హోం మంత్రిత్వ శాఖ
వీసా, ప్రయాణ ఆంక్షలు గ్రేడుల వారీగా సడలింపు
Posted On:
22 OCT 2020 12:38PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 2020 నుండి అంతర్జాతీయ ప్రయాణీకుల లోపలి, బయట రాకపోకలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది.
భారతదేశంలోకి ప్రవేశించాలనుకుంటున్న లేదా బయటకు వెళ్ళాలనుకునే విదేశీయులు, భారతీయులలో మరిన్ని వర్గాలకు వీసా మరియు ప్రయాణ ఆంక్షలలో శ్రేణుల వారీగా మరికొన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. అందువల్ల, పర్యాటక వీసాలో తప్ప, అధికారిక విమానాశ్రయాలు మరియు ఓడరేవు ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా విమాన, జల మార్గాల్లో ప్రవేశించడానికి టూరిస్ట్ వీసా మినహా, ఏ ఇతర ప్రయోజనాల ద్వారానైనా భారతదేశాన్ని సందర్శించాలనుకునే అన్ని ఓసిఐ, పిఐఓ కార్డ్ హోల్డర్లు, అన్ని ఇతర విదేశీ పౌరులను అనుమతించాలని నిర్ణయించారు. ఇందులో వందే భారత్ మిషన్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఏర్పాట్లు లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించిన షెడ్యూల్ కాని వాణిజ్య విమానాల ద్వారా అనుమతి ఉంటుంది. అటువంటి ప్రయాణికులందరూ క్వారంటైన్, ఇతర ఆరోగ్య / కోవిడ్-19 విషయాలకు సంబంధించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.
ఈ గ్రేడెడ్ రిలాక్సేషన్ కింద, ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలను (ఎలక్ట్రానిక్ వీసా, టూరిస్ట్ వీసా మరియు మెడికల్ వీసా మినహా) తక్షణమే పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి వీసాల చెల్లుబాటు గడువు ముగిసినట్లయితే, తగిన వర్గాల తాజా వీసాలను సంబంధిత ఇండియన్ మిషన్ / పోస్టుల నుండి పొందవచ్చు. వైద్య చికిత్స కోసం భారతదేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ పౌరులు వారి వైద్య సహాయకులతో సహా మెడికల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందువల్ల, ఈ నిర్ణయం విదేశీ పౌరులు వ్యాపారం, సమావేశాలు, ఉపాధి, అధ్యయనాలు, పరిశోధన, వైద్య ప్రయోజనాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం భారతదేశానికి రావడానికి వీలు కల్పిస్తుంది.
*****
(Release ID: 1666789)
Visitor Counter : 347
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada