ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పెరుగుతున్న కోవిడ్ కోలుకున్న కేసులు,
మొత్తం 32.5 లక్షలు దాటినట్టు నమోదు
ఐదు రాష్ట్రాల్లోనే దేశం మొత్తం కేసుల్లో 60%,
చికిత్సలో ఉన్నవారిలో 62% , మరణాల్లో 70%
Posted On:
07 SEP 2020 12:04PM by PIB Hyderabad
పెరుగుదల బాటలోనే నడుస్తున్న కోలుకున్నవారి గ్రాఫ్ ఈ రోజు 32.5 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 69,564 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు, దీంతో కోలుకున్నవారిశాతం 77.31% తాకింది.
పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే కీలకమైన సూత్రం చుట్టూ సాగుతున్న వ్యూహానికి అనుగుణంగా అన్ని చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పరీక్షలు విస్తృతం చేయటం వలన ప్రాథమిక దశలోనే బాధితులను గుర్తించట సాధ్యమవుతోంది. మెరుగైన అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచటం వలన ఆరోగ్యం క్షీణించకముందే ఆస్పత్రికి తరలించటం వలన అత్యధికశాతం బాధితులు త్వరగా కోలుకోవటం, డిశ్చార్జ్ చేయటం సాధ్యమవుతోంది. దీనివలన మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. నేటికి మరణాల శాతం 1.70% కు పరిమితమైంది. వైద్యుల పర్యవేక్షణలో ఇళ్లలో ఐసొలేషన్ లో ఉన్నవారికి క్రమం తప్పకుండా ప్రమాణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునేట్టు చేయటం వలన స్వల్పలక్షణాలున్నవారు వేగంగా కోలుకోవటానికి వీలు కలుగుతోంది.
మొత్తం నమోదైన కేసులలో 60% కేసులు మహారాష్ట్ర 21.6% కేసులతో ముందుండగా, ఆ తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(11.8%), తమిళనాడు (11.0%), కర్నాటక (9.5%) , ఉత్తర ప్రదేశ్ (6.3% ) రాష్ట్రాలవే కావటం గమనార్హం.
ఇప్పటికీ ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య దృష్ట్యా కూడా మహారాష్ట 26.76% కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(11.30%), కర్నాటక (11.25%), ఉత్తరప్రదేశ్ (6.98%), తమిళనాడు (5.83%) ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలూ ప్రస్తుతం దేశం మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 62% వాటా ఉంది.
కోలుకున్నవారి మొత్తం సంఖ్య ఈ రోజుకు 32.5 లక్షలు ( కచ్చితంగా చెప్పాలంటే 32,50,429) దాటింది.
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా తాజాగా కోలుకున్నవారి సంఖ్య 11,915 గా నమోదైంది. కర్నాటకలో 9575 మంది, మహారాష్ట్రలో 7826 మంది, తమిళనాడులో 5820 మంది, ఉత్తరప్రదేశ్ లో 4779 మంది కోలుకున్నారు, ఈ ఐదు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో కోలుకున్న మొత్తం బాధితులలో 57% మంది ఉన్నారు.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1651932)
Visitor Counter : 223
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam