పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

భారతదేశ ఇంధనరంగంతో కలసి పనిచేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతర్జాతీయ ఆయిల్, గ్యాస్ కంపెనీలను ఆహ్వానించారు.

Posted On: 29 OCT 2020 10:37AM by PIB Hyderabad

భారతదేశంలోని అన్నిరకాల ఇంధన ఉత్పత్తిని పెంచడం ద్వారా భారతదేశ పురోగతిలో భాగంగా కావాలని కేంద్ర పెట్రోలియం,  సహజ వాయువు,  ఉక్కుశాఖల మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్  అంతర్జాతీయ పరిశ్రమలను,  నిపుణులను ఆహ్వానించారు. నిన్న జరిగిన సెరా వీక్ ఇండియా ఎనర్జీ ఫోరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌‌–19 మహమ్మారి అంతర్జాతీయ ఇంధన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన భద్రతను పెంచి ఈ రంగాన్ని మరింత సమర్థంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తున్నదని అన్నారు.    ప్రధాని  నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించడం తమకు ఎంతో గర్వకారణమని ప్రధాన్ అన్నారు. ఇంధనరంగ భద్రత మార్గదర్శక ప్రణాళిక గురించి వివరిస్తూ ఏడు ముఖ్యమైన చోదకాలను ప్రస్తావించారని అన్నారు.  గ్రామ స్థాయిలో సార్వత్రిక విద్యుదీకరణ చేయడం, ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన వంట ఇంధనం సరఫరా చేయడం,  దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల సరఫరా చేయడం వల్ల ఇంధనం భారీగా ఆదా చేస్తూ మన దేశం సాధిస్తున్న విజయాలను ప్రధాని ప్రస్తావించారని గుర్తుచేశారు.   తద్వారా దేశంలో ఇంధన పేదరికాన్ని గణనీయంగా తగ్గిస్తామనే తమ వాగ్దానం నెరవేరుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని తొలిరోజు సీఈఓలు / నిపుణులు, ప్రపంచంలోని ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల నాయకులను, సీఈఓలను, నిపుణులతో చర్చించి భారతదేశంలో ఇంధన రంగంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారని ప్రధాన్ తెలిపారు.  భారతీయులందరికీ స్వచ్ఛమైన, సరసమైన ధరల్లో  స్థిరమైన పునరుత్పాదక ఇంధనాన్ని  సమానంగా అందజేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానాలను ప్రధాని వివరించారు. భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలను తీసుకువచ్చిందని మోదీ స్పష్టం చేశారు. ఇంధనరంగంలో స్వావలంబన సాధించడం ద్వారా మనదేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత శక్తిని ఇస్తుందని వివరించారు.  ఇటీవలి కాలంలో భారత చమురు,  గ్యాస్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించిందని  ప్రధాన్ అన్నారు. ఇలాంటి కష్టకాలంలోనూ మారుమూల ప్రాంతాలకు కూడా స్వచ్ఛమైన వంట ఇంధనం సరఫరా చేయడం ద్వారా ప్రశంనీయ విజయాలను సాధించిందని అన్నారు. "భారతీయ చమురు,  గ్యాస్ పరిశ్రమ నాయకులు తమ అనుభవాలను అందించడమే కాక, ఈ ఫోరం నుండి కొత్త ఆలోచనలను తీసుకుంటారని నేను నమ్ముతున్నాను" అని ఆయన చెప్పారు.

  ప్రధానమంత్రి  దూరదృష్టి నాయకత్వంలో, కోవిడ్ అనంతర కాలంలోనూ  ఇంధన రంగం భారతదేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇవ్వడానికిఅవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభంతో ఇబ్బందిపడుతోందని, కోవిడ్ మహమ్మారి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తోందని అన్నారు. "అంతర్జాతీయ ఇంధన రంగ సరఫరా గొలుసులకు కోవిడ్ వల్ల కలిగిన అంతరాయాల ప్రభావాన్ని మేము అంచనా వేశాం. భారతదేశ ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా మా విధానాన్ని మార్చాల్సి ఉంటుంది’’ అని  ప్రధాన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్ని తమ అభిప్రాయాలను వెల్లడించిన సౌదీ అరేబియా ఇంధన మంత్రి హెచ్.ఆర్.హెచ్. ప్రిన్స్ అబ్దుల్ అజీజ్,  అమెరికా ఇంధనశాఖమంత్రి హెచ్.ఇ. డాన్ బ్రాలెట్కు ప్రధాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి  పియూష్ గోయల్ను కూడా అభినందించారు.

 

అంతర్జాతీయ చమురు  గ్యాస్ కంపెనీలకు చెందిన 40 మంది సీఈఓలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన భారతీయ కంపెనీ సీఈఓలో ఈ ఫోరమ్లో పాల్గొని మనదేశంలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలు, సూచనలు ఇచ్చారు. పరిశ్రమల నాయకులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశ ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా ఉన్నందున, మరింత స్థిరమైన ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో భారతదేశానికి ప్రత్యేక పాత్ర ఉందని పేర్కొన్నారు.

 సెరా వీక్ ఇండియా ఎనర్జీ ఫోరాన్ని 2017లో మొదలుపెట్టింది. ఇది వార్షిక కార్యక్రమంగా మారింది. భారతదేశ ఇంధన రంగంలో అవకాశాలు,  సవాళ్ళపై  చర్చించడానికి ప్రపంచ ఇంధన నాయకులను, నిపుణులను భారతదేశానికి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇండియా ఎనర్జీ ఫోరం నాలుగో సమావేశం.. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ద్వారా నిరంతరాయంగా కొనసాగించేలా అంకితభావంతో పనిచేసిన ఐహెచ్ఎస్ మార్కిట్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డేనియల్ యెర్గిన్,  ఆయన బృందాన్ని మంత్రి ప్రశంసించారు. డాక్టర్ యెర్గిన్ రాసిన “ది న్యూ మ్యాప్” పుస్తకాన్ని మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన్ ఆవిష్కరించారు. 

****


(Release ID: 1668419) Visitor Counter : 186