ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ లాల్ జీ టండన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 JUL 2020 11:19AM by PIB Hyderabad
ఈ రోజు న మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ లాల్ జీ టండన్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
రాజ్యాంగ సంబంధ వ్యవహారాల లో శ్రీ టండన్ కు చక్కని ఎరుక ఉండేది అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
‘‘శ్రీ లాల్ జీ టండన్ ను సమాజాని కి సేవ చేయడం లో ఆయన యొక్క అవిశ్రాంత ప్రయాసల కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఒక కుశల పరిపాలకుని గా తనదైన ముద్ర ను వేశారు. ఎల్లవేళ ల ప్రజా సంక్షేమాని కే ఆయన పెద్ద పీట ను వేశారు. ఆయన కన్నుమూత తో నేను క్షోభ కు గురి అయ్యాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
పూర్వ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ తో శ్రీ టండన్ కు గల సుదీర్ఘ అనుబంధాన్ని కూడా ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.
***
(रिलीज़ आईडी: 1640155)
आगंतुक पटल : 278
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam