భారత ఎన్నికల సంఘం
కోవిడ్ నేపథ్యంలో ఏడాది కాలానికి 30 శాతం ప్రాథమిక జీతాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్న సీఈసీ, ఈసీలు
అనిశ్చిత సమయంలో సర్కారు ఆర్థిక తోడ్పాటు అందించడమే ధ్యేయంగా నిర్ణయం
Posted On:
13 APR 2020 12:18PM by PIB Hyderabad
కోవిడ్19 వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం భారత్‌తో సహా మిగతా ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థల వారు వివిధ రకాల చర్యలను తీసుకుంటున్నారు. దీనికి తోడు ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థపై కూడా కోవిడ్ ప్రభావం కనిష్టంగా ఉండేలా చేసేందుకు గాను సర్కారు, ఆయా సంస్థలు వివిధ చర్యలను చేపడుతున్నాయి. ప్రభుత్వం మరియు సివిల్ సొసైటీ సంస్థలు తీసుకుంటున్న వివిధ రకాల చర్యలకు విస్తారంగా ఆర్థిక వనరులు అవసరమవుతాయి. ఇతర వనరుల నుండి సహకారం అందడంతో పాటు ఖజానాపై జీతాల భారాన్ని కొంత మేర తగ్గించడం వంటివి కూడా ఇందుకు కొంత మేర సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మరియు ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు స్వచ్ఛందంగా తమ మూల జీతంలో 30 శాతాన్ని ఏడాది కాలం పాటు తగ్గించుకొని సర్కారుకు ఆర్థికంగా కొంత మేర సహకరించాలని నిర్ణయించినట్టుగా కమిషన్ తెలిపింది. ప్రస్తుత ఏప్రిల్ నెల నుంచి ఏడాది కాలం పాటు వీరు కేవలం 70 శాతం మేర మూల జీతాన్ని మాత్రమే తీసుకోనున్నారు.
(Release ID: 1613910)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam