PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 29 OCT 2020 6:07PM by PIB Hyderabad

 (ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)

•           గత 24 గంటల్లో 10,75,760 కోవిడ్ పరీక్షలు; 10.65 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు;

•           పాజిటివ్ కేసుల శాతం తగ్గుముఖం; ఈరోజు 7.54%

•           గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయినవారు 56,480 మంది; కొత్తగా నిర్థారణ అయినవారు 49,881 మంది

•           ఈ రోజుకు చికిత్సలో ఉన్నవారు 6.03.687 మంది

•           ఆరోగ్య సేతు యాప్ మీద కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలకు సంబంధించి ఎంఇఐటివై వివరణ

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

భారత్ లో భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు; గత 9 రోజుల్లో కోటి పరీక్షలు

2020 జనవరి మొదలుకొని భారత్ లో కోవిడ్-19 పరీక్షల సదుపాయాలు పెరుగుతూ వచ్చాయి. దీనివలన పరీక్షల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగింది. రోజుకు 15 లక్షల శాంపిల్స్ పరీక్షించగలిగే సామర్థ్యం భారత్ సమకూర్చుకుంది. గడిచిన 24 గంటలలో 10,75,760 పరీక్షలు జరగగా  పరీక్షల సామర్థ్యం అనేక రెట్లు పెరగటంవలన ఇప్పటివరకు జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షలు 10.65 కోట్లకు ( 10,65,63,440) కి చేరాయి. గత ఆరు వారాల్లో సగటున రోజుకు 11 లక్షల వంతున పరీక్షలు జరుగుతూ వస్తున్నాయి. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా తగ్గుతూ ఈ రోజు 7.54 శాతానికి చేరింది. గత 9 రోజుల్లో కోటి కరోనా పరీక్షలు జరిగాయి. ఈ రోజు చికిత్సలో ఉన్నవారు 6,03,687 మంది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరు 7.51%. ఒకవైపు చికిత్సపొందుతున్నవారు తగ్గుతూ ఉంటే మరో వైపు కోలుకున్నవారు  పెరుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా కోలుకున్నవారు  73,15,989 మంది. కోలుకున్నవారికీ, చికిత్స పొందుతూ ఉన్నవారికీ మధ్య అంతరం పెరుగుతూ 67 లక్షలు దాటి ఈ రోజు 67,12,302 గా నమోదైంది. గత 24 గంటలలో 56,480 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  అదే సమయంలో దేశవ్యాప్తంగా 49,881 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులలో  79% మంది 10 రాష్ట్రాలలోనే ఉన్నారు.  అత్యధిక సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ లు నమోదవుతున్న రాష్టాల్లో కేరళ ఇప్పుడు 8 వేలకు పైగా కేసులతో ముందు వరుసలో సాగుతూ ఉంది.    రెండో స్థానంలో ఉన్న మహారాష్టలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 517 మరణాలు నమోదయ్యాయి. అందులో  81% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 91 మంది చనిపోయారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668451

 

తమిళనాడులో కోవిడ్ సంసిద్ధతను, కోవిడ్ కు తగిన ప్రవర్తన అమలును సమీక్షించిన డాక్టర్ హర్ష వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ్స సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధ నిన్న వీడియో కన్ఫరెన్స్ ద్వారా తమిళనాడు లో కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ మీద పోరాటంలో భాగంగా ప్రజల ప్రవర్తన అమలును సమీక్షించారు.  తమిళనాడు వైద్య,  విద్యాశాఖామంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉంటూ నడుచుకోవాల్సిన తీరుతెన్నులమీద ప్రజా ఉద్యమానికి ప్రధాని ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు.  మాస్కుల వాడకం, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం పాటించటం విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని రాష్ట్రాన్ని కోరారు. ఈ పండుగ సీజన్ లో పరిస్థితి మరింత మెరుగుపడాలని కోరారు. ఇదే రకమైన అప్రమత్తత కనీసం మరో మూడు నెలలు అవసరమన్నారు. ప్రధాని సందేశం ఆకరిపౌరుడి దాకా చేరేట్టు చూడాలన్నారు.  జాతీయ స్థాయిలో కోవిడ్ సమాచారాన్ని తమిళనాడు సమాచారంతో పోలుస్తూ, జాతీయ సగటు కంటే ఎక్ల్కువగా తమిళనాట కోలుకుంటున్నవారి శాతం 94.6% గా నమోదైందన్నారు.మరణాలు 1.54% కాగా ఇది దాదాపుగా జాతీయ స్థాయి అంకెలతో సమానంగా ఉందన్నారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668260

పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళలో కోవిడ్ పరిస్థితిని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఆ రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు, ఇతర సీనియర్ వైద్యాధికారులు పాల్గొన్నారు. కెసుల్;ఉ పెరుగుతున్న రాష్టాల పరిస్థితి పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ లాంటి ముందు జాగ్రత్తలు మరింత సమర్థంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668445

 

బహుళ మార్గ ఇంధన మార్పిడిలో భారత్ తో భాగస్వామ్యానికి అంతర్జాతీయ చమురు, గ్యాస్, ఇతర ఇంధన సంస్థలకు స్వాగతం పలికిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

భారత్ లో అన్ని రకాల ఇంధన ఉత్పత్తిలోనూ భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పరిశ్రమను, నిపుణులను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.డియా ఎనర్జీ ఫోరమ్ వారి సి ఇ ఆర్ ఎ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో నిన్న సాయంత్రం ఆయన ప్రసంగించారు. గౌరవ ప్రధాని ఇండియా ఎనర్కీ ఫోరమ్ ను  ప్రారంభించటంలోనే భారత్ ఇంధన భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోందన్నారు.  కోవిడ్ సంక్షోభ సమయంలో యావత్ ప్రపంచం మీద ఇంధన రంగం ప్రతికూల ప్రభావం చూపుతున్న సమయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రధాని ముందు చూపువలన తాము కూడా తగిన చర్యలు తీసుకుంటూ  కోవిడ్ అనంతర కాలంలో భారత ఆర్థిక రంగానికి చోదకశక్తి లాంటి ఇంధన రంగాన్ని ముందుకు నడిపిస్తున్నామన్నారు. ప్రపంచం ఇప్పుడు కోవిడ్ కారణంగా ముందెన్నడూ ఎరగనంతగా ఆర్థికాభివృద్ధికి అవరోధాలు ఎదుర్కుంటున్నదన్నారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668419

ఆరోగ్య సేతు యాప్ మీద కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలమీద ఎం ఇ ఐ టి వై వివరణ

ఆరోగ్య సేతు యాప్ విషయమై వచ్చిన ఒక ప్రశ్న మీద కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల గురించి మీడియాలో వచ్చిన వార్తలగురించి తెలిసిందే.  అయితే, ఆరోగ్య సేతు యాప్ విషయంలోను, కోవిడ్ నియంత్రణలో దాని పాత్ర విషయంలోను ఎలాంటి అనుమానాలకూ తావులేదు. 2020 ఏప్రిల్ 2 నాటి పత్రికాప్రకటనలు, సోషల్ మీడియా పొస్టుల ద్వారా ఈ యాప్ గురించి చెప్పాం. కోవిడ్ మీద పోరాటానికి దేశప్రజలను దగ్గరికి చేర్చే క్రమంలో భారత ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ యాప్ ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించారు లాక్ దౌన్ నిబంధనలకు స్పందించే క్రమంలో 21 రోజుల రికార్డు సమయంలో దీని రూపకల్పన జరిగింది. వ్యాధి సోకిన వారి ఆనవాలు పట్టుకోవటం దీని లక్ష్యం. రేయింబవళ్ళు పనిచేసిన ఉన్నతస్థాయి మేధావుల, పరిశ్రమ నిపుణుల, ప్రభుత్వ కృషి దీని వెనుక ఉంది. ఏప్రిల్ 2 న దీనికి సంబంధించిన మీడియా ప్రకటన వెలువరించగా మే 26న దీన్ని బహిరంగంగా అందుబాటులోకి తెచ్చారు. ఆవిష్కరించినప్పుడే ఈ కృషిలో పాల్గొన్నవారి వివరాలన్నీ తెలియజేశాం.మీడియాలో కూడా ఆ విషయం విస్తృతంగా ప్రచారమైంది. ముందే చెప్పినట్టు ఇది ప్రభుత్వ, ప్రైవేటు ఉమ్మడి కృషి. ఈ యాప్ ను 16.23 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ మీద పోరుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఎప్పటికప్పుడు దీని వాడకందారులను అప్రమత్తం చేసింది. ఆ విధంగా ఆరోగ్య సేతు యాప్  భారత్ జరిపిన కోవిడ్ పోరులో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్ చొరవను అభినందించింది.

 మ‌రిన్ని వివ‌రాల‌కు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668194

ఔషధాల, వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించేలా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (పిఎల్ ఐ) పథకాల మార్గదర్శకాలలో మార్పులు

రసాయనాలు,  ఎరువుల మంత్రిత్వశాఖలోని ఔషధాల విభాగం స్వదేశీ ఔషధాల, వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించేలా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (పిఎల్ ఐ) పథకాల మార్గదర్శకాలలో మార్పులు చేసింది. పరిశ్రమ నుంచి అందిన సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే కనీస పెట్టుబడి నిబంధన స్థానంలో  ఒక్కో ఉతొపత్తికీ ఒక్కో రకంగా ఉండే టెక్నాలజీ అందుబాటు దృష్ట్యా ’ ఆమోదించిన పెట్టుబడి ’ ని లెక్కలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పెట్టే పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం అందుబాటులో ఉండే వ్యవధిని కూడా మరో ఏడాది పొడిగించారు.  అదే విధంగా 2021-22 బదులుగా   2022-23 నుంచి ఐదేళ్ళపాటు అమ్మకాలమీద ఈ రాయితీలు వర్తించేలా సడలింపులు చేశారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668678

యుకె-ఇండియా ఆర్థిక చర్చలకు భారత్ బృందానికి నాయకత్వం వహించిన ఆర్థికశాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్

మంత్రిత్వస్థాయిలో నిన్న  వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన యుకె-ఇండియా 10 వ విడత ఆర్థిక చర్చలకు భారత్ బృందానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహించారు. వివిధ రంగాలలో భారత్కు మ్ యుకె కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఉమ్మడిగా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలలో టాప్ 7 లో స్థానం  సంపాదించటమే కాకుండా ఉమ్మడి స్థూల జాతీయోత్పత్తి 5 ట్రిలియక్ డాలర్లకు పైబడింది. 2007 తరువాత ఇది రెట్టింపైంది. ద్వైపాక్షిక పెట్టుబడుల ద్వారా సహకరించుకుంటీ 50 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించగలిగాయి.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668343

కోచ్ కి కోవిడ్ సోకినట్టు తేలటంతో జర్మనీలో సార్ లా లక్స్ ఓపెన్  పోటీనుంచి తప్పుకున్న  బాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యా సేన్

భారత పురుషుల బాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యా సేన్ జర్మనీలో జరుగుతున్న  సార్ లా లక్స్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. అతడి కోచ్  డికె సేన్ కి కరోనా సోకినట్టు తేలటమే అందుకు కారణం.ఈ పోటీ కోసం డిఫెండింగ్ చాంపియన్ అయిన సేన్ తన కోచ్. ఫిజియో థెరపిస్ట్ తో బాటు అక్టోబర్ 25న అక్కడికి చేరుకున్నారు. అయితే ఫ్రాంక్ ఫర్ట్ లో ముందుగా కోవిడ్ ప్రీక్ష చేయించుకోవలసిందిగా నిర్వాహకులు కోరటంతో పరీక్షల అనంతరం 27న ఫలితాలు వచ్చాయి.   లక్ష్యా సేన్, అతడి ఫిజియో ఇదరికీ నెగటివ్ రాగా కోచ్ కి మాత్రం పాజిటివ్ అని తేలింది. దీంతో ఇఅత్ర ఆటగాళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని టోర్నమెంట్ కు ఎలాంటి అంతరాయమూ కలగకుండా సేన్ పోతీ నుమ్చి తప్పుకున్నారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668284   

 

కరోనామీద ప్రపంచపు తొలి సైన్స్ కార్టూన్ పుస్తకం “ బై బై కరోనా “ ను ఆవిష్కరించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్

మనుషులకు ఆసక్తికరంగా తెలియజెప్పటానికి ఉపయోగపడే సాధనం కార్టూన్. సైన్స్ అంశాలను కార్టూన్ రూపంలో వివరించే పద్ధతిని సైన్టూన్ అంటున్నారు.  సైన్సును సులభంగా అర్థమయ్యేట్టు సామాన్య ప్రజలకు కూడా వివరించటానికి దీన్నొక సాధనంగా వాడుకుంటున్నారు.  కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా సైన్టూన్ పుస్తకం బై బై కరోనా రూపుదిద్దుకుంది. సైంటూనిస్ట్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ దీని రూపకర్త. గతంలో ఆయన లక్నో లోని కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. ఈ పుస్తకాన్ని లక్నో లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఆనందీబెన్ ఈ రోజు ఆవిష్కరించారు. శాస్త్రమ్ సామ్కేతిక విభాగంలోని స్వతంత్ర ప్త్రతిపత్తిగల విజ్ఞాన్ ప్రసార్ సంస్థ దీన్ని ప్రచురించింది.

మ‌రిన్ని వివ‌రాల‌కు :  https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668450

 

 

               పిఐబి క్షేత్రస్థాయి అధికారుల సమాచారం

•           పంజాబ్: మధుమేహం, రక్తపోటు బాధితులకు మరింత అవగాహన పెంచేందుకు, నివారణ చర్యలు చేపట్టేందుకు ఆహారం, వ్యాయామం గురించి పంజాబ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక కరదీపికను రూపొందించింది. దీన్ని 15 రోజుల్లోగా ఈ వ్యాధులతో బాధపడేవారికి ఎ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలద్వారా పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది.  చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల మ్సంఖ్య రాష్ట్రంలో బాగా తగ్గిపోయి పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఈ పండుగ సీజన్ లో మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ లాంటి నియమావళి తప్పనిసరిగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆక్కడి డాక్టర్లను ఆదేశించింది.

•           హిమాచల్ ప్రదేశ్: రాష్ట్ర విద్యా శాఖామంత్రి నిన్న ప్రాధమిక, ఉన్నత పాఠశాల, వృత్తివిద్యా కోర్సులకోసం మూడు వేరు వేరు చానల్స్ ను జియో టీవీలో ప్రారంభించారు.  దీంతీ విద్యార్థులకు ఆన్ లైన్ చదువులు మరింత దగ్గరవుతాయన్నారు.  కరోనా సంక్షోభం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు వాట్సాప్ ద్వారా హర్ ఘర్ పాఠశాల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అదే విధంగా సిమ్లా దూర దర్శన్ ద్వారా .జ్ఞాన సాల కార్యక్రమం  కూడా 10 నుంచి 12 తరగతులకోసం నిర్వహిస్తున్నారు.  

•           అరుణాచల్ ప్రదేశ్:  రాష్ట్రంలో కోలుకుంటున్న కోవిద్ బాధితుల శాతం 85కు పైగా నమోదైంది.  గత 24 గంటల్లో 184 మంది కోలుకోగా 108 కొత్త కేసులు నమోదయ్యాయి. 

•           అస్సాం: గత 24 గంటల్లో అస్సాంలో 26150 పరీక్షలు జరపగా  448 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కెసుల సంఖ్య 205237 కు చేరింది.

•           మేఘాలయ: రాష్ట్రంలో ఈరోజు 134 మంది కోవిడ్ నుంచి కొకోలుకున్నారు. చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 3843 కు చేరుకోగా వారిలో బి ఎస్ ఎఫ్ , సాయుధ దళాలకు చెందినవారు

•           నాగాలాండ్: నాగాలాండ్ లోని  8824 కోవిడ్ కేసులలో ,సాయుధ దళాలవారు3843 మంది ఉన్నారు. కొత్తగా సోకే అవకాశమున్నవారిని 2906 మందిని గుర్తించారు, కోలుకున్నవారు  1642  మందికాగా చికిత్స అందిస్తున్నవారు 433 మంది ఉన్నారు. 

•           మహారాష్ట్ర: రద్దీ ఉండని సమయాల్లో లోకల్ రైళ్ళు నడపాలని కోరుతూ మహారాష్ట్ర  ప్రభుత్వం రైల్వే అధికారులకు లేఖ రాసిన మీదట పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే అధికారులు సుముఖత చూపారు. అయితే సామాజిక దూరం పాటించాలని కోరారు.  ముంబయ్ లో నిన్న 1,354 కొత్త కేసులు నమోదు కాగా ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య  19,357.

•           గుజరాత్:  రాష్ట్రంలో తొలి కరోనావైరస్ కేసు నమోదై ఏడు నెలలలు పైగా గడిచింది.ప్పుడు మొత్తం కెసుల సంఖ్య 1.7 లక్షలు దాటింది.. కొత్తగా 980 కేసులు రాగా మొత్తం సంఖ్య1,70,334 కు చేరింది.. ఆరుగురు మరణించగా  మొత్తం మరణాలు 3,729 కి చేరాయి. .

•           మధ్యప్రదేశ్:  కరోనా దృష్ట్యా 80 ఏళ్ళు పైబడినవారు, దివ్యాంగులు కరోనా బాధితులు ఇంటినుంచే పోస్టల్ బాలెట్ ద్వారా వోటు వేయటానికి ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఇప్పుడు ఎన్నికలు  జరుగుతున్న 28 రాష్ట్రాలకు దీన్ని వర్తింపజేస్తున్నారు.   ఈ సౌకర్యం నవంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.  మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 10,094 మంది..

•           కేరళ: టాటా గ్రూప్ వారు కేరళలోని కాసర్ గడ్ లో టాటా గ్రూప్ నిర్మించిన 551 పడకల ఆస్పత్రి కార్యకలాపాలు ప్రారంభించింది.  పూర్తి స్థాయిలో పనిచేయటానికి మరో మూడు నెలలు పడుతుందని భావిస్తున్నారు. దీనికి రూ. 60 కోట్లు ఖర్చయింది. ఇలా ఉండగా, అక్కడ మూడు జిల్లాల్లోనే 1000 కి పైగా కేసులు నమోదై పరిస్థితి తీవ్రంగా ఉంది.  మొత్తం కేసులు నిన్నటిక 93,264 కు చేరాయి. ,మరో 8,790 మందికి పాజిటివ్ అని తేలింది.  కోవిడ్ మరణాలు రాష్ట్రంలో 1400-దాటాయి.

•           తమిళనాడు:  పండుగ సీజ దృష్ట్యా కోవిడ్ పట్ల అవగాహన కల్పించటానికి ప్రధాని పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమంలో భాగంగా  తమిళనాడు ముఖ్యమంత్రి ఏడప్పాడి కె పళనిస్వామి  ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 33 వాహనాలను ప్రారంభించారు.. కరోనా వలన విద్యా రంగం తీవ్రం<గా ప్రభావితమైనట్టు బుధవారం  విడుదలచేసిన వార్షిక విద్యా నివేదిక స్పష్టం చేసింది.కనీసం పావు వంతు మంది విద్యార్థులకు ఎలాంటి విద్యా అందలేదని సర్వేలో తేలి?ది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఈ-పాస్ లు అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.  

•           కర్నాటక:: పాఠశాలలు అన్ లైన్ నియమాలను ఉల్లంఘింస్తే సహించేది లేదని కర్నాటక విద్యాశాఖామంత్రి సురేశ్ కుమార్ హెచ్చరించారు.  రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని  ఉల్లంఘిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. నాలుగు శాసనమండలి స్థానాలకు కోవిడ్  సంక్షోభం మధ్య జరిగిన తొలి ఎన్నికలో వోటర్లు గత ఎన్నికలకంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. డిగ్రీ, పిజి కాలేజీలు నవంబర్ 17 న ప్రారంభించటానికి కర్నాటక పట్టుదలతో ఉంది

•           ఆంధ్రప్రదేశ్: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపటానికి పరిస్థితులు అనుకూలమ్గా లేవని రాష్ట ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్. రమేష కుమార్ కి తెలియజేసింది. అయితే, ఎన్నిక అధికారి మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు జరపటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సహానీ ఆయనను కలిసి రాష్ట్రంలో కోవిడ్ వాతావరణం అనుకూలంగా లేదని చెప్పారు.  ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ బారిన పడ్దారని చెప్పారు. రాష్ట్రంలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య  27,000 కు తగ్గగా గురువారం నాడు 77,028  పరీక్షలు జరిపినప్పుడు కొత్తగా 2,949 కేసులు నమోదయ్యాయి. 3,609 మంది తాజాగా కోలుకున్నారు..

•           తెలంగాణ: గత 24 గంటల్లో 1504 కొత్త కేసులు, 1436 కోలుకున్న కేసులు,  5 మరణాలు నమోదయ్యాయి.  24 hours; అందులో   288 కొత్త కేసులు హైదరాబాద్ లొ నమోదయ్యాయి.  మొత్తం కేసులు : 2,35,656; చికిత్సలో ఉన్నవారు: 17,979; మరణాలు: 1324; కోలుకున్నవారు: 2,16,353 మంది.  రష్యా వారి కోవిడ్ వాక్సిన 2021 రొడో త్రైమ్నాసికంలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.  డాక్టర్ రెడ్డీ లాబ్స్ సీఈవో ఎరజ్ ఇజ్రాయిలి మాటల ప్రకారం భారత్ లో మూడో దశ అధ్యయనం త్వరలోనే పూర్తవుతాయి గనుక మార్చి తరువాత వాక్సిన్ అందుబాటులోకి రావచ్చు.

FACT CHECK

 

 

Image

****



(Release ID: 1668714) Visitor Counter : 189