రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎక్కువ పరిమాణంలో మందుల తయారీ, వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి

ఆధారంగా అందించే ప్రోత్సాహకాల నిబంధనలలో మార్పులు

కనీస పెట్టుబడి నిబంధన స్థానంలో ఏమేరకు పెట్టుబడి నిబంధన

ఉత్పత్తికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞాన అవసరాలకు అనుగుణంగా నిర్ణయం

2020 నవంబర్ 30 వరకు ఔత్సాహిక పెట్టుబడిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

Posted On: 29 OCT 2020 12:48PM by PIB Hyderabad

దేశంలో మందులు, వైద్యపరికరాల తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తి ఆధారంగా అందించే ప్రోత్సాహకాల (పిఎల్ఐ) నిబంధనలలో కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ,రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖలు మార్పులు తీసుకునివచ్చాయి. పరిశ్రమ వర్గాల నుంచి అందిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వస్తువుల ఉత్పత్తిలోఉపయోగించవలసి ఉన్న వివిధ సాంకేతిక పరిజ్ఞానాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఇకపై కనీస పెట్టుబడి అంశాన్ని కాకుండా ఏ మేరకు పెట్టుబడి పెట్టగలరన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఇదివరకు ఉత్పత్తి ఆధారంగా అందించే ప్రోత్సాహకాల అంశంలో ఔషధ మంత్రిత్వశాఖ రెండు పథకాలను సిద్ధం చేసింది. ఔషధపరిశ్రమలో ఉపయోగించే ప్రధాన వస్తువులు,కొంతవరకు తయారైన మందులు, పూర్తిగా తయారయ్యే మందుల ఉత్పత్తికి ఒక పిఎల్ఐని వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు మరో పిఎల్ఐని రూపొందించడం జరిగింది. ఈ రెండు పథకాలకు 2020 మార్చి 20వ తేదిన సమావేశం అయినా కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా 2020 జూలై 27వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

మార్గదర్శకాలు విడుదల అయిన తరువాత పథకంలో మార్పులు చేయాలని కోరుతూ మందుల తయారీ , వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు అందాయి.వీటివల్ల పథకం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఈ వర్గాలు తెలిపాయి. వీటిని పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాటు అయిన సాంకేతిక కమిటీలు పరిశీలించాయి. పరిశీలన తరువాత సాంకేతిక కమిటీలు అందించిన నివేదికలను నీతి ఆయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. సాంకేతిక కమిటీలు సూచించిన మార్పులను ఆమోదించిన కమిటీ మార్గదర్శకాలలో మార్పులు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనితో మార్గదర్శకాలకు మార్పులు చేయడం జరిగింది. మార్పులు చేసిన నూతన మార్గదర్శకాలను ఈ రోజు అంటే 2020 అక్టోబర్ 29వ తేదీన " పథకం" టాబ్ కింద ఔషధ శాఖ వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.

ఔషధపరిశ్రమలో ఉపయోగించే ప్రధాన వస్తువులు,కొంతవరకు తయారైన మందులు, పూర్తిగా తయారయ్యే మందుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అమలు చేసే ఉత్పత్తి ఆధారంగా అందించే ప్రోత్సాహకాల (పిఎల్ఐ) లో ముఖ్యమైన మార్పులు ఈ విధంగా ఉంటాయి. ఎంపిక అయిన ధరఖాస్తుదారుని ఎంపిక కోసం కనీస పెట్టుబడి అంశాన్ని కాకుండా ఏ మేరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అయ్యారు అన్న అంశాన్ని పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది. ఉత్పత్తిని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళడానికి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించవలసి ఉన్నందున ఈ మార్గదర్శకాల వల్ల ఉత్పాదక పెట్టుబడిని సమర్ధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రోత్సాహకాల కోసం పెట్టుబడిదారుడు పెట్టిన వాస్తవ పెట్టుబడిని పరిశీలించడానికి ప్రవేశపెట్టిన నిబంధన కొనసాగుతుంది.

ప్రోత్సాహకాలను పొందడానికి ఉత్పత్తులను దేశ మార్కెట్ లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగించడం వల్ల మార్కెట్ ను విస్తరించడానికి అవకాశం కలగడమే కాకుండా ఈ పథకం కూడా ఇతర పిఎల్ఐ ల తరహాలో అమలులోకి వస్తుంది.

టెట్రాసైక్లిన్,నేయోమైసిన్ పారా ఎమినో ఫెనోల్ ,మేరోపేనేం , ఆర్టేసినాతె, లోసర్దన్,తెల్మిసర్దన్, అసైక్లోవిర్, సిప్రోఫ్లోక్ససిన్ మరియు ఆస్ప్రిన్ మందుల వార్షిక తయారీలో మార్పులు తీసుకుని రావడం జరిగింది. ఈ మందులను నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే ప్రోత్సాహకాలను పొందడానికి అర్హత కలుగుతుంది. పధకం కింద దరఖాస్తులను స్వీకరించే గడువును 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.

ఇదేవిధంగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అమలు చేసే ఉత్పత్తి ఆధారంగా అందించే ప్రోత్సాహకాల (పిఎల్ఐ) లో ముఖ్యమైన మార్పులు ఈ విధంగా ఉంటాయి. ఎంపిక అయిన ధరఖాస్తుదారుని ఎంపిక కోసం కనీస పెట్టుబడి అంశాన్ని కాకుండా ఏ మేరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అయ్యారు అన్న అంశాన్ని పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది. ఉత్పత్తిని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళడానికి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించవలసి ఉన్నందున ఈ మార్గదర్శకాల వల్ల ఉత్పాదక పెట్టుబడిని సమర్ధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రోత్సాహకాల కోసం పెట్టుబడిదారుడు పెట్టిన వాస్తవ పెట్టుబడిని పరిశీలించడానికి ప్రవేశపెట్టిన నిబంధన కొనసాగుతుంది. ఊహించిన గిరాకీ, వాస్తవ అమ్మకాలు, మార్కెట్ అభివృద్ధి , సాంకేతిక అంశాలలో వచ్చే మార్పుల అంశంలో కూడా మార్పులను తీసుకుని రావడం జరిగింది.

2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెట్టే పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు.. ప్రోత్సాహకాలను అందించడానికి 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి కాకుండా 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి అయిదు సంవత్సరాల అమ్మకాలను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది. పధకం కింద దరఖాస్తులను స్వీకరించే గడువును 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.
ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఔషధ పరిశ్రమగా భారత ఔషధ పరిశ్రమ గుర్తింపు పొందింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు, విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు ఈ పరిశ్రమ తనవంతు సహకారాన్ని అందిస్తున్నది. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అంకుర దశలో వుంది. ఇది వేగంగా అభివృద్ధి చెంది విస్తరించడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉంది. వైద్య పరికరాల ఉత్పత్తి , ఔషధ పరిశ్రమ రంగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది.

***

 


(Release ID: 1668678) Visitor Counter : 222