ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కాంస్య పతక విజేతగా శిల్పా కంచుగరకొప్పాలు శైల.. ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
28 JUL 2026 2:14PM by PIB Hyderabad
గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన శిల్పా కంచుగరకొప్పాలు శైలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
శిల్ప తన కెరియర్లో అత్యుత్తమ ప్రదర్శననిచ్చి ఈ విజయాన్ని మరింత విశిష్టమైందిగా మార్చేశారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ విజయానికి గాను శ్రీ మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘2026 కామన్వెల్త్ క్రీడల్లో శిల్పా కంచుగరకొప్పాలు శైల అద్భుత ప్రదర్శనను కనబరిచారు!
మహిళా షాట్ పుట్ ఎఫ్57 ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గాను శిల్పకు హృదయపూర్వక అభినందనలు. ఇది ఆమె కెరియర్లోనే అత్యుత్తమ ప్రదర్శన. ఇది నిజంగా ప్రశంసనీయ విజయం’’
***
(रिलीज़ आईडी: 2290459)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Gujarati
,
Malayalam