PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
28 OCT 2020 6:20PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)
#Unite2FightCorona
#IndiaFightsCorona
- భారత్ లో ప్రతి పది లక్షల్లో కోవిడ్ సోకినవారు, మృతుల సంఖ్య అత్యల్పంగా కొనసాగుతోంది.
- గడిచిన 24 గంటలలో 10,66,78 పరీక్షలతో 10.5 కోట్లకు పైబడ్డ మొత్తం పరీక్షలు
- గత 24 గంటలలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 43,893, కోలుకున్న కేసులు 58,439
- దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 6,10,803 కాగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు అందులో 7.64%
- 6 లక్షలు దాటిన టెలీ మెడిసిన్, ఈ –సంజీవని సంప్రదింపులు
- ప్రపంచమంతటా సమానంగా, అందుబాటు ధరల్లో కోవిడ్ వాక్సిన్ సరిపడేంత అందాలని పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్
భారత్ లో ప్రతి పది లక్షల్లో కోవిడ్ సోకినవారు, మృతులు అత్యల్పం; పరీక్షల్లో అత్యధికం
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మీద సాగించిన పోరు ఫలితాలు భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ పాజిటివ్ కేసులు, అతి తక్కువ మరణాల జాబితాలో మెరుగ్గా నిలబెట్టింది. అంతర్జాతీయంగా ప్రతి పదిలక్షల జనాభాలో 5,552 మందికి కోవిడ్ సోకగా భారతదేశంలో అది 5,790 గా నమోదైంది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు భారత్ లో 87 కాగా ప్రపంచ సగటు 148. మొత్తం జరిపిన పరీక్షల విషయానికొస్తే, భారత్ ముందువరుసలో ఉంది. గత 24 గంటల్లో 10,66,786 పరీక్షలు జరపగా ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు 10.5 కోట్లు పైబడ్డాయి (10,54,87,680 కు చేరాయి). ప్రస్తుతం మరణాల శాతం 1.50% గా నమోదైంది. చికిత్సపొందుతూ ఉన్నవారి శాతం కూడా తగ్గుతూ ప్రస్తుతం 7.64% కి పరిమితమైంది. ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారు 6,10,803 మంది మాత్రమే. మొత్తం కోలుకున్నవారు 72,59,509 మంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కేసులు నమోదుకాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కోలుకున్న కేసులు 58,439. కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కాగా అందులో మహారాష్ట, కర్నాటక, కేరళ ఒక్క రోజులోనే ఏడేసి వేలకు పైగా కేసులు నమోదు చేసుకున్నాయి. కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో 79% కేసులు కేవలం 10 రాష్టాలలోనే నమోదయ్యాయి. ఈ విషయంలో కేరళ రాష్టం మహారాష్ట్రను దాటిపోయింది. ఈ రెండు రాష్టాలలోను ఐదేసి వేలకు మించి కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఇంకా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా ఉన్నాయి. గడిచిన 24 గంటలలో 508 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో పది రాష్ట్రాలలోనే 79% మరణాలు సంభవించగా అందులో మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 115 మంది మరణించారు. .
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668089
6 లక్షలు పూర్తి చేసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి టెలీమెడిసిన్, ఈ-సంజీవని సంప్రదింపులు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన టెలీ మెడిసిన్ కార్యక్రమం విజయవంతంగా 6 లక్షల సంప్రదింపులు నమొదు చేసుకుంది. చివరి లక్ష సంప్రదింపులకు కేవలం 15 రోజులే పట్టింది. ప్రధానమంత్రి ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపు లక్ష్యానికి బాసటగా నిలుస్తూ ఈ-సంజీవని వేదిక వైద్యులకు ఎంతగా ఉపయోగపడగలదో నిరూపించుకున్నట్టయింది. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్య పరమైన సలహా సంప్రదింపులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు, కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు రోజుకు 12 గంటలపాటు ప్రతి రోజూ ఈ-సంజీవని ఔట్ పేషెంట్ విభాగాన్ని నిర్వహించాయి అటు రోగులకు, ఇటు డాక్టర్లకు ఈ-సంజీవని ఎంతగానో ఉపయోగపడుతూ క్రమంగా మరింత ఆదరణ పొందుతున్నదనటానికి నిదర్శనంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. 217 కేంద్రాలలో ఉన్న 6000 మంది డాక్టర్లు దీని ద్వారా లబ్ధిపొందారు. .
