ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు
గత 9 రోజుల్లో కోటి పరీక్షలు
గత ఆరు వారాల్లో సగటున రోజుకు 11 లక్షల పరీక్షలు
పరీక్షలు పెరిగేకొద్దీ తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసుల శాతం
Posted On:
29 OCT 2020 1:38PM by PIB Hyderabad
2020 జనవరి మొదలుకొని భారత్ లో కోవిడ్-19 పరీక్షల సదుపాయాలు పెరుగుతూ వచ్చాయి. దీనివలన పరీక్షల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగింది. రోజుకు 15 లక్షల శాంపిల్స్ పరీక్షించగలిగే సామర్థ్యం భారత్ సమకూర్చుకుంది. గడిచిన 24 గంటలలో 10,75,760 పరీక్షలు జరగగా పరీక్షల సామర్థ్యం అనేక రెట్లు పెరగటంవలన ఇప్పటివరకు జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షలు 10.65 కోట్లకు ( 10,65,63,440) కి చేరాయి. గత ఆరు వారాల్లో సగటున రోజుకు 11 లక్షల వంతున పరీక్షలు జరుగుతూ వస్తున్నాయి.

ఆధారాలను బట్టి చూస్తే, పరీక్షలను విస్తృతం చేసేకొద్దీ పాజిటి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అలా భారీగా తగ్గటం చూస్తుంటే కరోనాను సమర్థంగా నియంత్రించ గలుగుతున్నట్టు స్పష్టమవుతోంది. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా తగ్గుతూ ఈ రోజు 7.54 శాతానికి చేరింది.

ఇలా గత మూడు వారాల్లో పాజిటివ్ కెసులు తగ్గుతున్న ధోరణి చూస్తుంటే అది పెరిగిన పరీక్షల సదుపాయాలకు నిదర్శనంగా మారింది.

గత 9 రోజుల్లో కోటి కరోనా పరీక్షలు జరిగాయి. రోజువారీ పాజిటివ్ కేసుల శాతం ప్రస్తుతం 4.64%.

చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు చికిత్సలో ఉన్నవారు 6,03,687 మంది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరు 7.51%. ఒకవైపు చికిత్సపొందుతున్నవారు తగ్గుతూ ఉంటే మరో వైపు కోలుకున్నవారు పెరుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా కోలుకున్నవారు 73 లక్షలు దాటారు. కచ్చితంగా చెప్పాలంటే 73,15,989 మంది. కోలుకున్నవారికీ, చికిత్స పొందుతూ ఉన్నవారికీ మధ్య అంతరం పెరుగుతూ 67 లక్షలు దాటి ఈ రోజు 67,12,302 గా నమోదైంది. కోలుకున్నవారు పెరిగే కొద్దీ, ఈ అంతరం మరింత పెరుగుతోంది.

గత 24 గంటలలో 56,480 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 49,881 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులలో 79% మంది 10 రాష్ట్రాలలోనే ఉన్నారు. అత్యధిక సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ లు నమోదవుతున్న రాష్టాల్లో కేరళ ఇప్పుడు 8 వేలకు పైగా కేసులతో ముందు వరుసలో సాగుతూ ఉంది. రెండో స్థానంలో ఉన్న మహారాష్టలో 6 వేలకు పైగా కెసులు నమోదయ్యాయి.

గత 24 గంటలలో 517 మరణాలు నమోదయ్యాయి. అందులో 81% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 91 మంది మృతిచెందారు.

****
(Release ID: 1668451)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada