మంత్రిమండలి
మంచి నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు జపాన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది
प्रविष्टि तिथि:
02 SEP 2020 4:12PM by PIB Hyderabad
జపాన్ మార్కెట్ కోసం భారతీయ వస్త్రాలు, దుస్తుల నాణ్యతను మెరుగుపరచడం, పరీక్షించడం కోసం భారతదేశానికి చెందిన వస్త్రాల కమిటీ మరియు జపాన్ కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. .
సాంకేతిక వస్త్రాలతో సహా ఇతర వస్త్రాలు, దుస్తుల ఉత్పత్తులు మరియు దేశవిదేశాలలోని ఖాతాదారులు / కొనుగోలుదారులతో పరస్పరం ఆమోదయోగ్యమైన ఇతర ఉత్పత్తులను తమ తరఫున భారతదేశంలో పరీక్ష మరియు తనిఖీ సేవలు నిర్వహించడంలో సహకరించడానికి వీలుగా వస్త్రాల కమిటీని నియమించుకోడానికి జపాన్ కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ కు ఈ అవగాహనా ఒప్పందం అనుమతిస్తుంది.
*****
(रिलीज़ आईडी: 1650676)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam