ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా ఐడియాజ్ సమిట్ లో కీలకోపన్యాసాన్నిచ్చిన ప్రధాన మంత్రి

బలమైనటువంటి దేశీయ ప్రతిఘాతుకత ద్వారా ప్రపంచ ఆర్థిక ప్రతిఘాతుకత్వాన్ని సాధించవచ్చును : ప్రధాన మంత్రి

‘ఆత్మనిర్భర్ భారత్’ కు పిలుపునివ్వడం ద్వారా భారతదేశం ఒక సమృద్ధమైన మరియు ప్రతిఘాతుకమైన ప్రపంచం యొక్క ఆవిర్భావానికి తోడ్పాటునిస్తున్నది : ప్రధాన మంత్రి


భారతదేశం లో పెట్టుబడి కి ఒక మెరుగైనటువంటి కాలం ఇంతకు ముందు ఎన్నడూ లేదు : ప్రధాన మంత్రి

భారతదేశం అవకాశాల గడ్డ గా ఉదయిస్తున్నది : ప్రధాన మంత్రి


విశ్వమారి అనంతరం మళ్లీ వేగవంతం గా ప్రపంచం పుంజుకోవడం లో ఒక ముఖ్య పాత్ర ను భారతదేశం యుఎస్ భాగస్వామ్యం పోషించగలుగుతుంది : ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2020 9:25PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఇండియా ఐడియాజ్ సమిట్ లో కీలకోపన్యాసాన్నిచ్చారు.  ఈ శిఖర సమ్మేళనాన్ని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) నిర్వహిస్తున్నది.  ‘ఒక మెరుగైన భవిష్యత్తు ను నిర్మించడం’ అనేది ఈ సంవత్సరం శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉన్నది.

ఈ సంవత్సరం లో యుఎస్ఐబిసి 45వ వార్షికోత్సవ సందర్భం కావడం తో ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.  భారతదేశం- యుఎస్ ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోతున్నందుకు గాను యుఎస్ఐబిసి నాయకత్వానికి ఆయన  ధన్యవాదాలు పలికారు.

బలమైన దేశీయ ఆర్థిక సామర్థ్యం ద్వారా ప్రపంచ ఆర్థిక ప్రతిఘాతుకత


వృద్ధి కార్యసూచీ యొక్క కేంద్రస్థానం లో పేదల ను మరియు బలహీన వర్గాల వారిని నిలపవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.  ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ మాదిరి గానే ‘జీవించడం లో సౌలభ్యాని’కి అంతే ప్రాముఖ్యం ఉందని ఆయన నొక్కిచెప్పారు.  వెలుపలి నుండి తగిలే ఘాతాల కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతిఘాతాన్ని ఇవ్వగలగడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని విశ్వమారి మనకు గుర్తు చేసింది, దీనిని బలమైన దేశీయ ఆర్థిక శక్తియుక్తుల తో సాధించవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశం ‘ఆత్మ నిర్భర్ భారత్’ కు పిలుపు నివ్వడం ద్వారా, ఒక సంపన్నమైనటువంటి మరియు ప్రతిఘాతుకత్వం కలిగినటువంటి ప్రపంచానికి తన వంతు తోడ్పాటు ను అందిస్తున్నదని ఆయన ఉద్ఘాటించారు.

దాపరికానికి తావు ఇవ్వకపోవడం, అవకాశాల తో మరియు ఐచ్ఛికాల తో కూడినటువంటి ఒక పరిపూర్ణ మేళనాన్ని ఇవ్వజూపుతున్న భారతదేశం


భారతదేశం పట్ల ప్రపంచవ్యాప్తం గా ఒక ఆశాపూర్ణ దృష్టి నెలకొందని, దీనికి కారణం భారతదేశం బాహాటత్వం, అవకాశాలు, ఇంకా అభిమతాల యొక్క పరిపూర్ణమైనటువంటి మేళనాన్ని ఇవ్వజూపుతుండడమే అని ప్రధాన మంత్రి అన్నారు. 

గడచిన ఆరు సంవత్సరాల లో, మన ఆర్థిక వ్యవస్థ ను మరింత ఆంక్షారహితమైందిగాను, సంస్కరణప్రధానమైందిగాను తీర్చిదిద్దే ప్రయాసలు తీసుకోవడం జరిగింది అని ఆయన తెలిపారు.  సంస్కరణ లు స్పర్ధాత్మకత కు పూచీ పడ్డాయని, పారదర్శకత్వాన్ని పెంచేందుకు, డిజిటైజేశన్ విస్తరణ కు, విధాన సంబంధి ఇతోధిక స్థిరత్వానికి, ఇంకా నూతన ఆవిష్కరణ లు మరింత అధికం గా రావడానికి కూడా సంస్కరణలు కారణం అయ్యాయని ఆయన వివరించారు. 

ఇటీవలి ఒక నివేదిక ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,  పట్టణ ప్రాంత ఇంటర్ నెట్ వినియోగదారుల కంటే గ్రామీణ ప్రాంత ఇంటర్ నెట్ వినియోగదారులు అధికం గా ఉన్నారని పేర్కొన్నారు.  భారతదేశాన్ని అవకాశాల గడ్డ గా ఆయన ప్రశంసిస్తూ,  దేశం లో ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్న వారు ప్రస్తుతం ఇంచుమించు యాభై కోట్ల మంది ఉన్నారని, అంతే కాకుండా మరో యాభై కోట్ల కు పైగా మంది ని ఇంటర్ నెట్ తో జోడించడం జరుగుతోందని ఆయన తెలిపారు.  5 జి, బిగ్ డేటా ఎనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ ఇంకా ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ ల వంటి పరిశోధన కు, అభివృద్ధి కి అవకాశాలు కల సాంకేతిక విజ్ఞానాల సంబంధి రంగంలో సైతం అవకాశాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు.


వివిధ రంగాల లో పెట్టుబడి కి విస్తారమైనటువంటి అవకాశాలు


భారతదేశం లో భిన్న రంగాల లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  వ్యవసాయ రంగం లో ఇటీవల చేపట్టిన చరిత్రాత్మకమైనటువంటి సంస్కరణల ను గురించి ఆయన వివరిస్తూ, వ్యవసాయ సాధకాలు మరియు యంత్రసామగ్రి, వ్యవసాయ సరఫరా వ్యవస్థ, ఫూడ్ ప్రోసెసింగ్ సెక్టర్, మత్స్య పరిశ్రమ ఇంకా సేంద్రియ ఉత్పత్తుల వంటి రంగాల లో పెట్టుబడి కి అవకాశాలు ఉన్నాయన్నిరు.  భారతదేశం లో ఆరోగ్యసంరక్షణ రంగం ప్రతి సంవత్సరం లో 22 శాతం కన్నా వడి గా ఎదుగుతోందని, వైద్య రంగం లో సాంకేతిక విజ్ఞాన సంబంధి ఉత్పత్తి, టెలి-మెడిసిన్ , రోగనిర్ధారణ లలో భారతదేశ కంపెనీల ప్రగతి ని గురించి చెప్పారు.  భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం లో పెట్టుబడి ని విస్తరించుకోవడానికి ఇదే శ్రేష్ఠమైన కాలం అని ఆయన అన్నారు.    

పెట్టుబడి పెట్టేందుకు మహత్తరమైన అవకాశాలు ఉన్న ఇతర అనేకమైనటువంటి రంగాల ను గురించి ఆయన తెలియజేశారు.  ఆయా రంగాల లో శక్తి రంగం, గృహ‌ నిర్మాణ‌ం, రహదారులు, రాజమార్గాలు ఇంకా నౌకాశ్రయాలు సహా మౌలిక సదుపాయాల కల్పన రంగం, పౌర విమానయాన రంగం వంటి వాటి ని గురించి ప్రస్తావించారు. పౌర విమానయాన రంగం లో అగ్రగామి ప్రయివేటు భారతీయ కంపెనీలు రాబోయే దశాబ్ద కాలం లోపల ఒక వేయి కి పైగా నూతన విమానాల ను ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకొన్నాయన్నారు.  ఈ విధం గా, భారతదేశం లో తయారీ సదుపాయాల ను నెలకొల్పాలని ఎంచుకొనే ఏ పెట్టుబడిదారుకు అయినా అవకాశాలనే ద్వారాలను ఆయన తెరచి ఉంచారు.  అలాగే, మెయింటెనన్స్, రిపేర్ ఎండ్ ఆపరేశన్స్ (ఎమ్ఆర్ఒ) సదుపాయాల ను స్థాపించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని సూచించారు.  రక్షణ రంగం లో పెట్టుబడి పెట్టేందుకు ఎఫ్ డిఐ గరిష్ఠ పరిమితి ని 74 శాతానికి భారతదేశం పెంచుతోంది అని, రక్షణ సామగ్రి మరియు ప్లాట్ ఫార్మ్ స్ ఉత్పత్తి ని ప్రోత్సహించడం కోసం రెండు డిఫెన్స్ కారిడార్ ల ను ఏర్పాటు చేయడమైందని తెలిపారు.  ప్రయివేటు పెట్టుబడిదారుల కు మరియు విదేశీ పెట్టుబడిదారుల కు ప్రత్యేక ప్రోత్సాహకాల ను ఇవ్వజూపుతున్నట్లు వెల్లడించారు.  అంతరిక్ష రంగం లో నవ ప్రవర్తక సంస్కరణల ను చేపడుతున్న సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు.    

ఆర్థిక రంగం లోను, బీమా రంగం లోను పెట్టుబడి ని ప్రధాన మంత్రి ఆహ్వానిస్తూ, భారతదేశం బీమా రంగం లో ఎఫ్ డిఐ తాలూకు గరిష్ఠ పరిమితి ని 49 శాతం వరకు పెంచినట్లు, మరి బీమా మధ్యవర్తిత్వ సంస్థల లో 100 శాతం ఎఫ్ డిఐ ని అనుమతించినట్లు చెప్పారు.   ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం మరియు జీవిత బీమా రంగాల లో బీమా రక్షణ పరిధి ని పెంచేందుకు ఇంతవరకు ఉపయోగించుకోనటువంటి అవకాశాలు అనేకం గా ఉన్నాయి అని ఆయన వివరించారు. 


భారతదేశం లో పెరుగుతున్న పెట్టుబడులు


వరల్డ్ బ్యాంకు యొక్క ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానాల లో భారతదేశం యొక్క ఎదుగుదల ను గురించి ప్రధాన మంత్రి సంభాషించారు.  ప్రతి సంవత్సరం భారతదేశం ఎఫ్ డిఐ పరం గా రికార్డు స్థాయి లో ఉన్నత స్థానాని కి ఎదుగుతున్నదని ఆయన నొక్కిచెప్పారు.  2019-20 లో భారతదేశం లోకి ఎఫ్ డిఐ ప్రవాహాలు 74 బిలియన్ డాలర్ లుగా ఉన్నాయని, అది అంతక్రితం సంవత్సరం కంటే 20 శాతం అధికమన్నారు.  ప్రపంచవ్యాప్త వ్యాధి కాలం లో కూడాను, భారతదేశం ఈ ఏడాది ఏప్రిల్ ఇంకా జూలై మాసాల మధ్య కాలం లో 20 బిలియన్ డాలర్ లకు మించి విదేశీ పెట్టుబడి ని ఆకర్షించింది అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు.  

భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన కాలం

 
ప్రపంచం యొక్క ఆర్థిక మెరుగుదల కు ఏ శక్తి అవసరమో అది భారతదేశం వద్ద ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. 
భారతదేశం ఉన్నతి కి అర్థం విశ్వసించదగ్గ ఒక దేశం తో వ్యాపారావకాశాల లో పెరుగుదల, అంతకంతకు పెరుగుతున్నటువంటి బాహాటత్వం తో ప్రపంచ ఏకీకరణం లో పెరుగుదల, శ్రేణి ని ఇవ్వజూపే ఒక విపణి అందుబాటు లోకి రావడం తో స్పర్ధాత్మకత లో పెరుగుదల, ఇంకా నైపుణ్యం కల మానవ వనరుల లభ్యత తో పెట్టుబడి కి దక్కే ప్రతిఫలాల్లో పెరుగుదల అని ఆయన వివరించారు. 

భారతదేశం మరియు యుఎస్ఎ స్వాభావిక భాగస్వాములు అని ఆయన అంటూ,  విశ్వమారి అనంతర కాలం లో ప్రపంచం మళ్లీ మెరుగుపడడం లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను ఈ యొక్క భాగస్వామ్యం పోషించగలుగుతుంది అన్నిరు.  అమెరికా పెట్టుబడిదారుల కు సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ, భారతదేశం లో పెట్టుబడి పెట్టేందుకు ఒక ఉత్తమతర కాలం ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు సుమా అన్నారు.


***


(Release ID: 1640713) Visitor Counter : 260