సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ (IIPA) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 317 వ సమావేశం కేంద్ర అధ్యక్షత వహించిన ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
21 OCT 2020 6:02PM by PIB Hyderabad
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ (IIPA) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 317 వ సమావేశం ఈ రోజు జరిగింది. సంస్థ చైర్మన్ హోదాలో కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. IIPA చైర్మన్ గా ఇంతకాలం 1949 బ్యాచ్ కి చెందిన టి ఎన్ చతుర్వేది వ్యవహరించారు. 2004లో భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా, గవర్నర్ గా పనిచేసిన చతుర్వేది IIPA చైర్మన్ భాధ్యతలను చేపట్టారు. 2020 జనవరిలో మరణించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు.
ఈ రోజు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి IIPA డైరెక్టర్ హోదాలో శ్రీ ఎస్ ఎన్ త్రిపాఠి సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం త్రిపాఠిని IIPA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది.
సమావేశానికి నీతి ఆయోగ్ సి ఇ ఓ అమితాబ్ కాంత్ , ఛతీస్ ఘర్ మాజీ గవర్నర్ శేఖర్ దత్, పంజాబ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్, త్రిపుర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి బి ప్రసాద్, IIPA కేరళ ప్రాంతీయ శాఖ కార్యదర్శి డాక్టర్ జి. కురూప్ మహారాష్ట్ర ప్రాంతీయ కార్యదర్శి విజయ్ సత్ బీర్ సింగ్,ఒడిశా ప్రాంతీయ అధ్యక్షుడు ఎస్ సి మిశ్రా ,IIPA ప్రొఫెసర్ కే కే పాండే, కేంద్ర సిబ్బంది మరియు శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రష్మీ చౌదరి , ఖర్చుల శాఖ సహాయ కార్యదర్శి పద్మనాభం, IIPA రిజిస్ట్రార్ అమితాబ్ రంజన్ హాజరయ్యారు.
IIPAలో జీవితకాల సభ్యులుగా ఎవరైనా చేరడానికి అవకాశం కల్పిస్తూ నిబంధనలను మారుస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ చైర్మన్ హోదాలో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వీసు లో ఉన్న అధికారులు IIPA సభ్యత్వాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. 2021 జనవరి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, IIPA సభ్యత్వాన్ని తీసుకోడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు రావని ఆయన వివరించారు.
IIPA పనితీరు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సంస్థ డిజిటల్ తరగతులను నిర్వహించి విద్యా కార్యక్రమాలకు అంతరాయం లేకుండా చేసిందని మంత్రి అన్నారు. కరోనా సమయంలో సంస్థ ప్రభుత్వ అధికారుల కోసం ఆన్ లైన్ లో 14 కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా 62 పరిశోధనా కార్యక్రమాలను పూర్తి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని వివిధ రాష్ట్రాల శాఖలు, చాఫ్టర్లు వర్చ్యువల్ పద్దతిలో కార్యక్రమాలను నిర్వహిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమాలను మరింత సమర్ధంగా అమలు చేయడానికి మరిన్ని విశ్వవిద్యాలయాలు , విద్యా సంస్థలతో కలసి పని చేయాలని ఆయన సూచించారు.
***
(रिलीज़ आईडी: 1666640)
आगंतुक पटल : 180