యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రారంభం కానున్న శిక్షణా శిబిరాలు క్రీడాకారులకు రవాణా సౌకర్యాలు కల్పించనున్న సాయ్
Posted On:
21 OCT 2020 6:47PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ , పారా ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాపితంగా శిక్షణా శిబిరాలను నవంబర్ 1వతేదీ నుంచి ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతున్నది.
దేశంలో ప్రస్తుతం కొవిడ్ వల్ల నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్షణా శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులకు రవాణా సౌకర్యాలను కల్పించాలని స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా నిర్ణయించింది. క్రీడాకారులు వైరస్ బారిన పడకుండా చూడడానికి సాయ్ / ఎన్ సి ఓ ఏ ఈ ఏర్పాటు చేసే శిక్షణా శిబిరాలకు చేరడానికి వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించాలని సాయ్ నిర్ణయించింది. మార్చి నెలలో కరోనా వైరస్ ప్రారంభం కావడంతో క్రీడాకారులు తక్షణం శిబిరాలను వీడి వెళ్ళవలసి వచ్చింది. తాము శిక్షణ పొందవలసి ఉన్న కేంద్రానికి 500 కిలోమీటర్లు పైబడి ప్రయాణించవలసి ఉండే క్రీడాకారులకు విమాన టిక్కెట్లను ఇవ్వాలని సాయ్ నిర్ణయించింది. 500 కిలోమీటర్ల కంటె తక్కువ దూరంలో ఉండే క్రీడాకారులకు 3 ఏసీ లో ప్రయాణించవచ్చును.
ఇంతేకాకుండా శిక్షణను తిరిగి ప్రారంభించడానికి వీలుగా బయో-బబుల్ కు రూపకల్పన చేసిన సాయ్ కోచ్ లు, సాయ్ / ఎన్ సి ఓలకు చెందిన సహాయ సిబ్బందికి వసతి సౌకర్యాలను కల్పించాలని కూడా నిర్ణయించింది. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
సాయ్ శిక్షణా శిబిరాలను చేరడానికి మరియు చేరిన తరువాత పాటించవలసిన నియమ నిబంధనలను ఇప్పటికే క్రీడాకారులు మరియు వారి తల్లితండ్రులకు సంస్థ అధికారులు వివరిస్తున్నారు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలసి జరుపుకున్న తరువాత శిక్షణా కేంద్రాలకు చేరదానికి సాయ్ క్రీడాకారులకు అనుమతి ఇచ్చింది. బయో-బబుల్లో చేరిన తరువాత తిరిగి వెళ్తే వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో సాయ్ ఈ నిర్ణయం తీసుకున్నది .
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు నివారణా చర్యలను అమలు చేయాలని సాయ్ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ సాయ్ / ఎన్ సి ఓ ఏర్పాటు చేసిన కేంద్రాలలో శిక్షణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 17 నుంచి శిక్షణా కార్యక్రమాలను నిలిపివేసినప్పటికీ 20వ తేదీ వరకు క్రీడాకారులకు అసౌకర్యం లేకుండా చూడడానికి వసతి సౌకర్యాలను కొనసాగించారు. కేంద్రానికి 400 కిలోమీటర్లకి మించి దూరంలో ఉంటున్న క్రీడాకారులను విమానాలు, మిగిలిన వారిని ఏసీ 3 టయర్ లో తిరిగి పంపడానికి వీలు కల్పించడం జరిగింది.
***
(Release ID: 1666635)
Visitor Counter : 182