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668115
ప్రపంచమంతటా సమానంగా, అందుబాటు ధరల్లో కోవిడ్ వాక్సిన్ సరిపడేంత అందాలని పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్
ప్రపంచమంతటా సమానంగా, అందరికీ అందుబాటు ధరల్లో కోవిడ్ వాక్సిన్ సరిపడేంత అందేలా చూడాలని అంతర్జాతీయ సమాజానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన డబ్ల్యు టి వో మంత్రుల సదస్సులో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఈ మందులు అందుకోవటంలో తక్కువ తయారీ వనరులున్న దేశాలు ఎదుర్కునే సవాలుకు పరిష్కారంగా ట్రిప్స్ రద్దుచేయాలని భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదించాయన్నారు. ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని, అప్పుడే ఎంసి2 మీద నిర్ణయం తీసుకోవటం సాధ్యమవుతుందని సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ సంక్షోభం కారణంగా అంతర్లీనంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక, వర్తక వ్యవస్థల్లోని అసమానతలు, బలహీనతలు బైటపడ్డాయన్నారు. ప్రస్తుతం ఎదురైన సవాళ్ళను ఎదుర్కోవటం తక్షణ కర్తవ్యమన్నారు. అదే సమయంలో దీర్ఘ కాల ప్రణాళిక రూపొందించుకొని ఈ అసమానతలు సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలని చెప్పారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668049
నిఘా, అవినీతి నిరోధం మీద జాతీయ సదస్సును ఆవిష్కరించిన ప్రధాని
ప్రధానమంత్రి ఈ రోజు నిఘా, అవినీతి నిరోధం మీద జాతీయ సదస్సును ఆవిష్కరించారు. సతర్క్ భారత్ – సమృద్ధ్ భారత్ ( అప్రమత్త భారత్, సుసంపన్న భారత్ ) ప్రధాన అంశంగా నిన్న జరిగిన ఈ సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమైక్య భారత నిర్మాత, దేశ పరిపాలనావ్యవస్థ రూపకర్తగా సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ని అభివర్ణించారు. తొలి భారత హోమ్ మంత్రిగా ఆయన ఈ దేశపు సామాన్య మానవునికి కూడా ఉపయోగకరంగా సమగ్రతకోసం పనిచేసే విధానాలతో కూడిన వ్యవస్థను నిర్మించారన్నారు. అయితే, ఆ తరువాత కొన్ని దశాబ్దాలపాటు భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని, వేలకోట్ల స్కామ్ లకు దారితీసిందని, డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయని, పన్ను వేధింపులు, పన్ను ఎగవేతలు సాగాయని అన్నారు. పాలనావ్యవస్థ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని హితవు చెప్పారు. దీనికి ప్రధాన శత్రువు అవినీతి మాత్రమేనన్నారు. అవినీతి ఒకవైపు అభివృద్ధి నిరోధకమని, మరోవైపి సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తుందని, వ్యవస్థ పట్ల మ్ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతిని నిర్మూలించటమన్నది ఉమ్మడి బాధ్యత అని గుర్తు చేశారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668049
నిఘా, అవినీతి నిరోధం మీద జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగ పాఠం:
మరిన్ని వివరాలకు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667904
జీవవైద్య వ్యర్థాల నిర్వహణకు దీర్ఘకాల పరిష్కారపు అవసరాన్ని నొక్కి చెప్పిన డాక్టర్ హర్ష వర్ధన్
కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య, పర్యావరణ రంగాలమీద పెరుగుతున్న వత్తిడిని తగ్గించేందుకు జీవవైద్య వ్యర్థాల నిర్వహణకు దీర్ఘకాల పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరముందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన, భూగర్భ శాస్త్రాల శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. ఇటీవలి వెబినార్ లో ఆయన పంపిన ప్రసంగపాఠాన్ని చదివారు. ఇండియా వాటర్ ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం సంయుక్తంగా “ కోవిడ్ సంక్షోభం మధ్య ద్రవరూప వ్యర్థాల నిర్వహణ భవిష్యత్తు: జరగాల్సిందేమిటి?” అనే అంశం మీద జరిపిన ఈ వెబినార్ కు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, త్రాగునీటి శుద్ధి విభాగం, జల శక్తి మంత్రిత్వశాఖ సహకారం అందజేశాయి. ద్రవరూప వ్యర్థాలు, జీవవైద్య వ్యర్థాల నిర్వహన భవిష్యత్తు మీద ఈ వెబినార్ ప్రధానంగా దృష్టి సారించింది.
