంలో గ్యాస్ మౌలిక సదుపాయాలు విస్తరింప చేసేందుకు ప్రధానమంత్రి దార్శనికత అయిన ఒకదేశం ఒక గ్యాస్‌గ్రిడ్ మార్గదర్శకంగా నిలుస్తున్నదని శ్రీ ప్రధాన్ చెప్పారు. “ గ్యాస్‌మౌలిక సదుపాయాల అభివృద్ధికి 60 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో పైప్ లైన్, సిటీ గ్యాస్ పంపిణీ, ఎల్.ఎన్.జి రీ గ్యాసిఫికేషన్ టెర్మినళ్లు ఉన్నాయి. అద్భుతమైన ,సమర్ధమైన గ్యాస్‌మార్కెట్‌కు,గ్యాస్ ట్రేడింగ్‌కు భారత దేశ తొలి జాతీయస్థాయి గ్యాస్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. ” అని కేంద్ర మంత్రి శ్రీ ప్రధాన్ అన్నారు.
దేశీయ గ్యాస్‌కు అనుబంధంగా పలు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ఈ చర్యలు దేశీయ రంగం అవసరాలు తీరుస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు తోడ్పడుతుందని ఆయనతెలిపారు. ఇందులో ప్రధానంగా సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను పేర్కొన్నారు. ఇది త్వరగా విస్తరింపబడుతోందని చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 70 శాతంపైగా ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. పిఎన్‌జి కనెక్షన్లు 60 లక్షలనుంచి4 కోట్లకు పెరగనున్నాయన్నారు. సిఎన్‌జి స్టేషన్లు 2,200 నుంచి10 వేలకు పెరగనున్నాయి.ఎక్స్‌ప్రెస్ వే లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, మైనింగ్‌ప్రాంతాలలో సుదూర ప్రాంత సరకురవాణాకు రవాణా ఇంధనంగా ఎల్.ఎన్.జి వాడకాన్ని ప్రోత్సహించనున్నారు. సుస్థిరప్రత్యామ్నాయ చౌక రవాణా (ఎస్ ఎ టి ఎట టి)నిప్రారంభించడం జరిగింది. వివిధ రకాల వ్యర్థాలు, బయోమాస్ నుంచి కంప్రెస్ డ్ గ్యాస్‌తయారుచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు దీనిని ఏర్పాటుచేశారు. హామీతో కూడిన సిబిజి ధరలకు సిబిజిసరఫరా చేసేందుకు శక్తిగల సంస్థల నుంచి ఉత్పత్తి, సరఫరా విషయంలో ఆసక్తి వ్యక్తీకరణకు చమురు పిఎస్‌యులు పిలుపునివ్వడం జురిగింది. 2030 నాటికి 5000 సిబిజి ప్లాంటులు ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పటివరకు 578 లెటర్ ఆఫ్ ఇంటరస్ట్‌లు జారీ అయ్యాయి అని ఆయన తెలిపారు.
భారతీయ చమురు, గ్యాస్‌కంపెనీలు పరిశుభ్ర ఇంధన పరివర్తనలో చురుకుగా పాల్గొంటున్నాయని మంత్రి చెప్పారు. అలాగే ఈ కంపెనీలు ఎనర్జీ కంపెనీలుగా పరివర్తన చెందుతున్నాయన్నారు.కార్బన్‌ఫుట్‌ప్రింట్‌ను తగ్గించేందుకు ఈ కంపెనీలు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులపై మరింతగా దృష్టిపెడుతున్నాయన్నారు. ఇవి రెన్యువబుల్స్,బయోఫ్యూయల్స్,హైడ్రోజన్ లపై దృష్టిపెడుతున్నాయన్నారు. ఐదు చుమురు,గ్యాస్ కంపెనీలు కార్పొరేట్ భాగస్వాములుగా సుస్థిర వాతావరణ కార్యాచరణ కు అంతర్జాతీయ సౌర అలయెన్సులో చేరుతున్నట్టు తెలిపారు.
జాతీయస్థాయిలో ఇండియా ఇంధన భద్రతకు తిరుగులేని చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నది. 2022 నాటికి175 జిడబ్ల్యు, 2030 నాటికి 450 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించేందుకు మనదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. భారతదేశ ఇంధన విధానం సంపూర్ణ దృష్టితో పరిశీలించడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్2018లో ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డుతో గౌరవించింది. ఇది కొత్త ఇంధన వనరులను అందుబాటులోకి తేవడంలో దేశ నాయకత్వానికి దక్కిన మరో గుర్తింపు గా చెప్పుకోవచ్చునని శ్రీ ప్రధాన్ అన్నారు.
ఆయిల్ , గ్యాస్ రంగంలో ఓకల్ ఫర్ లోకల్‌ను కార్యరూపంలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించేందుకు ఆయిల్, గ్యాస్‌రంగంలో ప్రొక్యూర్‌మెంట్లను స్థానికంగా సేకరణను పెంచేందుకు ప్రధాన చర్యలు ప్రారంభంచడం జరిగినట్టు మంత్రి చెప్పారు. అంతర్జాతీయ చమురు గ్యాస్‌రంగంలో గ్లోబల్ వాల్యూచెయిన్‌లో ఇండియాను భాగం చేసేందుకు, ఇండియాను తమ ఉత్పత్తి స్థావరంగా చేసుకోవలసిందిగా మనం ఒ.ఇ.ఎంలను ప్రోత్సహిస్తున్నాం. స్టార్టప్‌లకుప్రోత్సాహం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంధన భద్రతకు సంబంధించి మన అణ్వేషణ, నాలుగుఫ్రేమ్‌వర్క్‌ల కిందపనిచేస్తుందని శ్రీప్రధాన్ చెప్పారు. అవి ఆంగ్లంలో నాలుగు ఎ- లుగా తెలిపారు. అవైలబిలిటీ, యాక్ససబిలిటీ, అఫర్డబిలిటీ, యాక్సెప్టబిలిటీ గా ఆయన పేర్కొన్నారు. ఇది ఇంధనాన్ని అన్ని వర్గాలకు అన్నిరంగాలకు అందుబాటు ధరలో లభ్యమయ్యేందుకు వీలు కల్పిస్తుందని శ్రీ ప్రధాన్ తెలిపారు.
****
(Release ID: 1660250)
Visitor Counter : 236
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam