ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో ప్రతి పది లక్షల్లో కోవిడ్ సోకినవారు,
మృతులు అత్యల్పం; పరీక్షల్లో అత్యధికం
Posted On:
28 OCT 2020 12:02PM by PIB Hyderabad
వ్యూహం మీద దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ కోవిడ్ మీద సాగించిన పోరు ఫలితాలు భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ పాజిటివ్ కేసులు, అతి తక్కువ మరణాల జాబితాలో మెరుగ్గా నిలబెట్టింది. అంతర్జాతీయంగా ప్రతి పదిలక్షల జనాభాలో 5,552 మందికి కోవిడ్ సోకగా భారతదేశంలో అది 5,790 గా నమోదైంది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమొదు చేసుకున్నాయి.
ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు భారత్ లో 87 కాగా ప్రపంచ సగటు 148. కొన్ని నెలలుగా భారత్ లో అనుసరిస్తున్న ప్రామణిక చికిత్సావిధానాల కారణంగా కోవిడ్ ను సమర్థంగా అదుపుచేసి మరణాలను తగ్గించటం సాధ్యమైంది.
మొత్తం జరిపిన పరీక్షల విషయానికొస్తే, భారత్ ముందువరుసలో ఉంది. గత 24 గంటల్లో 10,66,786 పరీక్షలు జరపగా ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు 10.5 కోట్లు పైబడ్డాయి (10,54,87,680 కు చేరాయి). ఎప్పటికప్పుడు సమగ్రంగా పరీక్షలు చేపట్టటం, సకాలంలో చికిత్స అందించటం వలన సరైన సమయంలో బాధితులను గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించటం సాధ్యమైంది. దీనివలన కోలుకున్నవారు పెరగటంతోబాటు మరణాలు పరిమితంగా నమోదయ్యాయి. ప్రస్తుతం మరణాల శాతం 1.50% గా నమోదైంది. చికిత్సపొందుతూ ఉన్నవారి శాతం కూడా తగ్గుతూ ప్రస్తుతం 7.64% కి పరిమితమైంది. ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారు 6,10,803 మంది మాత్రమే. మొత్తం కోలుకున్నవారు 72,59,509 మంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కేసులు నమోదుకాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కోలుకున్న కేసులు 58,439. కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కాగా అందులో మహారాష్ట, కర్నాటక, కేరళ ఒక్క రోజులోనే ఏడేసి వేలకు పైగా కేసులు నమోదు చేసుకున్నాయి.
కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో 79% కేసులు కేవలం 10 రాష్టాలలోనే నమోదయ్యాయి. ఈ విషయంలో కేరళ రాష్టం మహారాష్ట్రను దాటిపోయింది. ఈ రెండు రాష్టాలలోను ఐదేసి వేలకు మించి కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఇంకా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా ఉన్నాయి.
గడిచిన 24 గంటలలో 508 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో పది రాష్ట్రాలలోనే 79% మరణాలు సంభవించగా అందులో మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 115 మంది మరణించారు. .
****
(Release ID: 1668089)
Visitor Counter : 207
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada