PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 07 SEP 2020 6:20PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ త‌నిఖీ చేసి నివేదించిన వాస్తవాంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

• దేశంలో కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ఇవాళ 32.5 ల‌క్ష‌ల‌కుపైగా న‌మోదు

కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 77.31 శాతానికి చేరిక‌

మొత్తం కేసుల‌లో 5 రాష్ట్రాల వాటా 60 శాతం; క్రియాశీల కేసులలో 62 శాతం; మరణాల్లో 70శాతం.

పంజాబ్‌, చండీగ‌ఢ్‌ల‌లో కోవిడ్ నియంత్ర‌ణ‌, నిఘా, ప‌రీక్ష‌లు, స‌మ‌ర్థ వైద్య నిర్వ‌హ‌ణపై ప్ర‌జారోగ్య స‌మీక్ష‌లో  తోడ్ప‌డ‌టం కోసం కేంద్ర బృందాలను పంపిన కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ‌

• ఉత్త‌రప్ర‌దేశ్‌లో స‌మీకృత కోవిడ్ కంట్రోల్-కమాండ్ కేంద్రంస‌హా రాష్ట్రస్థాయి ఏకీకృత

 

 

దేశంలో కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ 32.5 ల‌క్ష‌ల‌కుపైగా న‌మోదు; మొత్తం కేసుల‌లో 5 రాష్ట్రాల వాటా 60 శాతం; క్రియాశీల కేసులలో 62 శాతం; మరణాల్లో 70శాతం

భారత్‌లో ఇప్పటిదాకా కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 32.5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 69,564 మందికి వ్యాధి నయంకగా, కోలుకునేవారి సగటు 77.31 శాతానికి దూసుకెళ్లింది. అలాగే నమోదిత కేసులలో మరణాలు వేగంగా తగ్గుతూ నేడు అత్యల్పంగా 1.70 శాతానికి పతనమైంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో ఐదు రాష్ట్రాల వాటా 60 శాతం కాగా, మహారాష్ట్ర 21.6 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ (11.8%), తమిళనాడు (11.0%), కర్ణాటక (9.5%), ఉత్తర ప్రదేశ్ (6.3%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే దేశంలో ప్రస్తుతం చికిత్స పొందే కేసుల రీత్యా కూడా మహారాష్ట్ర 26.76 శాతంతో తొలి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ (11.30%), కర్ణాటక (11.25%), ఉత్తర ప్రదేశ్ (6.98%), తమిళనాడు (5.83%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆ మేరకు సదరు 5 రాష్ట్రాల క్రియాశీల కేసుల వాటా 62 శాతంగా ఉంది. భారత్‌లో ఇవాళ్టి వరకూ కోలుకున్నవారి సంఖ్య 32.5 లక్షలకన్నా అధికంగా (32,50,429) నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 11,915 మందికి వ్యాధి నయం కాగా, జాతీయస్థాయిలో కోలుకునే కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. అలాగే కర్ణాటక (9,575), మహారాష్ట్ర (7826), తమిళనాడు (5,820), ఉత్తర ప్రదేశ్ (4779) తర్వాతి స్థానాలు పొందాయి. దేశం మొత్తంమీద గత 24 గంటల్లో కోలుకున్న కేసులకుగాను ఈ ఐదు రాష్ట్రాల్లోనూ  57 శాతం నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651932

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త-కోలుకునే కేసులతోపాటు నమోదిత మరణాల వివరాలు

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651929

కోవిడ్ నియంత్ర‌ణ‌, నిఘా, ప‌రీక్ష‌లు, స‌మ‌ర్థ వైద్య నిర్వ‌హ‌ణపై 10 రోజులు ప్ర‌జారోగ్య స‌మీక్ష‌లో తోడ్పాటు దిశగా పంజాబ్‌, చండీగ‌ఢ్‌ల‌కు కేంద్ర బృందాలను పంపిన కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ‌శాఖ‌

పంజాబ్‌తోపాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌కు కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ ఉన్నతస్థాయి బృందాలు అక్కడి రోగుల నియంత్రణ-నిఘా-పరీక్ష-సమర్థ వైద్య నిర్వహణ కోసం ప్రజారోగ్య చర్యల బలోపేతం దిశగా ఈ బృందాలు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలకు సహాయపడతాయి.  ఈ మేరకు సకాలంలో రోగ నిర్ధారణ సంబంధిత సవాళ్లను సమర్థంగా పరిష్కరించడంలో ఈ బృందాల్లోని అధికారులు మార్గనిర్దేశం చేస్తారు. ఇద్దరేసి సభ్యులతో కూడిన ఈ  బృందాల్లో చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్ నుంచి సామాజిక ఆరోగ్య నిపుణుడు/ఎన్‌సీడీసీ నుండి అంటువ్యాధుల నిపుణుడు ఉంటారు. కోవిడ్‌ నిర్వహణలో విస్తృత మార్గనిర్దేశం చేయడానికి   ఈ బృందాలు పది రోజులపాటు అక్కడే ఉంటాయి. కాగా, పంజాబ్‌లో మొత్తం 60,013 కేసులు నమోదవగా ప్రస్తుతం 15,731 చురుకైన కేసులున్నాయి. అలాగే 1,739 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు  37,546 (జాతీయ ప్రస్తుత సగటు 34593.1గా ఉంది)గా నమోదైంది. పరీక్షల అనంతరం నిర్ధారిత కేసులు 4.97శాతంవద్ద అతి తక్కువకు చేరువలో ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో మొత్తం కేసులు 5,268 కాగా, 2095 క్రియాశీల కేసులున్నాయి. మరోవైపు ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు 38054 కాగా, నిర్ధారిత కేసులు 11.99 శాతంగా ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651753

కోవిడ్‌ కేసులు, మరణాలు అధికంగా నమోదయ్యే 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష

దేశంలో కోవిడ్‌ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్న ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోగల 35 జిల్లాల్లో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. వీటిలో పశ్చిమ బెంగాల్‌ 4; మహారాష్ట్రలో 17; గుజరాత్‌లో 1; పుదుచ్చేరిలో 1; జార్ఖండ్‌లో 1; ఢిల్లీలో 11 జిల్లాల వంతున ఉన్నాయి. ఈ సమీక్ష సందర్భంగా వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల ప్రాముఖ్యాన్ని ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధికారవర్గాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వివరించారు. ఈ జిల్లాల్లో కోవిడ్-19 ప్రస్తుత స్థితిగతులపై రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు సమగ్ర విశ్లేషణను సమర్పించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651753

ఉత్త‌రప్ర‌దేశ్‌లో స‌మీకృత కోవిడ్ కంట్రోల్-కమాండ్ కేంద్రం స‌హా రాష్ట్రస్థాయి ఏకీకృత కోవిడ్ పోర్టల్ ఏర్పాటు

రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 2020 జూలై 18న రాష్ట్ర రాజధానిసహా అన్ని జిల్లాల్లో సమీకృత కోవిడ్ కంట్రోల్-కమాండ్ కేంద్రాల (ICCCC)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో నిర్ధారిత కేసుల పర్యవేక్షణకు వీలు కల్పించింది. లక్షణాలున్న రోగులు, పరిచయస్థుల తక్షణ పరీక్షలతోపాటు ప్రయోగశాలల స్థితిని తెలియజేయడం, రవాణా సదుపాయం-రోగుల స్వీకరణ విషయంలో సౌకర్యాల కేటాయింపుసహా ఏకాంత గృహవాస కేసులను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా  కమాండ్ కేంద్రాలు జోనల్ యూనిట్లతో సమన్వయం చేసుకుంటాయి. ఇక ఈ సదుపాయంతోపాటు రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ రోగుల నిఘా, పరీక్ష, చికిత్సలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సంగ్రహించే ఏకీకృత పోర్టల్‌ http://upcovid19tracks.inను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651842

స్వయం సమృద్ధ భారత నిర్మాణం దిశగా అగరొత్తుల తయారీదారులకు మద్దతును రెట్టింపు స్థాయికి విస్తరించనున్న కేంద్ర ప్రభుత్వం

స్వయం సమృద్ధ భారత నిర్మాణంలో భాగంగా అగరొత్తుల తయారీదారులకు మద్దతును రెట్టింపు స్థాయికి విస్తరించేందుకు కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ సంపూర్ణ విధానానికి నడుం బిగించింది. ఈ మేరకు పరిశ్రమ భాగస్వాముల  ఆసక్తిని పరిణనలోకి తీసుకుని 2020 సెప్టెంబరు 4న కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు 1,500 మంది చేతివృత్తులవారికి ముడిపదార్థాల సరఫరాతోపాటు విపణి సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. తదనుగుణంగా ఇంతకుముందు 200 ఆటోమేటిక్‌ అగరొత్తుల యంత్రాలుండగా వీటిని 400కు పెంచడంతోపాటు పెడల్‌తో పనిచేయించే 500 యంత్రాలను అదనంగా సమకూర్చనుంది.     ఈ కార్యక్రమ ప్రణాళిక అమలు కోసం నిధులను రూ.55 కోట్లకుపైగా పెంచగా, ఇందులో సుమారు రూ.3.45 కోట్లతో 1500 మందికి తక్షణ సాయం అందుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651753

కోవిడ్‌ దిగ్బంధ  పరీక్షా సమయంలోనూ 2020-21 తొలి త్రైమాసికంలో రూ.146.59 కోట్ల అమ్మకాల స్థాయి సాధించిన బిపిపిఐ; 2019-20 తొలి త్రైమాసికంలో ఇది రూ.75.48 కోట్లు మాత్రమే

భార‌త ప్ర‌భుత్వ‌రంగ ఔష‌ధ సంస్థ‌ల బ్యూరో (BPPI) కోవిడ్ దిగ్బంధ పరీక్షా స‌మ‌యంలోనూ 2020-21 తొలి త్రైమాసికంలో రూ.146.59 కోట్ల అమ్మ‌కాల‌ ప‌రిమాణం సాధించింది. ఇది 2019-20 తొలి త్రైమాసికంలో కేవలం రూ.75.48కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా, "ప్రధామంత్రి జనౌషధి పరియోజన-పీఎంబీజేపీ"ని ఈ బ్యూరో అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్క జూలై నెల అమ్మకాలు  రూ.48.66 కోట్లు కాగా, 2020 జూలై 31నాటికి మొత్తం అమ్మకాలు రూ.191.90 కోట్లుగా నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651728

శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్ చేతుల‌మీదుగా 24 గంటల మానసిక ఆరోగ్య పున‌రావాస స‌హాయ కేంద్రం (కిర‌ణ్‌) ఉచిత ఫోన్ నం.1800-599-0019 ప్రారంభం

మానసిక అనారోగ్యంతో బాధపడేవారికి ఉపశమనం, సహాయం అందించడం కోసం 24 గంటల 'మానసిక ఆరోగ్య పునరావాస సహాయ కేంద్రం' (KIRAN)ను ఉచిత ఫోన్‌ నంబరు 1800-500-0019తో కేంద్ర సామాజికన్యాయం-సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్ ఇవాళ ప్రారంభించారు. దేశంలో మానసిక అనారోగ్యం పెరుగుతున్న ఉదంతాల  దృష్ట్యా... ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఈ కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సహాయ కేంద్రం పోస్టర్, కరదీపిక, వనరుల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ- ప్రారంభ పరీక్ష, ప్రథమ చికిత్స, మానసిక సహకారం, బాధానిర్వహణ, మానసిక సంక్షేమం, సానుకూల ప్రవర్తనలను ప్రోత్సహించడంసహా మానసిక సంక్షోభ నిర్వహణవంటి లక్ష్యాలతో ఈ కేంద్రం సేవలు అందిస్తుందని వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652016

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో కోవిడ్‌ సంబంధిత తొలి లక్షణాలు కనిపించగానే వైద్య సాయం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించేలా ప్రజలకు సూచించాల్సిందిగా చండీగఢ్‌ పాలన యంత్రాంగాధిపతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్కెట్‌ సంఘాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, నగరపాలక సంస్థ కౌన్సిలర్లు కృషిచేయాలని ఆయన కోరారు. కరోనా సోకినవారి కోసం చండీగఢ్‌లో    పడకలు, మందులు, ఇతర సౌకర్యాలన్నీ తగినంత మేర అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలను ప్రోత్సహించే దిశగా పేద కుటుంబాలకు ఆహార పొట్లాలను ఉచితంగా పంపిణీ చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఆస్పత్రులలో పడకల కొరత లేదని, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లూ చేసిందని గుర్తుచేశారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 86 కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 1,520కి పెరిగింది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1,763 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 96,823కు చేరింది. ప్రస్తుతం 28,273 మంది చికిత్స పొందుతున్నారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలో 139 కొత్త కేసులతోపాటు 2 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కాగా, మణిపూర్‌లో కోలుకునేవారి సగటు 72 శాతం కాగా, మొత్తం 189 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం మొత్తం 1,820 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుత చురుకైన కేసులు 1,433 కాగా, వీరిలో బీఎస్‌ఎఫ్‌, సాయుధ దళాల సిబ్బంది 314 మంది కాగా- ఇతరులు 1,119 మంది ఉన్నారు. మేఘాలయలో ఇప్పటిదాకా 1,556 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 21 కొత్త కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసులు 1,114కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 382గా ఉన్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలో నమోదైన మొత్తం 4,178 కేసులలో భద్రతా సిబ్బంది 1,786 మంది కాగా, తిరిగివచ్చిన వారు 1,296 మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం 773 మంది ప్రభుత్వ నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు కోహిమాలో కొత్త కేసులు వెల్లడికావడంతో మరిన్ని ప్రాంతాలను మూసివేశారు. ఈ ప్రదేశాల్లో ఆఫీసర్స్ హిల్, పాటర్లేన్, చాంద్‌మరి కాలనీలు, ఎస్‌ఐబి గెస్ట్ హౌస్ తదితరాలున్నాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో 29 కొత్త కేసులతోపాటు మరొకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరగా, కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 1,380కి చేరింది. క్రియాశీల కేసులు 554గా ఉన్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో దిగ్బంధ విముక్తి-4లో భాగంగా మెట్రో రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి.  మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కొచ్చి మెట్రో తొలిదశ చివరి భాగం పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. నిర్బంధవైద్య పర్యవేక్షణ కాలం ముగిశాక ధ్రువీకరణ పత్రంకోసం వచ్చిన మహిళలను వేధించిన ఆరోపణలపై తిరువనంతపురంలో ఇవాళ ఒక హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు శనివారం రాత్రి కోవిడ్‌ నిర్ధారణ అయిన ఒక మహిళను వేధించిన అంబులెన్స్‌ డ్రైవర్‌ను తమ అదుపునకు ఇవ్వాలని పోలీసులు కోర్టులో అభ్యర్థన దాఖలు చేయనున్నారు. కేరళలో నిన్న 3,082 కొత్త కేసులు నమోదవగా చురుకైన కేసులు 22,676, మృతుల సంఖ్య 347గా ఉన్నాయి. వివిధ జిల్లాల్లో 2,00,296 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ ఉదయం 10 గంటలకు ముగిసిన గత 24 గంటల్లో 292 కొత్త కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం 17,316 కేసులలో 12135 మంది కోలుకోగా, ప్రస్తుతం 4865 మంది చికిత్స పొందుతున్నారు. మరో 280 మంది మరణించారు. ఇక తమిళనాడు అంతటా జిల్లాల మధ్య బస్సు, రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. తదనుగుణంగా రైల్వేస్టేషన్లు, బస్ టెర్మినస్‌లలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం దిగ్బంధం సడలించగా, పౌరులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం కనిపించింది. ఈ మేరకు అనేకమంది మాస్కులు ధరించకుండా  బహిరంగ ప్రదేశాలకు పెద్దసంఖ్యలో వచ్చారు.
  • కర్ణాటక: రాష్ట్ర రాజధాని బెంగళూరులో 150 రోజుల తర్వాత ఇవాళ మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి; అయితే, తీవ్ర రద్దీ ఉండాల్సిన సమయంలోనూ ప్రయాణికులు పలుచగా కనిపించారు. ఐదు నెలల కరోనా సంక్షోభం తరువాత కర్ణాటకలో పర్యాటక రంగం పుంజుకుంటోంది. కాగా, అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఆలస్యం కావడంతో  ఇబ్బందులు పడుతున్నట్లు మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. ఇలా ఆలస్యం కావడం సాధారణమే అయినప్పటికీ మహమ్మారి సమయంలో సమస్య తీవ్రంగా అధికంగా ఉన్నట్లు ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం 9,319 కొత్త కేసులు నమోదవగా మొత్తం  కేసుల సంఖ్య 3.98 లక్షలకు చేరింది.
  • ఆంధ్రప్రదేశ్: దిగ్బంధ విముక్తి-4పై కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 9-10 తరగతి విద్యార్థులకు పాఠశాలలతోపాటు జూనియర్‌ కళాశాలలు ప్రారంభించాలని పేర్కొంది. అయితే, తల్లిదండ్రులనుంచి లిఖితపూర్వక అనుమతిని తప్పనిసరి చేసింది. మరోవైపు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తెరవడానికి అనుమతించింది. ఇక సామాజిక, విద్యా, క్రీడలు, మత, రాజకీయ కార్యకలాపాలకు హాజరు 100 మందికి మించరాదని స్పష్టం చేసింది. అలాగే సెప్టెంబర్‌ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మించకుండా హాజరు కావచ్చునని పేర్కొంది. సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరవవచ్చునని- సినిమా హాళ్లు, ఈత కొలనులు వినోద కేంద్రాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడోరోజు అధిక సంఖ్యలో కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో ప్రస్తుత కేసుల సంఖ్య లక్షకన్నా తక్కువకు దిగివచ్చింది. కాగా, రాష్ట్రంలో మొత్తం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు 5 లక్షలుగా ఉంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1802 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 245 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. మొత్తం కేసులు: 1,42,771; క్రియాశీల కేసులు: 31,635; మరణాలు: 897; డిశ్చార్జి: 1,10,241గా ఉంది. ఆదివారం నాటికి 2,711 మంది కోలుకోగా తెలంగాణలో మొత్తం 77.2 శాతం సగటుతో 1,10,241 మందికి వ్యాధి నయమైంది.  కాగా, కోలుకునువారి జాతీయ సగటు 77.25 శాతం కావడం గమనార్హం. ఇక కోవిడ్ మహమ్మారి వల్ల ఐదు నెలలపాటు నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు ఇవాళ పటిష్ఠ భద్రత చర్యలతో తిరిగి ప్రారంభమయ్యాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గడచిన 7 రోజులుగా కోవిడ్‌ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా 126,523 కొత్త కేసులతోపాటు 2,205 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,35,857 మంది క్రియాశీల రోగులున్నారు. ఇది దేశంలోని ప్రస్తుత రోగుల సంఖ్యలో నాలుగో వంతుకన్నా అధికం కావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల నివారణకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తన దూరవాణి-ఐసీయూ ప్రాజెక్టు విస్తరణపై నిశితంగా దృష్టి సారించింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని ప్రజలకు అవగాహన కల్పించేదిశగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇవాళ ఐదు కోవిడ్ విజయరథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును యునిసెఫ్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య శాఖతోపాటు సమాచార-ప్రసారశాఖ అమలుచేస్తాయి. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 16,475 యాక్టివ్ కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని  పట్టణ ప్రాంతాలుసహా అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను నేడు తిరిగి తెరిచారు. అయితే- భక్తులు పూలు, పండ్లు, స్వీట్లు తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతించలేదు. సురక్షిత దూరం నిర్వహణ, మాస్కు ధారణను తప్పనిసరి చేసింది.  రాజస్థాన్‌లో ప్రస్తుతం 14,958 చురుకైన కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని కోవిడ్‌ రోగులలో నిస్పృహ, ఆత్మహత్య ధోరణిని అరికట్టేందుకు రాష్ట్రంలోని జబల్పూర్‌లోగల నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాల-ఆస్పత్రివారు కుటుంబాలతో ముఖాముఖి ఏర్పాటుచేసింది. ఇద్దరు కరోనావైరస్ రోగులు ఆస్పత్రిలో ఆత్మహత్యకు యత్నించిన నేపథ్యంలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా రోగులు, బంధువుల నడుమ గాజుతెరను ఏర్పాటు చేసినట్లు కళాశాల-ఆస్పత్రి డీన్ డాక్టర్ పి.కె.కసార్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటికి 10 మందికిపైగా రోగులు వారి కుటుంబాలతో మాట్లాడారు. ప్రస్తుతం, 260 మంది ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

FACTCHECK

***



(Release ID: 1652171) Visitor Counter : 161