యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కోచ్‌కు కొవిడ్‌ సోకడంతో సార్‌లార్‌లక్స్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌

Posted On: 28 OCT 2020 9:39PM by PIB Hyderabad

జర్మనీలో జరుగుతున్న  సార్‌లార్‌లక్స్‌ ఓపెన్‌ నుంచి భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లక్ష్యసేన్‌ వైదొలిగారు. కోచ్‌ డి.కె.సేన్‌కు కొవిడ్‌ సోకడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లక్ష్యసేన్‌, అతని కోచ్‌, ఫిజియో ఈనెల 25న సార్‌బ్రూకెన్‌ చేరుకున్నారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లాలని అధికారులు వారికి సూచించారు. 27న ఫలితాలు వచ్చాయి. సేన్‌కు, ఫిజియో నెగిటివ్‌గా తేలగా, కోచ్‌కు మాత్రం కరోనా సోకినట్లు వెల్లడైంది. 

    టోర్నమెంటుకు, ఇతర ఆటగాళ్లకు ఇబ్బంది కలగకుండా టోర్నీ నుంచి సేన్‌ తప్పుకున్నారు. తన నిర్ణయాన్ని అధికారులకు తెలియపరిచారు. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యే తేదీని ఖరారు చేయడానికి, మరోమారు పరీక్షలు చేయించుకోవాలని వారికి అధికారులు సూచించారు.

    సార్‌లార్‌లక్స్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, పీటర్‌ గేడ్‌ అకాడమీలో 15 రోజుల శిక్షణకు, సేన్‌ బృందానికి 'టాప్స్‌' ద్వారా నిధులు అందాయి.

***



(Release ID: 1668284) Visitor Counter : 131