మరిన్ని వివరాలకు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668143
పిఐబి క్షేత్రస్థాయి అధికారుల సమాచారం
కేరళ: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కంపుటరైజ్డ్ ఆటోమేషన్ పద్ధతుల సాయంతో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల, కళాశాలల పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చి వేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అక్కడి ప్రభుత్వానికి సూచించింది. లోపరహితంగా పరీక్షల మూల్యాంకనం చేయటానికి, ఫలితాల ప్రకటనను వేగవంతం చేయటానికి యంత్రాలు వినియోగించుకోవటం మేలని మండలి అభిప్రాయపడింది. ఏడు నెలలక్రితం మూతపడ్ద బార్లు కేరళలో వచ్చేవారం పునఃప్రారంభం కాబోతున్నాయి. అవి కోవిడ్ నిబంధనలౌ కచ్చితంగా పాటించేలా చూసే బాధ్యతను ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో నిన్న 5457 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసులు 4 లక్షలు దాటాయి.
తమిళనాడు: మే నెల తరువాత మొదటి సారిగా మంగళవారం నాడు చెన్నై లో కోవిడ్ కేసులు 700 లోపు నమోదయ్యాయి. 695 మంది పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గడిచిన నాలుగురోజుల్లో రెండో సారి సున్నా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది నియామకాల మీద నిషేధాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది.. సంబంధిత విభాగాలు ఇక స్టాఫ్ కమిటీ ఆమోదం పొందనక్కర్లేదని ఆ జీవోలో పేర్కొంది.కోయంబత్తూర్ లో కోవిడ్ పాజిటివ్ శాతం 6.2 శాతానికి తగ్గగా, మరణాల శాత< 1.28% శాతానికి దిగివచ్చింది. గత నెలలో 2.1% ఉండగా అక్కడ నిర్వహించిన జ్వర శిబిరాలవల్లనే ఇది సాధ్యమైందంటున్నారు.
కర్నాటక: ప్రజలు మాస్కులు ధరించేలా చూడటానికి మరింత కఠిన చర్యలు తీసుకునేదిశలో బృహన్ బెంగళూరు మహానగర పాలిక (బిబి ఎంపి) వార్డు, జోనల్, డివిజనల్, హెడ్డాఫీస్ స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేసింది. వరుసగా రెండో రోజు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షలు పండుగ కారణంగా తగ్గాయి. పోషకాహార నిపుణులు, ఉద్యమకారులు, న్యాయవాదులతో కూడిన ఒక బృందం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేషన్ కిట్స్ ఇవాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం అందజేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో నాలుగు శాసనమందలి స్థానాలకు వోటింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఆన్ లైన్ సర్టిఫికేట్ కోర్సుకు విద్యార్థులనుంచి విశేషమైన స్పందన వచ్చింది. దేశవిదేశాలకు చెందిన 414 మంది విద్యార్థులు ఇప్పటిదాకా ఆన్ లైన్ కోర్సుల పట్ల ఆసక్తి కనబరచారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 5 మొదలుకొని మే 17 వరకు ఈ విశ్వవిద్యాలయం సంస్కృతం యోగా అంశాలలో 19 రకాల కోర్సులు నిర్వహించింది. ఆంధ్రా-తెలంగాణ మధ్య బస్సు సర్వీసులలో అనిశ్చితి తొలగించేందుకు మంగళవారం నాడు రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా అధికారులు జరప తలపెట్టిన సమావేశం రద్దయింది. దీంతోఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ: గత 24 గంటల్లో 1481 కొత్తకేసులు, 1451 మంది కోలుకున్నవారు 4 మరణాలు నమోదయ్యాయి. 1481 కేసులలో 279 కేసులు జిహెచ్ ఎం సి పరిధిలోనివి. మొత్తం కేసులు 2,34,152; చికిత్సలో ఉన్నవి: 17,916 ;మరణాలు: 1319; కోలుకున్నవారు: 2,14,917 నమొదు కాగా కోలుకున్నవారి శాతం 91.78 చేరింది. రాష్ట్రం ఏర్పాటు మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రూ. 27,718 కోట్ల పంట రుణాలు రద్దు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రప్రభుత్వం రైతు బంధు పథకం కింద మరో 28 వేలకోట్లు వెచ్చించింది.దీనివలన రైతులు నేరుగా లబ్ధిపొందారు.
మహారాష్ట్ర: ముంబయ్ నగరంలో మొత్తం 24 పాలనాపరమైన వార్డులలో కోవిడ్ కేసులు రెట్టింపు కావటానికి పట్టే సమయం 100 రోజులు దాటింది. అయితే మొత్తం ముంబయ్ నగరంలో మాత్రం కోవిడ్ కేసులు రెట్టింపు కావటానికి పట్టిన సమయ< 139 రోజులుగా నమోదైంది. బాధితుల సంఖ్య తగ్గుదల బాటలో నడవటానికి ముంబయ్ నగరపాలక సంస్థ చేస్తున్న కృషి సానుకూల ఫలితాలనిచ్చింది. ముంబయ్ తో బాటు మిగిలిన మహారాష్ట్ర అంతటా కోవిడ్ పరిస్థితి తగ్గుముఖం పట్టి అదుపులోనికి వస్తోంది. మంగళవారం నాడు 7,836 మంది కోలుకోగా 5,363 కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రంలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1.31 లక్షలకు తగ్గింది.
గుజరాత్ : గుజరాత్ లో గడిచిన 24 గంటలలో 992 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వరుసగా మూడు రోజులుగా 1000 లోపు కొత్త కేసులు ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా చికిత్సలో ఉన్న కేసులు 13,487 కాగా ఆందులో 64 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు.. నిన్న ఐదుగురు కోవిడ్ బాధితులు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,698 కు చేరింది.
రాజస్థాన్: నవంబర్ 2 నుంచి దశలవారీగా పాఠశాలలు పునఃప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి దశలో పాఠశాలల పెద్ద తరగతులు ప్రారంభమవుతాయి. ప్రామాణిక నిర్వహణావిధానాలు సవివరంగా రూపొందించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలు అందులో చేర్చారు. ప్ర్ థమిక తరగతుల విద్యార్థులకు రోజుమార్చి రోజు తరగతులు నడిపే అంశం పరిశీలనలో ఉంది. రాజస్థాన్ లో మంగళవారం నాడు 1,796 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పుడు చికిత్సలో ఉన్నవారు 15,949 మంది.
మధ్య ప్రదేశ్: మంగళవారం 514 కేసులు నిర్థారణ కాగా మూడు నెలల్లో మొదటి సారిగా మధ్య ప్రదేశ్ లో 600 లోపు కేసులు నమోదైనట్టయింది ఒక్క ఇండోర్ లోనే 112 కొత్త కేసులు రాగా జబల్పూర్ లో 46 కేసులు వచ్చాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న వారి సంఖ్య 10,353 కు చేరింది.
చత్తీస్ గఢ్: ఆగస్టు తొలినాళ్లవరకూ కోవిడ్ వలన పెద్దగా ప్రభావితం కాని చత్తీస్ గఢ్ లో ఇప్పుడు ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆగస్ట్ తరువాత కేసులు విజృంభించాయి. ఇంకా తగ్గుదల బాట పట్టలేదు. రాష్ట్రంలో మంగళవారం నాడు 2,046 కొత్త కేసులు రాగా, కోలుకున్నవారి సంఖ్య 287 గా నమోదైంది. చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 21,693.
గోవా: నవంబర్ 1 నుంచి కోవిడ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ కాసినోలు పునఃప్రారంభించాలని గోవా కాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో తీరప్రాంతంలో 6, జనావాసాలమధ్య 12 కాసినోలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి లో కోవిడ్ కారణంగా అవి మూతపడ్దాయి. అవి ఇప్పుడు కేవలం సగం సామర్థ్యంతోనే నడవాలని, హోం శాఖ విధించిన అన్ని కోవిడ్ జాగ్రత్తలూ పాటించాలని నిబంధన విధించారు. .
అస్సాం: అస్సాంలో నిన్న 403 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2443 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం కేసుల సంఖ్య 204789 కి చేరగా కోలుకున్నవారి సంఖ్య 191027 కి చేరింది. ఇంకా చికిత్సలో 12845 మంది ఉండగా 914 మరణాలు నమోదయ్యాయి.
మణిపూర్: మణిపూర్ లో మరో 6 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 150 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోలుకున్నవారి శాతం 75 కు చేరింది.
మేఘాలయ: మేఘాలయలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 1411 కాగా ఇప్పటివరకు కోలుకున్న కేసులు 7643.
మిజోరం: మిజోరంలో నిన్న 80 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2607కి చేరాయి. రాష్ట్రంలో నేడు మొదటి కోవిడ్ మరణం నమోదైంది.
నాగాలాండ్: కోవిడ్ మృతుల సంఖ్య 1% లోపు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో నాగాలాండ్ కూడా ఉన్నట్టు నిన్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది.
FACT CHECK
******
(Release ID: 1668268)
Visitor Counter : 240