PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
22 OCT 2020 6:12PM by PIB Hyderabad

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)
#Unite2FightCorona
#IndiaFightsCorona
* గత మూడురోజులుగా ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసులలో 10 శాతం వద్ద ఉంది.
*గత మూడు రోజులుగా రోజువారీ పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ స్థాయిలోనే ఉంటోంది.
*గత 24 గంటలలో 79,415 మంది పేషెంట్లు కోలుకున్నారు. 55,839 కొత్త కేసులు నమోదయ్యాయి.
* జాతీయ స్థాయి రికవరీ రేటు 89.20 శాతానికి పెరిగింది.
* విదేశీయులు, భారతీయులకు సంబంధించి దేశంలోకి రావడానికి, వెళ్లడానికి మరిన్ని కేటగిరీల వారికి వీసా, పర్యాటక అనుమతులలో దశలవారీగా మరిన్ని సడలింపులు చేసిన ప్రభుత్వం.


పర్యావరణ హిత, డిఎంఇ జ్వలిత, సమర్ధ, అదితిఊర్జా సంచ్ యూనిట్‌ను పూణేలోని సిఎస్ఐఆర్-ఎన్‌సిఎల్ వద్ద ప్రారంభించిన కేంద్ర శాస్త్ర విజ్ఞాన, భూ విజ్ఞాన శాస్త్ర శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర శాస్త్ర విజ్ఞాన, భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్‌హర్షవర్ధన్ నిన్న డిఎంఇ జ్వలిత ఆదితి ఊర్జా సంచ్‌యనిట్‌ను , డిఎంఇ-ఎల్‌పిజి బ్లెండెడ్ ఫ్యూయల్ సిలిండర్లను ప్రారంభించి వాటిని సామాన్య ప్రజలకు . సిఎస్ ఐ ఆర్- ఎన్.సి.ఎల్ ప్రాంగణంలోని ఎస్ ఐఆర్-ఎన్‌సిఎల్ ( నేషనల్ కెమికల్ లేబరెటరీ) క్యాంటీన్ లో ప్రయోగాత్మక ఉపయోగానికి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ బర్నర్ ప్రారంభం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇస్తుందని, సిలిండర్ల తయారీ, గ్యాస్ స్టవ్‌లు, రెగ్యులేటర్లు, గ్యాస్‌హోస్ అన్ని దీశీయమైనవే నని అన్నారు. ఈ తరహా కార్యకలాపాలు డిమాండ్, సరఫరాకు మధ్యగల అంతరాన్నితగ్గిస్తుందని ఆయన అన్నారు. ఇది దేశానికి ఇంధన భద్రతకు హామీ ఇస్తుందని ఆయన అన్నారు. కొత్త బర్నర్‌ను డిఎంఇ , డిఎంఇ- ఎల్‌పిజి బ్లెండెడ్‌మిక్చర్‌లు,ఎల్పిజికంబస్టన్ ల కోసం ఎన్‌సిఎల్ పూర్తిగా డిజైన్ చేసి ఫాబ్రికేట్‌చేసిందన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666646
-------
ప్రపంచ బ్యాంకు - ఐఎంఎఫ్ 2020 వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర ఆరోగ్య కుటుంబ , సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించినిన్న వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ సమావేశ అంశం, అందరికీ మానవ సంక్షేమ మూలధనం ద్వారా దక్షిణాసియా శతాబ్ద వికాసం, కోవిడ్ -19 వాక్సిన్‌పై పెట్టుబడి, ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థల అందుబాటు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇండియా పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ మంత్రి,కోవిడ్ మహమ్మారిపై సమగ్రస్పందన వల్ల ప్రస్తుతం దీనిని అదుపుచేయడానికి వీలైందని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సాధారణ జనజీవితాన్ని ఇబ్బందులకుగురి చేసిందని,భవిష్యత్తు విషయంలో మరింత జాగ్రత్తగాఉండాల్సిన అంశాన్ని బోధించిందని ఆయన అన్నారు. అన్ని వర్గాలు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. మొత్తం సమాజం, మొత్తం ప్రభుత్వం అన్న విధానంతో ముందస్తు,సానుకూల, దశలవారీ స్పందన వంటి చర్యల ద్వారా అంతర్జాతీయ మహమ్మారి అయిన కోవిడ్‌పై ఇండియా పోరాటం సాగిస్తున్నదని అన్నారు. ఇండియాలో కోవిడ్ -19 అదుపు విషయంలో ప్రైవేటు రంగం ఇచ్చిన మద్దతును ఆయన ప్రశంసించారు.
ప్రైవేటు రంగ సామర్ధ్యం, ఆవిష్కరణలు, కోవిడ్ పై పోరాటంలో పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం మున్నెన్నడూ లేని సవాళ్లను ఎ దుర్కొంటుండగా, ఇండియా కోవిడ్ నియంత్రణకు సంబంధించిన ప్రతిరంగంలోనూ ఇండియా ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నది. ఉదాహరణకు ఆరోగ్యసేతు యాప్,ఇతిహాస్, నిఘాకు, ముప్పు క్లస్టర్లను గుర్తించేందుకు సెల్యులార్ ఆధారిత ట్రాకింగ్ టెక్నాలజీ, పరీక్షలకు ఆర్‌టి-పిసిఆర్ యాప్, అడ్మిట్ అయిన పేషెంట్ల కు సంబంధించిన సమాచార నిర్వహణకు సంబంధించిన ఫెసిలిటీ యాప్ ఇవన్నీ సమీకృత కోవిడ్ పోర్టల్‌తో అనుసంధానమై ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియా సన్నద్ధతపైన, అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందుబాటుల ఉంచడంపైన కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి సవివరంగా మాట్లాడారు.
మరిన్ని వివరాలకు :: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666637
వీసా , పర్యాటక ఆంక్షలపై దశలవారీ సడలింపులు
కోవిడ్-19 వల్ల నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత ప్రభుత్వం 2020 ఫిబ్రవరినుంచి అంతర్జాతీయ ప్రయాణికులు దేశంలోకిరావడానికి , బయటకు వెళ్లడాన్ని నియంత్రిస్తూ కొన్నిచర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విదేశీయులు, భారతదేశానికి చెందిన వారు దేశం వెలుపలకు వెళ్లడానికి ,దేశంలోకి రావడానికి పర్యాటక ఆంక్షలకు సంబంధించి దశలవారీ వీసా,పర్యాటక సడలింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓసిఐ, పిఐఒ కార్డు కలిగిన వారందరినీ అనుమతించాలని, అలాగే టూరిస్టు వీసా మినహా ఏ ఇతర అవసరం నిమిత్తం ఆకాశ మార్గంలో, జలమార్గంలో, అధీకృత విమానాశ్రయాలు,నౌకాశ్రయాల ద్వారా ,సీపోర్టు ఇమిగ్రేషన్ చెక్‌పోస్టులద్వారా భారతదేశాన్ని సందర్శించే వారిని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వందేభారత్ మిషన్ కిందనడుపుతున్న విమానాలు, ఎయిర్‌ట్రాన్స్‌పోర్టు బబుల్ ఏర్పాటు, లేదా కేంద్ర పౌరవిమానయాన సంస్థ అనుమతించిన షెడ్యూల్డ్ వాణిజ్యేతర విమానాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అయితే ఈ ప్రయాణాలన్నీ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన క్వారంటైన్, ఇతర ఆరోగ్య,కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666789
-----
నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ 2019-20 ఆర్ధిక సంవత్సరానికి 78 రోజులవేతనంతో సమానమైన ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ (పిఎల్‌బి)
దేశంలోని 11.58 లక్షల మంది రైల్వేకిచెందిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో సమానమైన 2019-20 ఆర్ధిక సంవత్సరానికి బోనస్‌ను మంజూరు చేసింది. ఉత్పాదకతతో కూడిన బోనస్ అంచనా రూ 2081.68 కోట్ల రూపాయలు. 21-101-2020న జరిగినకేంద్ర కేబినెట్ సమావేశంలో 2019-20 సంవత్సరానికి 78 రోజుల వేతనంతో సమానమైన ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ కు సంబంధించి రైల్వే మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇది రైల్వేలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు( ఆర్.పి.ఎప్,ఆర్‌పిఎస్.ఎఫ్ లకు మినహా) వర్తిస్తుంది.
మరిన్నివివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666897
వ్యయ పరిమితులకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు కమిటీని నియమించిన ఇసిఐ
ఓటర్ల సంఖ్యలోపెరుగుదల, కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌లో పెరుగుదల ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలలో అభ్యర్ధుల వ్యయపరిమితి అంశాలను పరిశీలించేందుకు ఎన్నికలకమిషన్ మాజీ ఐఆర్ ఎస్ అధికారి,డిజి (ఇన్వెస్టిగేషన్) శ్రీ హరీష్ కుమార్, సెక్రటరీ నరల్ , డిజి (ఎక్స్పెండీచర్) శ్రీ ఉమేష్‌కుమార్‌లతో ఒక కమిటీని ఎన్నికల కమిషన్ నియమించింది.
కోవిడ్ -19పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చట్ట,న్యాయ మంత్రిత్వశాఖ 19-10-2020న ఎన్నికల నిర్వహణనిబంధనలు 1961 లోని నిబంధన 90కి సవరణలు తీసుకువచ్చి, ప్రస్తుత ఎన్నికల వ్యయపరిమితిని పదిశాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నుంచి ఈ 10 శాతం పెరుగుదల అమలులోకి వస్తుంది. ఎన్నికల వ్యయపరిమితిని చివరి సారిగా 2014లో 28-02-2-14 నాటి నోటిఫికేషన్ ద్వారా సవరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు సంబంధించి 10-10-2018 న జారీ అయిన నోటిఫికేషన్‌ద్వారా సవరించారు. గత ఆరు సంవత్సరాలలో ఓటర్ల సంఖ్య 834 మిలియన్ల నుంచి 910 మిలియన్లకు 2019 నాటికి, ప్రస్తుతం 921 మిలియన్లకు పెరిగింది. దీనికి తోడు, కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ఈ కాలంలో 220నుంచి 2019లో 280కి ప్రస్తుతం 301 కి పెరిగింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666540
దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో శిక్షణా కేంద్రాలకు చేరుకునేందుకు శిక్షణార్ధులకు ప్రయాణ సదుపాయాన్నిఏర్పాటుచేయనున్న స్పోర్ట్స్ అథారిటా ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ)
టోక్యో ఒలింపిక్స్, పారా ఒలంపిక్స్ పై దృష్టితో ,దేశవ్యాప్తంగా గల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎ.ఐ) శిక్షణా కేంద్రాలలో క్రీడా కార్యక్రమాలునవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నెలకొన్నకోవిడ్ -19 పరిస్థితుల నేపథ్యంలో , క్రీడాకారులు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , ఎన్.సిఒఇలు, ఎస్.ఎ.ఐ శిక్షణా కేంద్రాలకుచెందిన క్రీడాకారులకు , శిక్షణకు హాజరుకావలసిన వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
ఈ ఏడాది మార్చిలో ఊహించని రీతిలో ఏర్పడిన కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో , క్రీడాకారులను వారి స్వస్థలాలకు పంపవలసి వచ్చింది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన క్రీడాకారులకు విమాన టిక్కెట్ ఏర్పాటు చేస్తారు.500 కిలోమీటర్ల లోపు ఉంటున్న క్రీడాకారులకు మూడవ తరగతి ఎసి ప్రయాణానికి ఏర్పాటు చేస్తారు. దానికితోడు ఎస్ఎఐ కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడానికి క్రీడాకారులకు బయటి వాతావరణంతో పెద్దగా సంబంధం లేకుండా వారిని సురక్షితంగా ఉంచేందుకు కోచ్‌లందరికీ , సపోర్ట్ సిబ్బందికీ ఎన్‌సిఒఇలు, ఎస్‌టిసిలలోనే వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బందికి ప్రభుత్వం ఖర్చుతోనే వసతి ఏర్పాటు చేస్తారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666635
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ) నూతన ఛైర్మన్‌గా ఆ సంస్థ 317 వ ఎక్జిక్యూటివ్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి (ఇంఛార్జి), సిబ్బంది,ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 317 వ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి దాని కొత్త ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి ఎక్జ్యిక్యూటివ్ సమావేశానికి అనంతరం ఆయన ఒక కీలక ప్రకటనచేస్తూ ఐఐపిఎ జీవిత సభ్యత్వాన్ని 2021 జనవరి 1 నుంచి స్వీకరిస్తారని ప్రకటించారు. ప్రస్తుతం వివిధ విభాగాలలో పనిచేస్తున్న మరింత మంది ఐఐపిఎ లో సభ్యత్వం స్వీకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఐఐపిఎ ఫాకల్టీ , దాని అధికారుల కఠోర శ్రమను ఆయన అభినందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారి చిత్తశుద్ధి, అంకిత భావం స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు. ఐఐపిఎ ఆన్‌లైన్‌తరగతులకు డిజిటల్ క్లాస్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని, పాఠ్యప్రణాళికకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సమయంలో, లాక్‌డౌన్ అనంతర కాలంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులకు ఐఐపిఎ 14 ఆన్‌లైన్‌శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం చిన్న విజయమేమీ కాదని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666640
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాలనుంచి అందిన సమాచారం:
* హిమాచల్ ప్రదేశ్ : కోవిడ్ -19 పై ప్రజలలో సామాజిక అవగాహన పెంపొందించేందుకు సిమ్లా పోలీసులు రూపొంఇంచిన ఒక కటౌట్‌ను రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నిన్న ఆవిష్కరించారు. పోలీసుల చొరవను గవర్నర్ అభినందించారు. కోవిడ్ -19 పై పోరాటంలో ఫ్రంట్‌లైన్ యోధులుగా పోలీసులు అద్బుత సేవలు అందిస్తున్నారన్నారు. కోవిడ్ పై పోరటం ఇంకా ముగిసిపోలేదని ఆయన అన్నారు. అందువల్ల కోవిడ్ కు మందు వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకునే అలవాటు చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం పాటించాలని, బాధ్యతాయు పౌరులుగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కోవిడ్ -19 పై పోరాటానిక ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపులో అందరూ భాగస్వాములు కావాలని శ్రీ దత్తాత్రేయ కోరారు.
* మహారాష్ట్ర : మహరాష్ట్రలో బుధవారం 8,142 కొత్త కేసులు నమోదయ్యాయి. 23,371 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 1.58 లక్షలకు చేరింది. ముంబాయిలో కొత్తగా 1609 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ముంబాయిలో ప్రస్తుతం 19,245 గా ఉంది. కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ అనంతర చికిత్సా కేంద్రాలను ప్రారంభించిన తొలి జిల్లాగా నాగపూర్ నిలిచింది.
*గుజరాత్: గుజరాత్ లో కోవిడ్ రికవరీ రేటు 89.03 శాతానికి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,137 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1180 మంది కోలుకున్నారు. దీనితో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,215 కు చేరింది. ఇందులో 75 మంది వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కొవిడ్ సంబంధిత మరణాలు 3,663 నమోదయ్యాయి.
* రాజస్థాన్ : రాజస్థాన్‌లో గత ఎనిమిదిరోజులలో వరుసగా కోవిడ్ వైరస్ బారిన పడిన వారికంటే ఎక్కువ మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ నుంచి 2,865 మంది కోలుకోగా తాజాగా 1810 మంది కోవిడ్ బారిన పడినట్టు అధికారులు తెలిపారు. గరిష్ఠస్థాయిలో 349 కేసులు జైపూర్‌నుంచి నమోదుకాగా ఆ తర్వాతి స్థానం 303 కేసులతో జోధ్‌పూర్ నిలిచింది. ఆ తర్వాతి స్థానం 178 కొత్త కేసులతో ఆల్వార్ ఉంది.
*ఛత్తీస్‌ఘడ్ : రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితులను ఎదుర్కొనేందుకు గల సదుపాయాలను అంచనా వేసేందుకు ముగ్గురు సభ్యులుగల కేంద్ర బృందం చత్తీస్‌ఘడ్‌లో పర్యటిస్తోంది. ఈ బృందం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజి,ఆస్పత్రి,అలాగే రాయపూర్, దుర్గ్ జిల్లాలలో ఆస్పత్రులు, కో విడ్ సెంటర్లను సందర్శించి ప్రభుత్వ సన్నద్ధతను అంచనా వేసింది.చత్తీస్‌ఘడ్‌లో ఇప్పటివరకు 25,795 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉ న్నాయి.
* కేరళ: కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభంతో తీవ్ర ద్రవ్యలోటు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జరిపిన పరిశీలనలో రాష్ట్ర ద్రవ్యలోటు 112.9 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇది 10,578 కోట్ల ర ఊపాయలు. కేంద్రప్రభుత్వంనుంచి జిఎస్‌టి పరిహారం, ఆర్ధిక సహాయం సత్వరం అందనట్టయితే రాగల రోజులలో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కి వెళుతుందని ఈ అంచనా తెలిపింది. ఇదిలా ఉండగా, స్ప్రింక్లర్ ఒప్పందానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ ఇందులో లోపాలు ఉ న్నట్టు కనుగొనింది. ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.శివశంకర్ ఈ ఒప్పందాన్ని ఖరారుచేయడంలో అనవసర తొందరను ప్రదర్శించారని అభిప్రాయపడింది. కోవిడ్ -19 పేషెంట్ల సమాచారాన్ని స్ప్రింక్లర్ ఐఎన్‌సికి బదలాయించారు.
* తమిళనాడు : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కోవిడ్ మరణాల రేటు 2 శాతాన్ని మించింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. జాతీయ సగటు 1.6 శాతం. చెన్నైలోని మెట్రో స్టేషన్లు, రైళ్లను ఆక్వియస్ స్టెబిలైజ్‌డ్ ఓజోన్ ద్వారా శుభ్రపరుస్తున్నారు. గాఢమైన రసాయనాలనుంచి సిబ్బందిని రక్షించేందుకు దీనిని వాడుతున్నారు. పండగ సీజన్‌లో సులభతర ప్రయాణానికివీలుగా సూపర్‌ఫాస్ట్ రైళ్లను గాంధీదామ్, తిరునల్వేలి మధ్య మడ్‌గాన్, ఎర్నాకుళం జంక్షన్, తిరువనంతపురం సెంట్రల్, నాగర్‌కోయిల్‌టౌన్, లమీదుగా నడపనున్నట్టు రైల్వే శాఖప్రకటించింది.
ఇవాళ వరుసగా నాలుగవ రోజు కూడా తమిళనాడు లో 4000 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 3,086 మంది కి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.రాష్ట్రంలో 39 మరణాలు నమోదయ్యాయి.
*కర్ణాటక : కర్ణాటక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గల 155 పరీక్షా కేంద్రాలలో 1.08,241 కోవిడ్ పరీక్షలు నిర్వహించింది . ఇప్పటివరకు 69,52,835 పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ కేసుల రేటు 5.42శాతం గా ఉంది. లక్షా 440 యాక్టివ్ కేసులలో 947 మంది పేషెంట్లు అంటే 0.94 కేసులు ఐసియులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల కేస్ రేటు 1.49 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ ద్వారాతెలిపారు. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ప్రాధమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
* ఆంధ్రప్రదేశ్: అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటించారు. 1,3,5,7,9 తరగతులకు ఒకరోజు, 2,4,6,8,10 తరగతులకు మరో రోజు సరి,బేసి ప్రాతిపదికన తరగతులునిర్వహించనున్నట్టు తెలిపారు. పాఠశాలల్లో అమలు చేయాల్సిన కోవిడ్ ప్రొటోకాల్స్ కు సంబంధించి డిఎంహెచ్ ఒ లద్వారా టీచర్లకు శిక్షణ ఇప్పించినట్టు ఆయన తెలిపారు. ప్రతి పాఠశాలకు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని,ఒక డాక్టర్ పిహెచ్‌సిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. కాగా కోవిడ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనా యంత్రాంగం కరోనా వైరస్ నియంత్రణకు అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తున్నది.మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం ,తరచూ వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్రపరచుకోవాల్సిన అవసరం పై ప్రజలలొ అవగాహన కల్పిస్తున్నారు.
*తెలంగాణ : గత 24 గంటలలో తెలంగాణాలో 1456 కొత్త కేసులు నమోదయ్యాయి. 1717 మంది కోలుకున్నారు. 5గురు మరణించారు. ఈ 1456 కేసులలో 254 కేసులు జిహెచ్ఎంసి నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,27,580. యాక్టివ్‌కేసులు 20,183, మరణాలు 1292,
కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారు 2,06,105. కోవిడ్ అనంతర సమస్యలతో తెలంగాణ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణించారు. 24 రోజుల క్రితం ఆయన కోవిడ్ వైరస్ కు గురయ్యారు. ఆతర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత తిరిగి అనారోగ్యానికి గురయ్యారు.
* అస్సాం: అస్సాంలో కోవిడ్ 19 వైరస్‌కు మరో 701 మంది గురయ్యారు, నిన్న 1664 మంది పేషెంట్లు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 202774 కు పెరిగింది, యాక్టివ్‌క ఏసులు 25,807. కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయిన వారు 176075, మరణించినవారు 889.
*మేఘాలయ : మేఘాలయ లో ఈరోజు కోవిడ్ -19నుంచి 177 మంది పేషెంట్లు కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 1870. మొత్తం కోలుకున్న వారు 6674.
* నాగాలాండ్ : నాగాలాండ్లో 8139 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 3613 మంది సైనిక దళాలకు చెందినవారు. ఇందులో 2512 గుర్తించిన కాంటాక్టుల, 1617 తిరిగి వచ్చినవారు, 397మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉ న్నారు.
*సిక్కిం : సిక్కింలో మరో 49 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. యాక్టివ్ కేసులు 252.మొత్తం డిశ్చార్జి అయినవారు 3328 మంది.
FACT CHECK


*******
(Release ID: 1666912)
Visitor Counter : 213