ప్రధాన మంత్రి కార్యాలయం
సిక్కిమ్ లోని గాంగ్‌టక్‌లో యువతతో ఫుట్‌బాల్ ఆటలో పాలుపంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 APR 2026 9:46AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం సిక్కిమ్‌లోని గాంగ్‌టక్‌లో యువతీయువకులతో కలసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆటలో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘గాంగ్‌టక్‌లో ఓ అందమైన ఉదయం.. సిక్కిమ్‌కు చెందిన నా యువ నేస్తాలతో కలసి ఫుట్‌బాల్ ఆడిన అనుభవానికి సాటి రాగలిగింది మరేదీ లేనే లేదు!’’
‘‘ఈ యువ క్రీడాకారులతో కలసి ఫుట్‌బాల్ ఆడడం నిజంగా ఎంతో ఉత్సాహాన్ని నింపింది.’’
‘‘గాంగ్‌టక్‌లో ఉదయం మేం ఫుట్‌బాల్ ఆడాం. మేం నేర్చుకున్నాం.. ఆడాం.. పండగ చేసుకున్నాం. అన్నింటినీ మించి, ఆటలో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించాం మేం’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2256154)
आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam