ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

13 వరోజు కూడా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు10 లక్షల లోపే

గురువారం నుంచి శనివారం దాకా వారాంతంలోనూ

రోజుకు10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Posted On: 04 OCT 2020 11:14AM by PIB Hyderabad

భారత్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య వరుసగా 13వరోజు కూడా 10 లక్షల లోపే కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగి చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య ఈ రోజు 9,37,625 గా నమోదైంది. ఇది నిన్నటి కంటే 7371 తక్కువ.

 

ఈ వారాంతంలో గురువారం మొదలు శనివారం దాకా మూడు రోజుల్లోనూ పరీక్షల సంఖ్య  10,97,947, 11,32,675, 11,42,131 గా నమోదైంది. భారత లో పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరగటానికి ఇది నిదర్శనం. ప్రతిరోజూ 15 లక్షలకు పైగా పరీక్షలు జరపగల సామర్థ్యం మన లాబ్ లకు ఉంది. గడిచిన పదిరోజులలో సగటున రోజుకు 11.5 లక్షల శాంపిల్స్ పరీక్షించగలిగారు.

 

 

ఈ ఏడాది ఆరంభంలో జనవరిలో దేశంలో ఒకే ఒక్క లాబ్ ఉండేది. కానీ ఇప్పటివరకూ 7.89 కోట్ల శాంపిల్స్ పరీక్షించగలిగాం. అదే సమయంలో క్రమంగా పాజిటివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి.  అలా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే కొద్దీ కోవిడ్ వ్యాప్తిని నిరోధించటంలో పరీక్షల పెంపు పాత్ర చెప్పుకోదగినంతగా ఉందని తేలింది.  పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపటం వలన తొలిదశలోనే కోవిడ్ బాధితులను గుర్తించటం, సకాలంలో సమర్థవంతమైన చికిత్స అందించటం. స్వల్ప లక్షణాలున్నవారిని ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంచటం సాధ్యమయ్యాయి. వీటన్నిటి ఉమ్మడి ఫలితంగా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టింది.

 

దేశంలో రోజూ కోవిడ్ బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో  82.260 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారి సంఖ్య 75.829గా నమోదు కావటం గమనార్హం.ఆ విధంగా కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్యే ఎకువగా ఉంటోంది.

 

భారత్ లో ఇప్పటివరకు కోలుకున్నవారు మొత్తం సంఖ్య 55 లక్షలు పైబడింది. కచ్చితంగా చెప్పాలంటే 55,09, 966 మంది ఇప్పటిదాకా కోలుకున్నారు.  ప్రతిరోజూ కోలుకుంతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉండటం వలన మొత్తం కోలుకున్నవారిశాతం ప్రస్తుతం 84.13% గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 75.44% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కావం గమనార్హం. అందులో ముందు వరసలో మహారాష్ట్ర ఉండగా ఆ తరువాత స్థానాల్లో  కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

 

ప్రస్తుతం దేశంలో కోవిడ్ చికిత్స పొందుతూ ఉన్నవారిలో 77.11% మంది కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉండగా, ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్థారణ అయిన వారిలో వీరి వాటా 14.32%/. కొత్తగా వస్తున్న కేసులలో కూడా దాదాపు 78%  పది రాష్ట్రాలనుంచే ఉన్నాయి. కొత్తగా నిర్థారణ అయినవారిలో 14 వేలకు పైగా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా కర్నాటకలో 9886 మంది, కేరళలో 7834 మంది పాజిటివ్ గా నిర్థారణ అయింది.

 

గడిచిన 24 గంటల్లో వెయ్యికి లోపే (940) కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇలాకొత్తగా నమోదైన మరణాలలో 80.53% పది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు  నమోదైన మరణాలలో 29.57% (278 మరణాలు)  ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయి. 100 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో నిలిచింది. అయితే, మరణాలలో మహారాష్ట్ర వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది.

 

 

****



(Release ID: 1661558) Visitor Counter : 164