వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మద్దతు ధరకే నేరుగా రైతుల నుండి కాయధాన్యాలు మరియు నూనె గింజల సేకరణ

Posted On: 18 APR 2020 6:03PM by PIB Hyderabad

నాఫెడ్(ఎన్ఏఎఫ్ఇడి) మరియు ఎఫ్సిఐ వంటి కేంద్రీయ నోడల్ ఏజెన్సీల ద్వారా భారత ప్రభుత్వం మద్దతు ధరకు(ఎంఎస్పి) రైతుల నుండి నేరుగా  పంట కొనుగోళ్ళు చేపట్టాలని నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో 2020-21 రబీ సీజనుకు మద్దతు ధరకు కొనుగోళ్ళను చేపట్టింది. కోవిడ్-19 కారణంగా   విధించిన లాక్డౌన్ సమయంలో సమయానికి రైతుల వద్ద కొనుగోలు చేసి వారికి సహాయం చేయడంతోపాటు కోవిడ్ నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించేలా రైతులకు సూచనలు చేయడం జరిగింది.

కర్ణాటక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో రబీ సీజన్ 2020-21 సంవత్సరానికి మద్దతు ధర పథకం(పిఎస్ఎస్) క్రింద కాయధాన్యాలు  మరియు నూనె గింజల సేకరణ ఇప్పటికే జరుగుతోంది. 16 ఏప్రిల్ 2020 నాటికి రు.784.77 కోట్ల విలువ చేసే 1,33,987.65 మి.టన్నుల కాయధాన్యాలు మరియు 29,264.14 మి.టన్నుల నూనె గింజలను నాఫెడ్/ఎఫ్సిఐ కొనుగోలు చేసింది. దీని వలన 1,14,338 మంది రైతులు లబ్ది పొందారు.  ఈ లాక్డౌన్ సమయంలో 97,337.35 మి.టన్నుల రబీ కాయధాన్యాలు మరియు నూనె గింజలను పిఎస్ఎస్ పథకం క్రింద సేకరించడం జరిగింది.

కందులను ధరల స్థిరీకరణ నిధి(పిఎస్ఎఫ్) క్రింద నాఫెడ్ రైతుల నుండి సేకరిస్తున్నది మరియు  వాటిని నిలువ చేయటం జరుగుతున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణాలో ఖరీఫ్ 2019-20 సీజనుకు కందుల సేకరణ జరుతున్నది. ఈ లాక్డౌన్  సమయంలో  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2019-20కి  మొత్తం 29,328.62 మి.టన్నులకు గాను 5,32,849 మి.టన్నుల కందుల సేకరణ జరిగింది.

లాక్డౌన్ ప్రకటించినందు వలన రాజస్థాన్ కోటా డివిజన్లో కాయధాన్యాలు మరియు నూనె గింజల సేకరణ ఆగిపోయింది. 15-04-2020 నుండి కోటా డివిజన్లోని 54 కేంద్రాలు పనిచేయడం ప్రారంభించగా త్వరలోనే మరిన్ని సేకరణ కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. రాజస్థాన్లోని మిగతా డివిజన్లలో సేకరణ మే 2020 మొదటి వారం నుండి ప్రారంభించుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన సమాచారం ప్రకారం రోజుకు గరిష్టంగా 10 రైతుల నుండి సేకరణ జరుగుతుంది.

హర్యానాలోని 163 కేంద్రాల్లో 15-04-2020 నుండి ఆవాలు మరియు అపరాల సేకరణ మొదలైంది. సామాజిక దూరం పాటించేందుకు రోజుకు  పరిమింతంగా రైతులను  పిలవటం జరుతోంది. మొదటి రెండు రోజుల్లో సుమారు 10,111 మంది రైతుల నుండి సుమారు 27,276.77 మి.టన్నుల  ఆవాల సేకరణ జరిగింది.  మధ్యప్రదేశ్లో అపరాలు, మసూర్ మరియు ఆవాల సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, రైతులను సేకరణ కేంద్రాలకు వారి పంటలను తీసుకురావలసిందిగా సమాచారం ఇవ్వబడింది.(Release ID: 1615894) Visitor Counter : 47