ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నివారణలో ఉత్తమ విధానాలు
సమగ్రమైన కోవిడ్ నియంత్రణ, కమాండ్ కేంద్రాన్ని, ఏకీకృత రాష్ట్ర స్థాయి కోవిడ్ పోర్టల్ ను ప్రారంభించిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం
Posted On:
06 SEP 2020 4:01PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి భారతదేశంలోకి ప్రవేశించి ఇప్పటికే తొమ్మిది నెలలైంది. రాష్ట్రాల్లోను, కేంద్ర పాలిత ప్రాంతాల్లోను ఈ మహమ్మారి వైరస్ ను నివారించడానికిగాను కేంద్రం అమలు చేసిన వ్యూహాత్మక నిర్వహణ, స్పందిస్తున్న తీరు కారణంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి సమన్వయంతో, ఏకీకృత భాగస్వామ్యంతో కేంద్ర విధానాలు అమలు చేశాయి. ఎప్పటికప్పుడు కేంద్రం ఇస్తున్న సూచనల్ని అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతాలకు అనుగుణంగా, వినూత్నమైన విధానాలు తయారు చేసుకొని మహమ్మారి వైరస్ పై పోరాటం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అమలు చేసే వినూత్న విధానాల్ని ఇతర రాష్ట్రాలు అనుసరించడం జరుగుతోంది. తద్వారా ఉత్తమ విధానాలు, చర్యలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
ఈ దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు ఉత్తమ విధానాల్ని అమలు చేస్తూ వస్తోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల కారణంగా మహమ్మారి వైరస్ నివారణ, చికిత్సకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జులై 18 2020న ఇంటిగ్రేటెడ్ కోవిడ్ కంట్రోల్, కమాండ్ కేంద్రాలను ప్రారంభించింది. వీటిని అన్ని జిల్లాల్లోను, రాష్ట్ర ప్రధానకార్యాలయంలోను నెలకొల్పారు. వైద్యేతర విషయాల్లో సాయం చేయడానికిగాను వీటిని నెలకొల్పడం జరిగింది. వీటిద్వారా పలు సంబంధిత విభాగాల మధ్యన సమర్థవంతమైన సమన్వయం వుండేలా చూస్తున్నారు. కోవిడ్ 19 చికిత్సలు లభించే కేంద్రాలను రోగులకు సూచించి వారిని వెంట వెంటనే అక్కడకు పంపడానికి వీలుగా కూడా ఈ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ కమాండ్ కేంద్రాలు తమ ప్రాంతంలోని మండల స్థాయి యూనిట్లతో మాట్లాడుతూ... లక్షణాలు లేకున్నా సరే వైరస్ వచ్చిన రోగులకు, వారి సంబంధీకులకు వెంటనే పరీక్షలు జరిగేలా చూస్తున్నాయి. అంతేకాదు పరీక్షల తాలూకా నివేదికలు ఎప్పుడు వస్తాయి, రవాణా, రోగులను చేర్చుకున్న సమయంలో తగిన సదుపాయాల కేటాయింపు, ఇళ్లల్లోనే ఐసోలేషన్లో వుంటూ చికిత్సలను తీసుకుంటున్నవారి కేసులను క్రమం తప్పకుండా పరిశీలించడం మొదలైన పనులను ఈ కమాండ్ కేంద్రాలు చేస్తున్నాయి.
ఏకీకృత రాష్ట్ర స్థాయి కోవిడ్ పోర్టల్ ను అభివృద్ధి చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం
కోవిడ్ రోగులకు సంబంధించిన సమాచారం, పరీక్షలు, చికిత్సలు ఇంకా ఇతర వివరాలను http://upcovid19tracks.in పోర్టల్ లో పొందుపరుస్తున్నారు. జిల్లాస్థాయిలో సమాచార సేకరణ, నిర్వహణ నాణ్యంగా వుండడంకోసం క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పోర్టల్ ను అభివృద్ధి పరచడంవల్ల ఈ రోగాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి, ఏఏ నివారణ, చికిత్సా విధానాలు మంచివో తెలుసుకోవడానికి, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో..ఆయా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికి ఇది దోహదం చేస్తోంది. వెంట వెంటనే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, వెంటనే స్పందించడానికిగాను డిజిటల్ సమాచారం ద్వారా అందుతున్న వికేంద్రీకృత, సూక్ష్మస్థాయి విశ్లేషణ దోహదం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సాయం తీసుకోవడానికి వీలుగా రూపొందండంవల్ల అది ఈ ఉత్తరప్రదేశ్ పోర్టల్ అభివృద్ధికి దోహదం చేసింది. రాష్ట్ర నిధులను వెచ్చించి వేయి హై ప్లో నాసల్ కానులాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వీటిలో ఐదువందల హెచ్ ఎఫ్ ఎన్ సిలను ఏర్పాటు చేసి వాటిని అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నారు.
****
(Release ID: 1651842)
Visitor Counter : 207