కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అత్యవసరమైన ఆహార సరఫరా విషయంలో దృష్టి పెట్టాలని పోస్టల్ శాఖ ను ఆదేశించిన శ్రీ రవి శంకర్ ప్రసాద్

సుదూర ప్రాంతాలకు సైతం నిత్యావసర వస్తువులను అందించడంలో ఇండియా పోస్ట్ ఒక ఆశాదీపం

Posted On: 18 APR 2020 5:02PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పోస్టాఫిసుల ద్వారా కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రజలకు తన సేవల ద్వారా అండగా ఉండడానికి పోస్టల్ శాఖ పూర్తి సన్నద్ధం అయింది. కేంద్ర కమ్యూనికేషన్లున్యాయఎలక్ట్రానిక్స్ఐటీ శాఖల మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ రాష్ట్రాల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరళ్ళుచీఫ్ జనరల్ మేనేజర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజల అవసరాలను తీర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. సుదూర ప్రాంతాలలో ఉన్న లక్షలాది ప్రజలకు నిత్యావసర వస్తువులు చేర్చడంలో పోస్టల్ శాఖ సిబ్బంది కరోనా యోధుల్లా ఒక ఆశజ్యోతిగా ఉండాలని కేంద్ర మంత్రి అన్నారు. 

 

ఆహారంపొడి సరుకు పంపిణీ:

దేశవ్యాప్తంగా పేదలకుఅట్టడుగున ఉన్న ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యవసరమైన ఆహార పదార్థాలు అందేలా చూడాలని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు.

మురికి వాడల్లో ప్రజలకువలస కార్మికులకు ఆహార పదార్థాలుపొడి ఆహరం పంపిణీ చేసేందుకు పోస్టల్ శాఖ ఉద్యోగులు తమ పొదుపు నిధులను సమీకరించారు. గత కొన్ని రోజులుగా సుమారు లక్ష ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ముఖ్యంగా నోయిడాఘజియాబాద్లక్నోప్రయాగరాజ్, ఫైజాబాద్ ప్రాంతాలతో సహా యూపీ లోనే సుమారు 50 వేల ఆహార పొట్లాలను అవసరమైన పేదప్రజలకు పంపిణీ చేశారు. బీహార్ లో 16,000 ఆహార పొట్లాలతో పాటుసబ్బులుమాస్కులుశానిటైజెర్లుగ్లోవ్స్ కలిగిన 11,500 పొట్లాలు స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. తెలంగాణాలో ఈ లాక్ డౌన్ సందర్బంగా పోస్టల్ మెయిల్ వ్యాన్ల ద్వారా అవసరమైన వస్తువులను సరఫరా చేసారు. హైదరాబాద్ నగరంలో ఆహార పదార్థాలను సేకరించి 1750 కుటుంబాలకు పంపిణీ చేసారు. నాగపూర్ లో 1500 మంది వలస కార్మికులకు ఆహార పదార్థాల పొట్లాలను పోస్టల్ సిబ్బంది పంపిణీ చేసారు. పంజాబ్ లో 'ఫుడ్ ఆన్ వీల్స్ను ప్రారంభించి  నిర్మాణ రంగం కార్మికులుతోపుడు బళ్ల వ్యాపారులకురిక్షా కార్మికులతో పాటు పీజీఐ రోగుల సహాయకులుచండీగఢ్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు పోస్టల్ సిబ్బంది. ఆహార పదార్థాలతో పాటు ముంబై ధారవి ప్రాంతంలో మాస్కులుశానిటైజెర్లను కూడా పంపిణీ చేశారు. 

 

ఔషధ సేవ  

ఈ లాక్ డౌన్ సందర్బంగా మామూలు మందులు పెద్దగా సమస్య కానప్పటికీక్యాన్సర్కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధుల ఔషధాల లభ్యత అవసరమైన వారికి అందుబాటులో ఉండడం కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా ఎక్కడో నగరాల్లో తమ బంధువులుపిల్లలతో తెప్పించుకునే వారికి మరింత ఇబ్బంది కలిగే సమయం ఇది. అటువంటి వారి విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రికి సామాజిక మాధ్యమాల ద్వారా  పలు సలహాలు అందాయి. అటువంటి ప్రాణ రక్షక ఔషధాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్టల్ శాఖ అవసమైన వారికి అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. కొన్ని ఉదాహరణలు ప్రముఖంగా ప్రస్తావిస్తే...  ఉత్తరాఖండ్ లో మారుమూల ప్రాంతమైన గౌచర్ లో ఉన్న ఆర్మీలో పని చేసి రిటైరైన ఎంపీ జోషి తన కుమారుడు సుశీల్ జోషి నుండి చేరాల్సిన అత్యవసర ఔషధాలను శీఘ్రగతిలో పోస్టల్ శాఖ చేర్చింది. పుణేలో మైలాబ్ ఆర్డర్ మేరకు కోవిడ్ టెస్టింగ్ కిట్లను గుజరాత్ లో అంకలేశ్వర్ కు 24 గంటలలో చేర్చారు. అలాగే డీఫైబ్రిలేటర్లు (ప్రమాద స్థితిలో ఉన్న గుండె స్పందనలను ప్రేరేపించే పరికరం) ను చెన్నై నుండి లక్నో లో ఉన్న యూపీ మెడికల్ సప్లైస్ కార్పొరేషన్ కి 36 గంటల్లో చేరవేశారు పోస్టల్ సిబ్బంది. ఇంకా పుదుచ్చేరిఒడిశాగుజరాత్కోలకతారాంచి ఇలా పలు ప్రాంతాలలో  వెంటిలేటర్లుఔషధాలువైద్య పరికరాలను సకాలంలో పోస్టల్ శాఖ గమ్యాలకు చేరవేసింది.

 

గడప వద్దకే ఆర్ధిక సేవలు:

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఎఇపిఎస్) ను ఉపయోగించి ఖాతా తెరవడానికి,  ముఖ్యంగా పేద ప్రజల ఇంటి వద్ద నగదు పొందే (విత్ డ్రా) సౌకర్యం  కల్పిస్తోంది పోస్టల్ నెట్‌వర్క్ బ్యాంకు. వివిధ పెన్షన్ పథకాలుఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం  కింద తమకు పంపిన ప్రత్యక్ష నగదు బదిలీ మొత్తాలను ఉపసంహరించుకోవడంలో ఇది ప్రజలకు సహాయపడింది. ఇటీవల పిఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద సహాయక చర్యలను ప్రకటించింది. ఈ సదుపాయం సామాన్య ప్రజలకు ప్రయోజనకారిగా ఉంది.  అందువల్ల ఒక్క ఏప్రిల్ 13నే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ గతంలో కన్నా అత్యధికంగా లావాదేవీలను నమోదు చేసిందిఅంటే ఆ ఒక్క రోజు రూ.22.82 కోట్ల విలువైన 1.09 లక్షల నగదు లావాదేవీలను జరిపింది.

మరి కొన్ని ఉదాహరణలను చుస్తేషిల్లాంగ్ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఖాతా ప్రారంభ శిబిరానికి సమీప గ్రామాలుకొండ ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులందరినీ అక్కడ ఉండే అవకాశాన్ని కల్పించింది స్థానిక యంత్రంగం. వారందరికీ మాస్కులు కల్పించడమే కాకుండా సామజిక దూరం పాటించే ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాంకు సమకూర్చిన ఖాతాల ద్వారా వలస కార్మికులంతా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహాయ పథకాలు అందుకోగలిగారు. జమ్మూకాశ్మీర్లేహ్గుజరాత్తెలంగాణకర్ణాటకతో పాటు గిరిజన ప్రాంతాలున్న ఝార్ఖండ్బీహార్మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పింఛన్లను ఇంటి గడప వద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాట్లు చేసింది పోస్టల్ శాఖ. దీని వల్ల ఒంటరి మహిళలుదివ్యాంగులువృద్ధులు పింఛన్ దారులకు చాల ప్రయోజనం చేగూరింది. 

                                                          ******  



(Release ID: 1615860) Visitor Counter : 199