హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 2019 నుంచి 2026 మధ్య కాలంలో 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు

పరారీలో ఉన్న నేరస్థుల్ని తిరిగి తీసుకురావడానికి గత ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడింది; మోదీ ప్రభుత్వం పరారీలో ఉన్న నేరస్థుల అప్పగింతను 'జాతీయ ప్రాధాన్యత'గా మార్చింది

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, పరారీలో ఉన్న నేరస్థులను ఎదుర్కోవడానికి భారతదేశం ఒక సమగ్ర, నిఘా ఆధారిత మరియు సాంకేతికతతో కూడిన నమూనాను అభివృద్ధి చేసింది

పరారీలో ఉన్న నేరస్థులపై మోదీ ప్రభుత్వ వ్యూహం మూడు కీలకాంశాలపై రూపొందింది: ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, పటిష్టమైన సమన్వయం, మెరుగై దౌత్య విధానం

పరారీలో ఉన్న నేరస్థుల సమస్య దేశ సార్వభౌమత్వం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో అంతర్గతంగా ముడిపడి ఉంది

కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, పరారీలో ఉన్న నేరస్థులను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ మిషన్ మోడ్లో నిర్వహించబడింది, దీనికై అప్పగింత చట్రాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చట్టపరమైన నిబంధనలను ప్రవేశపెట్టింది


మోదీ ప్రభుత్వంలో, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 401 మంది పరారీలో ఉన్న నేరస్థులపై నోటీసులు జారీ అయ్యాయి

మోదీ ప్రభుత్వం “భారత్పోల్”ను ప్రారంభించి, 1,400 కంటే ఎక్కువ ఏజెన్సీలను ఇంటర్పోల్తో అనుసంధానించింది. తద్వారా సమాచార మార్పిడికి పట్టే సమయాన్ని 3 నుంచి 10 రోజులకు తగ్గించింది

2019లో జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ చట్టం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టాన్ని అమలులోకి తెచ్చింది

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు పరారీలో ఉన్న నేరస్థులకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ప్రవేశపెట్టాయి. తొలిసారిగా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్లు 355 మరియు 356, నిందితులు హాజరుకాని సమయంలో విచారణ జరిపేందుకు వీలు కల్పిస్తున్నాయి

పీఎంఎల్ఏ ను కఠినమైన అమలు ద్వారా, 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్థులకు చెందిన రూ.17,874 కోట్ల విలువైన ఆస్తులను మోదీ ప్రభుత్వం జప్తు చేసింది

2019 మరియు 2026 మధ్య కాలంలో దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నిధులతో సహా రూ.18,762 కోట్ల మొత్తాన్ని విజయవంతమైన తిరిగి నష్టపరిహారగా చెల్లించడమైంది

ఆపరేషన్ త్రిశూల్ ద్వారా, తమ పేర్లు, గుర్తింపులను మార్చుకుని విదేశాలలో దాక్కున్న పరారీలో ఉన్న నేరస్థులను గుర్తించడానికి మోదీ ప్రభుత్వం శాటిలైట్ సాంకే

प्रविष्टि तिथि: 04 AUG 2026 1:15PM by PIB Vijayawada

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, పరారీలో ఉన్న నేరస్థులపై నిర్ణయాత్మక వైఖరి తీసుకుంటూ, 2019 నుంచి ఇప్పటి వరకు 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను తిరిగి తీసుకువచ్చింది. పరారీలో ఉన్నవారిపై చర్యలను మరింత బలోపేతం చేయడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018లో 'ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్' (పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం)ను రూపొందించారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, పరారీలో ఉన్నవారికి వ్యతిరేకంగా భారత్ సమగ్రమైన, నిఘా ఆధారిత, సాంకేతికతతో కూడిన నమూనాను అభివృద్ధి చేసింది. ఇది వారిపై కఠినమైన చర్యలకు మార్గం సుగమం చేయడంతో పాటు, వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడాన్ని సులభతరం చేసింది.

2014కు ముందు, దేశ అప్పగింతల వ్యవస్థ పాతబడిపోయింది, భారత్ కు కేవలం 37 దేశాలతో మాత్రమే అప్పగింతల ఒప్పందాలు ఉండేవి. ఆర్థికనేరస్థులను ఎదుర్కోవడానికి లేదా వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎటువంటి ప్రత్యేక చట్టం కూడా లేదు. 2004 మరియు 2013 మధ్య కాలంలో, భారత్ సగటున ఏడాదికి కేవలం నలుగురు పరారీలో ఉన్న నేరస్థులను మాత్రమే తీసుకురాగలిగింది, కానీ 110 అప్పగింతల అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి తోడు, అసంపూర్ణ పత్రాలు, నెమ్మదిగా సాగే ప్రక్రియ అప్పగింతల ప్రక్రియను అత్యంత క్లిష్టతరం చేశాయి, దీనివల్ల తరచుగా విదేశీ న్యాయస్థానాలు అప్పగింతల అభ్యర్థనలను తిరస్కరించాయి. భారత అప్పగింతల ప్రయత్నాలు 'డబుల్ జియోపార్డీ' మరియు 'డ్యూయల్ క్రిమినాలిటీ' వంటి చట్టపరమైన, న్యాయపరమైన అడ్డంకులను కూడా ఎదుర్కొన్నాయి, ఇవి తరచుగా అప్పగింతల అభ్యర్థనల తిరస్కరణకు దారితీశాయి. అంతేకాకుండా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, ఏకీకృత వ్యూహం లేకపోవడం పురోగతికి ఆటంకం కలిగించింది. పరారీలో ఉన్నవారిపై సమాచారాన్ని పంచుకోవడం, వారి ఆచూకీని గుర్తించడం, రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయడం వంటివి కూడా నెమ్మదిగా సాగాయి.

పరారీలో ఉన్నవారిని తిరిగి తీసుకురావడానికి గత ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడింది; మోదీ ప్రభుత్వం పరారీలో ఉన్నవారిని అప్పగించడాన్ని 'జాతీయ ప్రాధాన్యత'గా మార్చింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, కేంద్ర హోం మంత్రి పరారీలో ఉన్నవారిపై మూడు అంచెల వ్యూహాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్త సంప్రదింపులు, పటిష్టమైన సమన్వయం, చురుకైన దౌత్యం. పరారీలో ఉన్న నేరస్థుల సమస్య దేశ సార్వభౌమత్వం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో అంతర్గతంగా ముడిపడి ఉందని శ్రీ అమిత్ షా అభివర్ణించారు.

మోదీ ప్రభుత్వం 2019లో ఎన్ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టాలను తీసుకువచ్చింది. 2020 నుంచి, పరారీలో ఉన్న నేరస్థులను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను మిషన్ మోడ్లో చేపట్టింది. ఫలితంగా, అమలు ప్రయత్నాలు ఇకపై కేవలం నిషేధిత సంస్థలకే పరిమితం కాలేదు. ఈ కార్యాచరణ పరిధిని వ్యక్తిగత ఉగ్రవాదులు, వారి నిర్వాహకులు, నిధుల సమీకరణ మార్గాలు, విదేశాలలో ఉన్న సహాయక వ్యవస్థలను చేర్చడానికి విస్తరించారు. ఇది పరారీలో ఉన్నవారిని పట్టుకోవడానికి, వారి నెట్వర్క్లను నిర్మూలించడానికి భారత సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసింది.

2024లో, మోదీ ప్రభుత్వం పరారీలో ఉన్న నేరస్థులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను పొందుపరుస్తూ మూడు కొత్త నేర చట్టాలను అమలు చేసింది. తొలిసారిగా, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్లు 355, 356, నిందితుల గైర్హాజరీలోనూ విచారణ జరిపేందుకు వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల, పరారీలో ఉన్న నిందితుడు హాజరు కానప్పటికీ, విచారణ నుంచి అభియోగం వరకు మొత్తం న్యాయ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలవుతుంది.

2022లో, భారతదేశం 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి ఆతిథ్యమిచ్చింది. అక్కడ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రపంచ పోలీసింగ్ యొక్క మూడు మూలస్తంభాలైన కమ్యూనికేషన్, కొలాబరేషన్ మరియు కోఆపరేషన్ (సమాచార మార్పిడి, సహకారం, సమన్వయం)ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశం మరియు ప్రపంచ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయం, అనుసంధానం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి, కేంద్ర హోం మంత్రి జనవరి 2025లో భారత్పోల్ను ప్రారంభించారు. భారత్పోల్, సీబీఐ, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయాలు (ఇంటర్పోల్ లైజన్ ఆఫీసర్ల  ద్వారా), మరియు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలను ఒకే వేదికపైకి అనుసంధానించి ఒక సమగ్ర సమాచార మౌలిక సదుపాయాన్ని సృష్టించింది. ఈ చొరవ కింద, రాష్ట్ర మరియు కేంద్ర ఏజెన్సీలకు చెందిన 1,400కు పైగా యూనిట్లు ఈ పోర్టల్ ద్వారా అనుసంధానించబడ్డాయి, ఇది సమాచార ప్రవాహం సజావుగా సాగేలా చేస్తుంది. ఫలితంగా, సీబీఐ మరియు ఇతర చట్ట అమలు సంస్థల మధ్య సమాచార మార్పిడికి పట్టే సమయం గణనీయంగా తగ్గింది. ఈ రోజుల్లో, సీబీఐ కోరిన సమాచారాన్ని ఇతర చట్ట అమలు సంస్థలు సాధారణంగా 10 నుంచి 20 రోజుల్లోగా, కొన్ని సందర్భాల్లో 3 నుంచి 10 రోజుల్లోగా పంచుకుంటున్నాయి. దీనివల్ల దర్యాప్తులు, అప్పగింత ప్రక్రియల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతోంది. ఈ దిశగా కేంద్ర హోం మంత్రి మొత్తం 5 ముఖ్యమైన సమావేశాలు నిర్వహించారు.

మోదీ ప్రభుత్వం మనీలాండరింగ్ నిరోధక చట్టం ను మరింత కఠినంగా అమలు చేసింది. పీఎంఎల్ఏ ను కఠినంగా అమలు చేయడం ద్వారా, 2019 నుంచి 2026 మధ్య పరారీలోని నేరస్థులకు చెందిన రూ.17,874 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. పరారీలో ఉన్నవారిని గుర్తించి, పట్టుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రత్యేక గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్, ఇంటర్పోల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసు ఏజెన్సీలతో నిజసమయంలో సమన్వయం చేసుకుంటూ, పరారీలో ఉన్నవారిని వేగంగా గుర్తించి, పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. సమాచార మార్పిడిని వేగవంతం చేయడానికి, సీబీఐ ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలలోనూ ఇంటర్పోల్ కాంటాక్ట్ ఆఫీసర్లను నియమించింది. ఇది పరారీలో ఉన్నవారి దర్యాప్తులో సమన్వయాన్ని, అంతర్జాతీయ సహకారాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఇటీవలి సంవత్సరాలలో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో 40, 2023లో 100, 2024లో 107, 2025లో 112, మరియు 2026లో ఇప్పటివరకు 182 రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. పరారీలో ఉన్న నేరస్థులను గుర్తించే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, పారిపోయిన నేరస్థులను జియో-లొకేట్ చేయడానికి 'ఆపరేషన్ త్రిశూల్' ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, ఇంటర్పోల్ సహకారంతో, శాటిలైట్ సమాచారం, నిఘా, డిజిటల్ ఫుట్ప్రింట్ విశ్లేషణను ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్న వారి స్థానాలను నిర్ధారించారు. పరారీలో ఉన్న చాలా మంది నేరస్థులు తవిదేశాల్లో నివసిస్థున్నప్పుడు తమ పేర్లు లేదా గుర్తింపులను మార్చుకున్నారు. అయినప్పటికీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రొఫైల్ మ్యాపింగ్ ఉపయోగించి, భారతీయ ఏజెన్సీలు వారిని గుర్తించి, పట్టుకోగలిగాయి. అప్పగింత ప్రక్రియలను వేగవంతం చేయడానికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగా కోర్టు విచారణల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ను ఉపయోగించడం ద్వారా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడింది. గత మూడేళ్లలో, 401 మంది పరారీలో ఉన్న నేరస్థులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబడ్డాయి.

సంవత్సరాల వారీ వివరాల ప్రకారం, 2019 నుంచి 2026 మధ్య 274 మంది పరారీలో ఉన్నవారిని తిరిగి తీసుకురావడం జరిగింది.

నేర వర్గం

2019

2020

2021

2022

2023

2024

2025

2026

(జూలై వరకు)

మొత్తం

 

మోసం/ఆర్థిక నేరాలు

-

-

-

01

-

04

03

01

09

ఉగ్రవాద కార్యకలాపాలు/దేశ వ్యతిరేక కార్యకలాపాలు/నార్కో టెర్రర్

-

-

01

04

02

04

05

01

17

వ్యవస్థీకృత నేరం/గ్యాంగ్స్టర్లు/దోపిడీ

01

01

-

04

03

05

14

14

42

హత్య/దోపిడీ/హింసాత్మక నేరం

06

06

03

11

07

11

09

09

62

లైంగిక నేరాలు/అత్యాచారం/పోక్సో

02

-

04

13

04

15

13

02

53

మాదకద్రవ్యాలు/ఎన్డీపీఎస్/డ్రగ్ ట్రాఫికింగ్

-

-

02

01

-

01

07

05

16

స్మగ్లింగ్/నకిలీ కరెన్సీ/సైబర్/అక్రమ రవాణా

-

-

04

02

-

02

02

02

12

మానవ అక్రమ రవాణా / అపహరణ

-

-

01

01

04

01

08

03

18

ఇతర

-

-

08

03

17

00

09

08

45

మొత్తం

09

07

23

40

37

43

70

45

274

 

 

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, అప్పగింత అభ్యర్థనలు ప్రస్తుతం మరింత సమర్థవంతమైన, ప్రామాణిక పద్ధతిలో చేస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థించిన దేశాలు కోరే అవసరాలు, చట్టపరమైన అంచనాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లిఖితపూర్వక హామీలు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన పరారీదారుల్లో ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్లు, ఆర్థిక నేరగాళ్లు, మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు మరియు హత్య, అత్యాచారం, పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ)- (పోక్సో) చట్టం కింద నేరాలకు పాల్పడిన నిందితులు ఉన్నారు.

తీవ్రవాదం, ఖలిస్తాన్ మద్దతుదారుల తీవ్రవాదం, గ్యాంగ్స్టర్-ఉగ్రవాద సంబంధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, నకిలీ కరెన్సీ వంటి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్థులను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చే కార్యక్రమం.. అమెరికా నుంచి తహవ్వర్ హుస్సేన్ రాణాను భారతదేశానికి అప్పగించడం సంక్లిష్టమైన ఉగ్రవాద కేసులను ఛేదించడంలో భారత్ సంకల్పానికి, నిరంతర న్యాయ, దౌత్య ప్రయత్నాలకు ఒక ముఖ్యమైన నిదర్శనం. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన విషయాలలో తీవ్రవాదం, మాదకద్రవ్యాల తీవ్రవాదం, సరిహద్దు మద్దతు నెట్వర్క్లను కొనసాగించేందుకు విదేశాల నుంచి పనిచేస్తున్న పరారీలో ఉన్నవారిని ఉపయోగించుకున్నారు.

పరారీలో ఉన్న నేరస్థులను భారతదేశానికి తిరిగి తీసుకురావడంలో సాధించిన విజయం యాదృచ్ఛికం కాదు, అది విశ్వసనీయత, పటిష్టమైన న్యాయపరమైన సన్నాహాలు, నిరంతర దౌత్యంతో కొనసాగిన పట్టుదల, పర్యవేక్షణల ఫలితం. దేశీయ స్థాయిలో, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబి), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) మరియు రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సన్నిహిత సమన్వయంతో ఈ ప్రయత్నం కొనసాగింది. ఇది నిజమైన "పూర్తి ప్రభుత్వ" విధానాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు పరారీలో ఉన్న నేరస్థుల తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు మరింత సమన్వయంతో పనిచేస్తాయి.

జనవరి 2026లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసి) ఆధ్వర్యంలో ఒక స్టాండింగ్ ఫోకస్ గ్రూప్ను ఏర్పాటు, భారతదేశ నుంచి పరారీదారుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన సంస్థాగత ముందడుగు. పరారీలో ఉన్న కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం, వాటికి సంబంధించిన పత్రాను ప్రామాణీకరించడం, సమాచార అంతరాలను పూరించడం, విదేశీ భాగస్వాములతో నిరంతర పర్యవేక్షణను కలిగి ఉండడం మరియు ప్రభుత్వ సంస్థలు ప్రారంభించిన కేసులకు జాతీయ స్థాయిలో మద్దతు అందించడమే ఈ గ్రూప్ బాధ్యత. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పరారీదారులు కేవలం మూసివేసిన కేసు ఫైళ్లు మాత్రమే కాదువారు నిరంతర, సమన్వయ, క్రియాశీల చర్యలు అవసరమైన ప్రత్యక్ష కార్యాచరణ ముప్పులుగా ఉంటారు.

గమనికను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

***


(रिलीज़ आईडी: 2294459) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , हिन्दी , Bengali , Bengali-TR , Odia , Khasi , English , Urdu , Marathi , Nepali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Telugu , Kannada