హోం మంత్రిత్వ శాఖ
దుకాణాలు తెరిచేందుకు దేశీయాంగ శాఖ అనుమతిపై వివరణ
Posted On:
25 APR 2020 11:34AM by PIB Hyderabad
కోవిడ్-19 నేపథ్యంలో దుకాణాలు తెరవడానికి అనుమతించే దిగ్బంధం చర్యలపై నవీకరించిన ఏకీకృత మార్గదర్శకాల్లో సవరణలపై దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిన్న ఉత్తర్వులు (https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1618049) జారీ చేసింది. దీని ప్రకారం...
గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోనివి మినహా అన్ని దుకాణాలు తెరవవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అన్ని స్వతంత్ర, ఇరుగుపొరుగు, నివాస సముదాయాల్లోని దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంది. అయితే, మార్కెట్లు/మార్కెట్ సముదాయాలు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలు విక్రయించేందుకు మాత్రమే అనుమతి ఉంది. మద్యం, సంబంధిత ఇతర విక్రయాలపై కోవిడ్-19 నిర్వహణపై జాతీయ ఆదేశాల ప్రకారం నిషేధం కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నియంత్రణ మండళ్లుగా ప్రకటించిన పట్టణ/గ్రామీణ ప్రాంతాల్లో వీటిని తెరవడంపై నిషేధం ఉంటుంది.
*****
(Release ID: 1618119)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam