ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ చెల్లింపుల విప్లవంలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ


ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు

లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు పెరుగుదల: 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్ల లావాదేవీల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 24,162 కోట్లకు పెరిగిన వార్షిక లావాదేవీల పరిమాణం

2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.0.07 లక్షల కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.314 లక్షల కోట్లకు పెరిగిన లావాదేవీల విలువ: ఇది దాదాపు 4,000 రెట్ల పెరుగుదల

ప్రస్తుతం 11 దేశాల్లో పనిచేస్తున్న యూపీఐ: దేశ సరిహద్దులకు అతీతంగా చేసే డిజిటల్ చెల్లింపులకు ప్రపంచ వేదికగా ఆవిర్భావం

యూపీఐతో కలసి పని చేస్తున్న బ్యాంకుల సంఖ్య 2016–17 ఆర్థిక సంవత్సరంలో 44 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 703కి పెరుగుదల: ఇది ప్రపంచవ్యాప్తంగా యూపీఐ విస్తరించడానికి, ఆర్థిక సమ్మిళిత్వానికి వీలు
కల్పిస్తోంది

విస్తరించదగిన, సమ్మిళితమైన, ఆవిష్కరణాత్మకమైన డిజిటల్ పౌర మౌలిక వసతులను నిర్మించడంలో భారత్ ముందంజలో ఉందని తెలియజేస్తోన్న యూపీఐ విజయం

प्रविष्टि तिथि: 24 AUG 2026 1:57PM by PIB Hyderabad

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐనియంత్రణలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐద్వారా 2016 ఆగస్టు 25న ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐపదేళ్లు పూర్తి చేసుకుందిభారతీయ చెల్లింపుల వ్యవస్థకు ప్రధాన ఆధారంగాకీలకమైన శక్తిగా యూపీఐ ఆవిర్భవించింది.

దశాబ్దానికి పైగా నిర్వహిస్తున్న కార్యకలాపాల ద్వారా అసాధారణమైన స్థాయినివేగాన్ని యూపీఐ ప్రదర్శించిందివార్షిక లావాదేవీల పరిమాణం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్లు ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందిఇది లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్ల పెరుగుదలను సూచిస్తుందిఅలాగే లావాదేవీల విలువ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.0.07 లక్షల కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.314 లక్షల కోట్లకు పెరిగిందిఫలితంగా లావాదేవీల విలువలో 4,000 రెట్లకు పైగా పెరుగుదల నమోదయింది.

భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక వసతులకు (డీపీఐసంబంధించి అత్యంత విజయవంతమైన ప్రధానాధారాల్లో ఒకటిగా యూపీఐ ఆవిర్భవించిందిఇది ఒకే అప్లికేషన్ ద్వారా వినియోగదారు నుంచి వినియోగదారుకువినియోగదారు నుంచి వ్యాపారికి మధ్య లావాదేవీలను సాధ్యం చేసే పరస్పర అనుసంధానమైనరియల్ టైం చెల్లింపుల వేదికను అందిస్తుందిప్రస్తుతం ఇది మిలియన్ల మంది వినియోగదారులు ప్రాధాన్యమిచ్చే చెల్లింపుల విధానంగా నిలిచి భారతదేశంలో లావాదేవీలు జరిపే విధానాన్ని మార్చేసిందిడిజిటల్ అంతరాన్ని తగ్గించడంఆర్థిక సమ్మిళిత్వాన్ని ముందుకు తీసుకెళ్లడండిజిటల్ ఆర్ధిక సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యక్తులకువర్గాలకు సాధికారత కల్పించడంతో పాటు విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా యూపీఐ ప్రోత్సహించింది.

ఏకకాలంలో పరిమాణంవిలువ రెండింటిలోనూ సాధించిన విస్తరణ... నిత్యం జరిగే రిటైల్ చెల్లింపులకు మద్దతు ఇవ్వడంలో యూపీఐ పోషిస్తున్న బలమైన పాత్రను స్పష్టం చేస్తుందిమునుపెన్నడూ లేని విధంగా యూపీఐ సాధించిన స్థాయికివిశ్వసనీయతకువివిధ ఆపరేటింగ్ వ్యవస్థల్లో సులభంగా పనిచేసే విధానానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందిలావాదేవీల పరిమాణం పరంగా దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్గుర్తించిందిఇది విస్తరించగలసమ్మిళితమైనవినూత్నమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించడంలో భారతదేశ నాయకత్వాన్ని స్పష్టం చేస్తోంది. 

I.  దశాబ్దంలో సాధించిన ప్రగతి


 

UPI AT A GLANCE: KEY STATISTICS (NPCI)

Annual Transaction Volume (FY2016-17)

1.78 Crore

Annual Transaction Volume (FY2025-26)

24,162 Crore

CAGR

188%

Annual Transaction Value (FY2016-17)

0.07 Lakh Crore

Annual Transaction Value (FY2025-26)

314 Lakh Crore

CAGR

155%

YoY Volume Growth (2025-2026)

30%

YoY Value Growth (2025-2026)

21%

Daily Average Transactions (2026)

66 Crore

Record Monthly Volume (July 2026)

2,366 Crore

Record Monthly Value (July 2026)

29.88 Lakh Crore

Banks Live on UPI (As on July 2026)

741 Banks

Banks at Launch (April 2016)

21 Banks

First Month Transactions (August 2016)

90,000

Share of UPI in India's Digital Payments

84% (FY2025-26)

Share of Global Real-Time Volume

49% of World (2025)

Countries Accepting UPI

11 Countries


 

వార్షిక లావాదేవీల పరిమాణం (ఆర్ధిక సంవత్సరం 2016-17 నుంచి ఆర్థిక సంవత్సరం 2026-27*)

image.png

Fig 1: యూపీఐ ఆర్థిక లావాదేవీల పరిమాణం కోట్లలో           * 2026 జులై 31 వరకు

 

వార్షిక లావాదేవీ విలువ (ఆర్థిక సంవత్సరం 2016-17 నుంచి ఆర్థిక సంవత్సరం 2026-27*)

image.png

Fig 2: యూపీఐ వార్షిక లావాదేవీ విలువ రూలక్షల కోట్లలో  * 2026 జులై 31 వరకు

 

II.  నెలవారీ ప్రగతి, 2026

యూపీఐ వృద్ధి ప్రయాణంలో 2026 సంవత్సరం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2026 మే నెలలో నెలవారీ లావాదేవీల పరిమాణం తొలిసారిగా 2,300 కోట్ల మార్కును దాటి 2,320 కోట్ల లావాదేవీలకు చేరుకుందిఇది యూపీఐ వినియోగం సరి కొత్త స్థాయికి చేరుకుందని సూచిస్తుందిఈ వేగాన్ని కొనసాగిస్తూ... 2026  జులైలో 2,366 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయిఇది దశాబ్దంగా కొనసాగుతున్న యూపీఐ ప్రయాణంలో అత్యధిక నెలవారీ లావాదేవీల పరిమాణం.

III.  వ్యవస్థ సామ్థర్యంబ్యాంకులుయాప్‌లుభౌగోళికాంశాలు

అపూర్వమైన రీతిలో యూపీఐలో బ్యాంకుల భాగస్వామ్యం

ప్రారంభమైన నాటి నుంచి సంస్థాగత భాగస్వామ్యంలో స్థిరంగావిస్తృతమైన రీతిలో సాధించిన విస్తరణను యూపీఐ ప్రదర్శిస్తోందికార్యకలాపాలు ప్రారంభమైన మొదటి ఏడాదైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో యూపీఐలో చురుగ్గా ఉన్న బ్యాంకుల సంఖ్య 44గా ఉంటే అది 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 703 బ్యాంకులకు పెరిగిందివీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులుప్రైవేట్ బ్యాంకులుచిన్న ఫైనాన్స్ బ్యాంకులుపేమెంట్ బ్యాంకులుసహకార బ్యాంకులు ఉన్నాయిఇది యూపీఐ భౌగోళిక విస్తరణకు వీలు కల్పిస్తోంది.

ప్రతి బ్యాంకు రెమిటర్ పీఎస్‌పీ (బయటకు వెళ్లే లావాదేవీలను ప్రాసెస్ చేయడంమరియు/లేదా బెనిఫిషియరీ పీఎస్‌పీ (నిధులను స్వీకరించేది)గా పనిచేస్తుందిదీనిలో భాగస్వాములైన వారి పనితీరును కొలమానాలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది.

image.png

Fig 3: యూపీఐలో భాగస్వాములైన బ్యాంకుల సంఖ్య (ఆర్థిక సంవత్సరం 2017–2026)

 IV.  లావాదేవీ విభజనపీ2సీ పీ2ఎం విశ్లేషణ

వివిధ చెల్లింపు రకాల పరిమాణంవిలువ మధ్య స్పష్టమైన అంతరాన్ని యూపీఐ చెల్లింపులపై జరిగిన ఓ విశ్లేషణ తెలియజేస్తోందిమొత్తం లావాదేవీల పరిమాణంలో వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎంజరిగిన లావాదేవీలు 63 శాతం వాటాను కలిగి ఉన్నాయిఇది తరచుగా తక్కువ విలువ ఉన్న రిటైల్ చెల్లింపుల కోసం యూపీఐను ఎక్కువగా ఉపయోగించడాన్ని తెలియజేస్తోందిదీనికి విరుద్ధంగాలావాదేవీల విలువలో వ్యక్తి నుంచి వ్యక్తికి(పీ2పీజరిపే లావాదేవీలు 71% వాటాతో ఆధిక్యంలో ఉన్నాయిఇది వ్యక్తుల మధ్య అధిక-విలువ కలిగిన నగదు బదిలీల కోసం వాటి వినియోగాన్ని సూచిస్తుందిఈ వ్యత్యాసమే సామూహిక రిటైల్ చెల్లింపుల వేదికగాఅధిక విలువ ఉన్న నిధుల బదిలీలకు విశ్వసనీయమైన మార్గంగా యూపీఐ పోషిస్తున్న ద్విపాత్రాభినయాన్ని తెలియజేస్తోంది.

 

 

Fig 4: యూపీఐ పీ2పీ వర్సెస్ పీ2ఎం విభజన పరిమాణంవిలువ

టికెట్ పరిమాణం ప్రకారం ఆధిక్యంలో ఉన్న లావాదేవీల పంపిణీసూక్ష్మ చెల్లింపులు

రోజువారీ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వినియోగం ఎంతగా పెరిగిందో 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం 24,162 కోట్ల లావాదేవీలు తెలియజేస్తున్నాయిముఖ్యంగా వ్యాపారుల విభాగంలో ఇది బాగా విస్తరించిందిపీ2ఎం లావాదేవీల్లో అధిక శాతం చిన్న మొత్తాలే ఉంటున్నాయివీటిలో 86 శాతం లావాదేవీలు రూ. 500 లోపే ఉన్నాయిఓ వైపు పెద్ద మొత్తాల లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ చిల్లర వ్యాపారాల్లో యూపీఐ ఎంతగా భాగమైందో ఇది స్పష్టం చేస్తోందిఅలాగే పీ2పీ చెల్లింపుల్లో కూడా చిన్న మొత్తాల వినియోగం విస్తృతంగా ఉంది(59 శాతం లావాదేవీలు రూ.500 లోపే ఉన్నాయి). అదే సమయంలో రూ.500కి పైబడి జరిగే లావాదేవీలు 41 శాతం ఉండటం విశేషంనిత్యం జరిపే సాధారణ చెల్లింపులతో పాటు పెద్ద మొత్తాల బదిలీలకు కూడా యూపీఐ ఎంత అనుకూలంగా మారిందో ఇది తెలియజేస్తోంది.

 image.png

Fig 5: టిక్కెట్టు పరిమాణం ఆధారంగా యూపీఐ చెల్లింపుల విస్తరణ

V.  అంతర్జాతీయంగా యూపీఐ

దేశీయ చెల్లింపుల ఆవిష్కరణగా ప్రారంభమైన యూపీఐ ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులలో అంతర్జాతీయ ప్రమాణంగా పరిణామం చెందింది.

2025 నాటికిప్రపంచంలోని రియల్-టైమ్ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా ఉందిదీనిని ఒక మైలురాయిగా ఐఎంఎఫ్ గుర్తించింది.

ప్రతిరోజూ 66 కోట్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తూయూపీఐ ప్రపంచ చెల్లింపుల నెట్‌వర్క్‌ను అధిగమించిందితక్షణమే జరిగేసురక్షితమైనసమ్మిళితమైన డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ స్థానాన్ని పటిష్టం చేసింది.

దేశ సరిహద్దులకు అతీతంగా చేసే డిజిటల్ చెల్లింపులకు ప్రపంచ వేదికగా కూడా యూపీఐ ఆవిర్భవించిందిప్రస్తుతం యునైటెడ్ ఎమిరేట్స్ఫ్రాన్స్భూటాన్శ్రీలంకనేపాల్సింగపూర్మారిషస్ఖతార్కాంబోడియాగ్రీస్మాల్దీవులు మొత్తం 11 దేశాల్లో పనిచేస్తోంది.

 VI. ముందున్న మార్గంరాబోయే దశాబ్దంలో యూపీఐ

వచ్చే దశాబ్దంలో భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరిన్ని గణనీయమైన మార్పులను తీసుకురావడానికి యూపీఐ సిద్ధంగా ఉందికొత్త వినియోగదారులనువ్యాపారులను యూపీఐ వ్యవస్థలోకి తీసుకువస్తూ.. భవిష్యత్తులో యూపీఐ ఆధారిత ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందినిరంతర విధానపరమైన మద్దతుసాంకేతిక పురోగతితో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం ద్వారా దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది.

 

****


(रिलीज़ आईडी: 2302873) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Gujarati , Urdu , Nepali , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Tamil , Kannada , Malayalam