ప్రధాన మంత్రి కార్యాలయం
శేఖ్ నవాఫ్ అల్- అహ్మద్ అల్- జాబేర్ అల్ సబాహ్ గారికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2020 6:00PM by PIB Hyderabad
ద స్టేట్ ఆఫ్ కువైత్ అమీర్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన శేఖ్ నవాఫ్ అల్- అహ్మద్ అల్- జాబేర్ అల్ - సబాహ్ గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన శేఖ్ మిశాల్ అల్- అహ్మద్ అల్- జాబేర్ అల్ - సబాహ్ గారికి కూడా ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.
‘‘ద స్టేట్ ఆఫ్ కువైత్ అమీర్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన శేఖ్ నవాఫ్ అల్- అహ్మద్ అల్- జాబేర్ అల్ - సబాహ్ గారికి ఇవే అభినందనలూ, శుభాకాంక్షలూను. క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన శేఖ్ మిశాల్ అల్- అహ్మద్ అల్- జాబేర్ అల్ - సబాహ్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
వారి నాయకత్వం లో ద స్టేట్ ఆఫ్ కువైత్ ప్రపంచం లో ఓ ముఖ్యమైన పాత్ర ను పోషించడాన్ని కొనసాగిస్తుందనే నమ్మకం, అలాగే భారత్- కువైత్ మైత్రి కూడా మరింత దృఢం అవుతుందనే నమ్మకం నాకుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1663500)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam