ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలిమెడిసిన్ సేవ, ఈ-సంజీవని, 6 లక్షల టెలికాన్సల్టేషన్లను పూర్తి చేసింది
15 రోజుల్లో చివరి 1 లక్ష సంప్రదింపులు నిర్వహించారు
ఈ-సంజీవనిలో రోజుకు 8500 కి పైగా సంప్రదింపులు నమోదు అయ్యాయి
Posted On:
28 OCT 2020 12:40PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలిమెడిసిన్ కార్యక్రమం ఈ-సంజీవని 6 లక్షల టెలికన్సల్టేషన్లను పూర్తిచేసింది. చివరి లక్ష సంప్రదింపులు పూర్తి చేయడానికి 15 రోజులు మాత్రమే పట్టింది. ప్రధానమంత్రి 'డిజిటల్ ఇండియా' చొరవకు పెద్ద ఊతం ఇచ్చేలా, ఈ-సంజీవని డిజిటల్ ప్లాట్‌ఫాం దాని ప్రయోజనం, సంరక్షకులకూ, వైద్య సమాజానికి, కోవిడ్ కాలంలో ఆరోగ్య సేవలను కోరుకునేవారికి సులువుగా అందుబాటులో ఉంటుందని నిరూపించింది. . తమిళనాడు, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు రోజుకు 12 గంటలు, వారానికి 7 రోజులు ఈ-సంజీవని ఒపిడి నడుపుతున్నాయి. రోగులు, వైద్యులతో ఈ-సంజీవని క్రమంగా మమేకం అవుతుంది అనడానికి ఇదే తార్కాణం
దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు / యుటిలలో ప్రజలకు సంజీవని అందుబాటులో ఉంది. 217 ఆన్‌లైన్ ఓపిడీలను, ఇన్‌పేషెంట్ అయిన వారికి 6000 మంది పైగా వైద్యుల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫాం ఈ-హెల్త్ సేవలను అందిస్తుంది. చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక ఆరోగ్య సేవలను ఈ-సంజీవని (ఏబి-హెచ్డబ్ల్యూసి) ద్వారా విస్తరిస్తోంది. ఇది 175 కేంద్రాల(జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలలో ఏర్పాటు చేసిన)తో అనుసంధానించబడిన 4000 ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలలో పనిచేస్తుంది. 20,000 మంది వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు ఈ-సంజీవని రెండు విధాల్లోను ఉన్నారు. ప్రస్తుతం, ఈ-సంజీవని రోజుకు 8500 కి పైగా సంప్రదింపులు నమోదు చేస్తోంది.
దేశవ్యాప్తంగా మొదటి లాక్డౌన్ సమయంలో ఓపీడీ లు మూసివేసినపుడు 2020 ఏప్రిల్ 13 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఈ-సంజీవని ఓపీడీని ప్రారంభించింది, అయితే 2019 నవంబర్‌లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ-సంజీవని ( ఏబి-హెచ్డబ్ల్యూసి) ను ప్రారంభించింది. భారతదేశ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇది ప్రభుత్వ పరిధిలోని 1,55,000 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలలో డిసెంబర్ 2022 నాటికి ‘హబ్ & స్పోక్’ మోడల్‌లో అమలు చేస్తారు.
ఈ-సంజీవని, ఇసంజీవని ఒపిడి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అత్యధిక సంప్రదింపులు జరిపిన మొదటి పది రాష్ట్రాలు తమిళనాడు (203286), ఉత్తర ప్రదేశ్ (168553), కేరళ (48081), హిమాచల్ ప్రదేశ్ (41607), ఆంధ్రప్రదేశ్ (31749), మధ్యప్రదేశ్ (21580) ), ఉత్తరాఖండ్ (21451), గుజరాత్ (16346), కర్ణాటక (13703), మహారాష్ట్ర (8747). ఈ-సంజీవని వినియోగించుకోడాన్ని పెంచడానికి బలమైన డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ, వనరులను (మానవ మరియు మౌలిక సదుపాయాలు) ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. అభివృద్ధి, అమలు, కార్యకలాపాలు మరియు ఆరోగ్య సిబ్బందికి శిక్షణతో సహా సాంకేతిక సహకారం వంటి ఆమూలాగ్ర సాంకేతిక సేవలను అందించడానికి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సిడిఐసి) మొహాలి శాఖను మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.
ఈ-సంజీవని ద్వారా ఆరోగ్య సేవలు ప్రజలకు కలిగిస్తున్న ప్రయోజనం,సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు ఈ-సంజీవని ఓపీడీ లను వృద్ధాశ్రమాలు, కారాగారాల్లో కూడా వినియోగించాలని రాష్ట్రప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
***
(Release ID: 1668115)
Visitor Counter : 235