ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వరుసగా 2వ రోజు కూడా చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు 7 లక్షలలోపే
70 లక్షలు దాటిన మొత్తం కోలుకున్నవారి సంఖ్య
కోలుకున్నవారిలో 61% మంది 6 రాష్ట్రాలనుంచే
Posted On:
24 OCT 2020 11:36AM by PIB Hyderabad
భారత దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు కూడా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 7 లక్షల లోపే ఉన్నది. ప్రస్తుత సంఖ్య 6,80, 680. దేసవ్యాప్తంగా ఇప్పటిదాకా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 8.71% మాత్రమే ఇంకా చికిత్సలో ఉన్నారు.

చికిత్సలో ఉన్నవారి సంఖ్య ప్రతిరోజూ తగ్గుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సూచించిన పరీక్షించు, ఆనవాలు పట్టు చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహాన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయటం వలన ఇది సాధ్యమైంది. అయితే, చికిత్సలో ఉన్నవారి సంఖ్య ఒక్కొచోట ఒక్కోవిధంగా ఉంది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి మీద పోరు స్థాయి ఒక్కొచోట ఒక్కో రకంగా ఉండటం వలన ఈ తేడా కనబడుతోంది. ఒకరోజు కంటే ఇంకొక రోజు మరింత తగ్గటం కొన్ని వారాలుగా కొనసాగుతూ వస్తోంది.

చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గటానికి తోడుగా కోలుకుంటున్నవారి సంఖ్య అదే పనిగా పెరుగుతూ సాగుతోంది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 70 లక్షలు దాటి 70,16,046 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి 89.78% చేరింది.

మొత్తం కోలుకున్నవారిలో 61% మంది కేవలం 6 రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉన్నారు. అవి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ.

కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నది. గత 24 గంటలలో 67,549 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా అదే సమయంలో కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగినవారి సంఖ్య 53,370.

కొత్తగా కోలుకున్నవారిలో దాదాపు 77% మంది 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమైనట్టు తేలింది. అందులో మహారాష్టలో ఒక్క రోజులోనే 13,000 మంది కోలుకున్నట్టు నమోదైంది.

గత 24 గంటలలో కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులు 53,370 నమోదయ్యాయి. వాటిలో 80% పైగా కేసులు కేవలం 10 రాష్ట్యాలకు చెందినవే కాగా కేరళలో అత్యధికంగా 8,000 కు పైగా కేసులు గుర్తించారు. 7,000 కు పైగా కేసుల నిర్థారణ జరిగిన మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

గడిచిన 24 గంటలలో 650 మరణాలు నమోదయ్యాయి. వారిలో దాదాపు 80% మంది పది రాష్ట్రాలకు చెందినవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 184 మంది మరణించారు.

****
(Release ID: 1667283)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam