హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021-2026 మధ్య 36 దేశాల నుంచి స్వదేశానికి 274 మంది పరారీ నేరస్థుల తరలింపు


పరారీ నేరస్థులను తిరిగి తీసుకురావడంలో గత ప్రభుత్వాల్లో లోపించిన రాజకీయ సంకల్పం... పరారీ నేరస్థులను తిరిగి తీసుకురావడాన్ని జాతీయ ప్రాధాన్యతగా మార్చిన మోదీ ప్రభుత్వం

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో పరారీ నేరస్థులను ఎదుర్కోడానికి సమగ్ర, నిఘా, సాంకేతికత ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసిన భారత్

పరారీ నేరస్థుల కోసం మూడు కీలక అంశాలపై మోదీ ప్రభుత్వ వ్యూహం... ప్రపంచవ్యాప్త ఆపరేషన్లు, పటిష్టమైన సమన్వయం, చురుకైన దౌత్యం

దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న పరారీ నేరస్థుల అంశం

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో పరారీ నేరస్థులను తిరిగి భారత్‌కు తీసుకురావడాన్ని మిషన్ మోడ్‌లో చేపట్టిన ప్రభుత్వం

అప్పగింత వ్యవస్థ బలోపేతానికి అనేక చట్టపరమైన నిబంధనల అమలు

మోదీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ... గత మూడేళ్లలోనే 401 మంది పరారీ నేరస్థులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ

1,400కు పైగా సంస్థలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానిస్తూ భారత్‌పోల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం... తద్వారా సమాచార మార్పిడి కోసం పట్టే సమయం 3 నుంచి 10 రోజులకు తగ్గింపు

2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) సవరణ చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం (యూఏపీఏ)ను అమల్లోకి తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం

ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో పరారీ నేరస్థులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనల చేరిక

తొలిసారిగా బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 355, 356ల ద్వారా నిందితుడు హాజరుకాని సమయంలో కూడా విచారణ జరిపేందుకు వెసులుబాటు

మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్ఏ) కఠినంగా అమలు చేయడం ద్వారా 2019 నుంచి 2026 మధ్య పరారీ నేరస్థులకు చెందిన రూ.17,874 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

2019–2026 మధ్య దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నిధులతో సహా మొత్తం రూ.18,762 కోట్ల మేరకు విజయవంతమైన రికవరీ

ఆపరేషన్ త్రిశూల్ ద్వారా పేర్లు, గుర్తింపులు మార్చుకుని విదేశాల్లో దాక్కున్న పరారీ నేరస్థుల ఆచూకీని ఉపగ్రహ సాంకేతికత, డిజిటల్ ఫుట్‌ప్రింట్ల సాయంతో గుర్తింపు

प्रविष्टि तिथि: 04 AUG 2026 1:15PM by PIB Hyderabad

విదేశాలకు పారిపోయిన నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021 నుంచి 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. నేరస్థులకు తగిన శిక్ష పడేలా చూసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018లో ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టాన్ని’ తీసుకువచ్చారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా దిశానిర్దేశంలో పరారీ నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకునేరస్థులను స్వదేశానికి రప్పించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సాంకేతికత, ఇంటెలిజెన్స్ ఆధారిత సమగ్ర వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసింది.

 

2014కు ముందు దేశంలో నేరస్థుల అప్పగింత వ్యవస్థ చాలా పాతబడిపోయి బలహీనంగా ఉండేది. ఆ సమయంలో భారత్‌కు కేవలం 37 దేశాలతో మాత్రమే అప్పగింత ఒప్పందాలు ఉండేవి. ఆర్థిక నేరస్థులను శిక్షించడానికి లేదా వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎటువంటి ప్రత్యేక చట్టాలూ లేవు. 2004 నుంచి 2013 మధ్య కాలంలో ఏడాదికి సగటున కేవలం నలుగురు నేరస్థులను మాత్రమే భారత్‌కు తీసుకురాగలిగారు. అంతేకాకుండా 110 అప్పగింత విజ్ఞప్తులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. దీనికి తోడు అసంపూర్ణమైన పత్రాలు, నెమ్మదిగా సాగే ప్రక్రియ అప్పగింత వ్యవస్థను క్లిష్టతరం చేశాయి. దీనివల్ల తరచూ విదేశీ కోర్టులు భారత్ అభ్యర్థనలను తోసిపుచ్చేవి. డబుల్ జియోపర్డీ (ఒకే నేరానికి రెండుసార్లు శిక్షించకపోవడం), డ్యూయల్ క్రిమినాలిటీ (రెండు దేశాల్లోనూ నేరంగా పరిణగించే చర్య) వంటి న్యాయపరమైన అడ్డంకులు కూడా ఈ ప్రక్రియను ఆలస్యం చేసేవి.  హోం మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాల మధ్య సరైన సమన్వయం, ఏకీకృత వ్యూహం లేకపోవడం వల్ల పరారీలో ఉన్నవారిపై సమాచారాన్ని పంచుకోవడం, వారి ఆచూకీని గుర్తించడం, రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయడం వంటివి కూడా నెమ్మదిగా సాగాయి.

 

విదేశాలకు పారిపోయిన నేరస్థులను స్వదేశానికి రప్పించే అంశంలో గత ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం లోపించిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పరారీ నేరస్థుల అప్పగింతను ఒక ‘జాతీయ ప్రాధాన్యత’గా మార్చింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పరారీ నేరస్థులపై మూడు సూత్రాల వ్యూహాన్ని (ప్రపంచవ్యాప్త ఆపరేషన్లు, బలమైన సమన్వయం, చురుకైన దౌత్యం) అమలు చేస్తున్నారు. పరారీ నేరస్థుల అంశం దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉందని హోం మంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.

 

మోదీ ప్రభుత్వం 2019లో ఎన్‌ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టాలను తీసుకువచ్చింది. దీని ఆధారంగా 2020 నుంచి పరారీ నేరస్థులను భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియను మిషన్ మోడ్‌లో చేపట్టారు. దీని ఫలితంగా చట్టపరమైన చర్యలు కేవలం నిషేధిత సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా తీవ్రరూపం దాల్చాయి. విదేశాల్లో తిష్టవేసిన వ్యక్తిగత ఉగ్రవాదులు, వారిని నడిపించే హ్యాండ్లర్లు, నిధులను అందించే వ్యవస్థలు, సహాయక వ్యవస్థలను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో  పరారీలో ఉన్నవారిని పట్టుకోవడం, వారి వ్యవస్థలను నిర్మూలించడంలో భారత్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

 

పరారీ నేరస్థులకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను చేర్చుతూ మోదీ ప్రభుత్వం 2024లో మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్లు 355, 356 ద్వారా తొలిసారిగా నిందితుడు హాజరుకాకపోయినా విచారణ జరిపే విధానానికి అవకాశం కల్పించారు. దీనివల్ల పారిపోయిన నిందితుడు కోర్టుకు హాజరుకాకపోయినా, అతనికి వ్యతిరేకంగా విచారణ నుంచి శిక్ష ఖరారు వరకు ఉన్న సమగ్ర న్యాయ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలవుతుంది.

 

2022లో 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీకి భారత్ ఆతిథ్యమిచ్చింది. సమాచార మార్పిడి, భాగస్వామ్యం, సహకారం... అంతర్జాతీయ పోలీసు వ్యవస్థకు ఈ మూడు అంశాలనూ కీలకమైన ప్రాతిపదికలుగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆ సందర్భంగా స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే అంతర్జాతీయ సంస్థలతో భారత్‌కు సమన్వయాన్ని, అనుసంధానాన్ని, సమాచార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా.. 2025 జనవరిలో భారత్‌పోల్‌ను కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. సీబీఐ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాలు (ఇంటర్‌పోల్ లైజన్ అధికారులు - ఐఎల్ఓల ద్వారా), జిల్లా పోలీసు కార్యాలయాలను ఒకే వేదికపైకి తేవడం ద్వారా.. ఒక సమగ్ర సమాచార వ్యవస్థ భారత్‌పోల్ ఏర్పరచింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర, కేంద్ర సంస్థలకు చెందిన 1,400కు పైగా యూనిట్లను ఒకే పోర్టలుకు అనుసంధానించడం వల్ల సమాచార మార్పిడి సులభతరమైంది. ఫలితంగా సీబీఐ, చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థల మధ్య సమాచార వినిమయానికి పట్టే సమయం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సీబీఐ కోరిన సమాచారాన్ని ఇతర సంస్థలు 10 నుంచి 20 రోజుల్లోనే, కొన్ని సందర్భాల్లో 3 నుంచి 10 రోజుల్లోనే అందిస్తున్నాయి. ఇది దర్యాప్తులో సామర్థ్యాన్నీ, నిందితుల అప్పగింత చర్యలనూ వేగవంతం చేసింది. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి ఇప్పటివరకు 5 కీలక సమావేశాలను నిర్వహించారు.

 

మోదీ ప్రభుత్వం మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని (పీఎమ్‌ఎల్‌ఏ) మరింత కఠినంగా అమలు చేస్తోంది. పీఎమ్‌ఎల్‌ఏ నిబంధనలను పక్కాగా అమలు చేయడం ద్వారా... 2019 నుంచి 2026 మధ్య కాలంలో పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన రూ. 17,874 కోట్లకు పైగా ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనిపెట్టి, వారిని పట్టుకునే అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడం కోసం ఒక ‘ప్రత్యేక అంతర్జాతీయ వ్యవహారాల కేంద్రా’న్ని సీబీఐ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఇంటర్‌పోల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసు ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. నేరస్తుల గుర్తింపును, అరెస్టులను వేగవంతం చేస్తోంది. సమాచార మార్పిడిని మరింత సులభతరం చేయడం కోసం ప్రతి రాష్ట్రంలోనూ, అన్ని కేంద్ర విచారణ సంస్థల్లోనూ ‘ఇంటర్‌పోల్ కాంటాక్ట్ అధికారుల’ను కూడా సీబీఐ నియమించింది. ఇది పరారీలో ఉన్న నేరస్తులకు సంబంధించి.. దర్యాప్తులో సమన్వయాన్ని, అంతర్జాతీయ సహకారాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.

 

ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. 2022లో 40, 2023లో 100, 2024లో 107, 2025లో 112 నోటీసులు జారీ కాగా… 2026లో ఇప్పటివరకు 182 నోటీసులు జారీ అయ్యాయి. పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలను పటిష్టం చేయడం లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద శాటిలైట్ సమాచారం, నిఘా, డిజిటల్ ఆధారాల విశ్లేషణ ద్వారా.. ఇంటర్‌పోల్ సహకారంతో పరారీలో ఉండి దాక్కున్న నేరస్తుల స్థానాలను కచ్చితంగా గుర్తించారు. విదేశాల్లో తలదాచుకున్న చాలా మంది నేరస్తులు తమ పేర్లను, గుర్తింపులను మార్చుకున్నప్పటికీ.. సరికొత్త సాంకేతికత, ప్రొఫైల్ మ్యాపింగ్ ద్వారా భారతీయ విచారణ సంస్థలు వారిని గుర్తించి ఆచూకీ తీశాయి. కోర్టు విచారణలకు వీడియో కాన్ఫరెన్సుల వంటి సాంకేతికతను వినియోగిస్తూ.. నిందితుల అప్పగింత ప్రక్రియను, చట్టపరమైన చర్యలను మరింత వేగవంతం చేశారు. గత మూడేళ్లలో పరారీలో ఉన్న 401 మంది నేరస్తులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేశారు.

గత అయిదేళ్లలో పరారీలో ఉన్న 274 మంది నేరస్తులను తిరిగి వెనక్కు తీసుకొచ్చారు. సంవత్సరాల వారీగా వివరాలిలా ఉన్నాయి:

 

నేర విభాగం

2019

2020

2021

2022

2023

2024

2025

2026

(జూలై వరకు)

మొత్తం

 

మోసం/ఆర్థిక నేరాలు

-

-

-

01

-

04

03

01

09

ఉగ్రవాద కార్యకలాపాలు/ దేశ వ్యతిరేక కార్యకలాపాలు/ మాదకద్రవ్య ఉగ్రవాదం

-

-

01

04

02

04

05

01

17

వ్యవస్థీకృత నేరాలు/ గ్యాంగ్‌స్టర్లు/ బలవంతపు వసూళ్లు

01

01

-

04

03

05

14

14

42

హత్య/ దోపిడీ/ హింసాత్మక నేరాలు

06

06

03

11

07

11

09

09

62

లైంగిక నేరాలు/అత్యాచారాలు/పోక్సో

02

-

04

13

04

15

13

02

53

మాదకద్రవ్యాలు/ఎన్‌డీపీఎస్/మాదకద్రవ్యాల అక్రమ రవాణా

-

-

02

01

-

01

07

05

16

స్మగ్లింగ్/ నకిలీ కరెన్సీ/ సైబర్/ నిషేధిత సరుకులు

-

-

04

02

-

02

02

02

12

మానవ అక్రమ రవాణా/ అపహరణ

-

-

01

01

04

01

08

03

18

ఇతరాలు

-

-

08

03

17

00

09

08

45

మొత్తం

09

07

23

40

37

43

70

45

274

 

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గనిర్దేశంలో... ప్రస్తుతం నేరస్తుల అప్పగింత విజ్ఞప్తులను మరింత పక్కాగా, ప్రామాణిక పద్ధతిలో సిద్ధం చేస్తున్నారు. దీనికితోడు.. అభ్యర్థనలు చేసే దేశాల చట్టపరమైన నిబంధనలు, వివిధ పత్రాల ఆవశ్యకతను కూలంకషంగా పరిశీలించి లిఖితపూర్వక హామీలను ఇస్తున్నారు. భారత్‌కు తిరిగి రప్పించిన వారిలో ఉగ్రవాదం, గ్యాంగ్‌స్టర్లు, ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల విక్రయదారులతోపాటు.. హత్యలు, అత్యాచారాలు, పోక్సో చట్టం కింద నేరాలకు పాల్పడి పరారైన నిందితులు ఉన్నారు.

 

విదేశాల్లో దాక్కున్న నేరస్తులను భారత్‌కు తిరిగి రప్పించే కార్యక్రమాన్ని.. ఉగ్రవాదం, ఖలిస్థాన్ మద్దతుదారుల తీవ్రవాదం, గ్యాంగ్‌స్టర్లు - ఉగ్రవాద సంబంధాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, నకిలీ కరెన్సీ వంటి కేసులకు విస్తరించారు. అమెరికా నుంచి తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు రప్పించడం కీలకమైన విజయంగా చెప్పొచ్చు. సంక్లిష్టమైన ఉగ్రవాద కేసుల్లో భారత్ కనబరుస్తున్న పట్టుదలకు, నిరంతర చట్టపరమైన, దౌత్యపరమైన కృషికి ముఖ్యమైన ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అంశాల్లో.. పరారీలో ఉండి విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న వ్యక్తులను ఉగ్రవాదం, మాదకద్రవ్య ఉగ్రవాదం, విదేశాల్లో ఉగ్రవాద మద్దతు వ్యవస్థలను కొనసాగించడానికి ఉపయోగించుకుంటున్నారు.

 

విదేశాల్లో పరారీలో ఉన్న నేరస్తులను భారత్‌కు తిరిగి రప్పించడంలో సాధించిన విజయం యాదృచ్ఛికం కాదు.. చట్టపరమైన సన్నాహాలు, నిరంతర దౌత్యపరమైన కృషి, క్రమం తప్పకుండా సంప్రదింపులతో భారత్ సాధించిన విశ్వసనీయత ఫలితమిది. ఈ కృషి వెనుక దేశీయంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), సీబీఐ (సీబీఐ), రా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ), వస్తు సేవల పన్ను నిఘా డైరెక్టరేట్ జనరల్ (డీజీజీఐ), రాష్ట్ర పోలీసు బలగాల మధ్య ఉన్న బలమైన సమన్వయం ఉంది. పరారీలో ఉన్న నేరస్తులను తిరిగి రప్పించి, బాధితులకు వేగంగా న్యాయం చేసే దిశగా.. కేంద్ర, రాష్ట్ర సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్న నిజమైన ‘ఏకోన్ముఖ ప్రభుత్వ’ విధానానికి ఇది అద్దం పడుతోంది.

 

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పరిధిలో పనిచేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సమన్వయ బృందాన్ని (స్టాండింగ్ ఫోకస్ గ్రూప్‌) 2026 జనవరిలో కేంద్రం ఏర్పాటు చేసింది. పరారీలో నేరస్థులను తిరిగి రప్పించే నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకున్న కీలక సంస్థాగత చర్యగా ఈ ప్రత్యేక వ్యవస్థను పేర్కొనవచ్చు. ఈ సంస్థ పరారీలో ఉన్న నేరస్తులకు సంబంధించి కేసులను ప్రాధాన్యతా క్రమంలో వర్గీకరించడం, నేరస్తుల సమగ్ర సమాచార పత్రాలను ప్రామాణిక పద్ధతిలో తయారు చేయడం, కేసులకు సంబంధించి సమాచార అంతరాలను తొలగించడం, విదేశీ భాగస్వామ్య సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించడం, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులకు జాతీయ స్థాయిలో మద్దతు అందించడం ఈ సంస్థ విధులు. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పరారీలకు సంబంధించిన అంశాలు కేవలం మూలనపడ్డ కేసు ఫైళ్లు మాత్రమే కావు.. అది సజీవంగా కొనసాగుతున్న ముప్పు. దానిని ఎదుర్కోవాలంటే నిరంతర, సమన్వయపూర్వక, ముందస్తు చర్యలు క్రియాశీల చర్యలు అత్యావశ్యకం.  

 

***


(रिलीज़ आईडी: 2294291) आगंतुक पटल : 103